Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ? కొబ్బరికాయ కొడితే ఏమవుతుంది ? 
- లక్ష్మి రమణ 

గర్భం ధరించిన స్త్రీలకి ఎన్నో అనుమానాలు సహజమే. తొలిసారి గర్భవతులైన వారికి ఈ అనుమానాలు మరీ ఎక్కువ . ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవారు ఉండేవారు . ఇటువంటి సమయాల్లో ఎలా మెలగాలి ? ఏం చేయాలి ? ఏం  చేయకూడదు అనే విషయాలు వారు విడమరిచి చెబుతూ , అనుక్షణం కంటికి రెప్పలా కాచుకొని ఉండేవారు. ప్రస్తుతం మారిన జీవన విధానంతో సర్దుకుపోయే కాలం కదా ! అందువల్ల ఇటువంటి చిన్న విషయాల గురించి వివరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు మరింతగా ఏర్పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి . 

 గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు . అలాగే,  కొబ్బరి కాయ కూడా కొట్టకూడదు అని అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే, మూడవ నెల రాగానే గర్భంలో ఉండే పిండం ప్రాణం పోసుకుంటుంది. అప్పటి నుంచి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయానికి వెళ్లడం, మెట్లు గబాగబా ఎక్కడం, అపరిశుభ్రమైన ప్రదేశాల్లో, జనసమ్మర్దం ఎక్కువగావుండే ప్రదేశాల్లో  కూర్చుని తినడం, ప్రదక్షిణాలు చేయడం, ఆలయాల్లో పాటించాల్సిన నియమాలన్నీ మామూలు వ్యక్తుల్లా పాటిస్తుండడం వల్ల ఒకవేళ గర్భం కోల్పోయే పరిస్థితి వస్తే అది మహాపచారం. 

అందుకే పెద్దలు శాస్త్రంలో ఏడవ నెల లోపు ఎత్తైన మెట్లు ఉన్న దేవాలయాలు, కొండపై ఉన్న ఆలయాలకు వెళ్లకూడదు అని చెబుతారు.  అదేవిధంగా , నదులు దాటకూడదు, కొండలు ఎక్కకూడదు అనే నియమాలు గర్భిణీ స్త్రీలకు చెప్పబడ్డాయి. ఇక ఏడవ నెల ప్రసవ మాసంగా చెప్పబడుతుంది. కాబట్టి ఏడవ నెల నుంచి గర్భిణీ స్త్రీతో పాటు, ఆమె భర్త కూడా దేవాలయ ప్రవేశం చేయకూడదు అని శాస్త్రం చెబుతోంది. 

ఏడవ నెల నుంచి గర్భిణీ స్త్రీలకు జాతాశౌచం ఉంటుంది .  పిల్లలు పుట్టినప్పటి నుంచి వచ్చే మైలను జాతాశౌచం అంటారు. ఆ విధంగా వారి ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికి, దేవాలయ దర్శనానికి భార్యా భర్తలకి  అర్హత ఉండదు. ముఖ్యంగా మూల నక్షత్రం, అనూరాధ నక్షత్రం, అశ్విని నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, కలిగిన మహిళలు గర్భం ధరించిన తర్వాత 5 వ నెల నుండే ఆలయాలకు వెళ్లకూడదు అని శాస్త్రం చెబుతోంది. అయితే గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసమే శాస్త్రంలో ఇలా దేవాలయాలకు వెళ్లకూడదు అని చెప్పబడిందని పండితులు అంటున్నారు. 

ఇక గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కూడా కొట్టకూడదని శాస్త్రం చెబుతోంది. మహిళ గర్భవతిగా వున్నపుడు 3 వ నెల నుండీ ,  గర్భములో పిండము ప్రాణము పోసుకుంటుంది.  కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము. అదికూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానంగా శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి కొబ్బరికాయను పగలగొట్టడం, విచ్చేదన చేయడము మంచిది కాదని కొబ్బరికాయ కొట్టవద్దు అని చెబుతారు .  అలాగే, కొబ్బరికాయ కొట్టినప్పుడు కొంతమంది ఆ అదురుని భరించలేరు . దానివల్ల కూడా గర్భం జారిపోయే ప్రమాదం ఉంటుంది . అందుకే పెద్దలు గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు , కొబ్బరి కాయ కొట్టకూడదు అని చెబుతూంటారు. అదీ విషయం . 

శుభమ్ . 

pregant woman, women, temple, coconut

#pregnantwoman #temple #coconut

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore