Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
- లక్ష్మి రమణ 

హిందూ సంప్రదాయంలో , భారతీయ గణన ప్రకారం అర్థరాత్రి 12 గంటలకి మరో రోజు మొదలవుతుందా లేదా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది . పుట్టిన రోజు వేడుకలకి అర్థరాత్రులే వేదికలవుతున్న వేళ మనం దీని గురించి విస్తారంగా చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది .  అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకి కేక్ కోసి , సరదాగా కోక్ తాగేసి కాసేపు అల్లరి చేసేస్తుంటాం కదా ! 

కానీ , ఉదయాదుదయం వారం అని మన శాస్త్రం చెబుతోంది . ఉదయం అంటే బ్రహ్మీ ముహూర్తం అని అర్థం . అంతే కానీ అర్థ రాత్రి 12 గంటలకి మరో రోజు మొదలయినట్టు కాదు .  పైగా ఆ సమయంలో అసురీ శక్తులు విజృభించి ఉంటాయని మన ధర్మం చెబుతోంది . కాబట్టి ఆ సమయంలో పుట్టిన రోజులు చేసుకోవడం ఖచ్చితముగా మన ధర్మానికి , మన సంప్రదాయాన్ని విరుద్ధమైన విషయమే . 

ఇక కాలానికి వస్తే, ఉదయం కనీసం మూడు గంటల సమయం అయ్యేవరకూ మనకి రాత్రి కిందే లెక్క .  కనుక రోజు గడిచినట్టు కానే  కాదు . ఇది పరాయి పాలకుల ప్రభావమే కాకుండా, పాశ్చ్యాత్య దేశాలలో మనవారు ఎక్కువగా వలస పోయి అక్కడి సంప్రదాయాలు ఇక్కడికి దిగుమతి చేసుకోవడం వలన ఏర్పడిన అలవాటు కూడా ! దానిని పక్కన పెట్టేసి ఇప్పటికైనా మన సంస్కృతిని ఆచరించడం మొదలుపెట్టడం మంచిది . 

చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా , స్వధర్మమే మిన్న అనే నానుడిని మనం సదా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది .  

midnight, 12am, day change, brahmi muhurtam, muhurtam, brahmi, brahma, 

#midnight #daychange #brahmimuhurtam

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi