Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ? 
- లక్ష్మి రమణ 

 భలేవారండీ ! ఎంత పూజలో ఉంటే మాత్రం తుమ్మ కుండా దగ్గకుండా ఉండాలంటే ఎలా ? వాటినేమైనా మనం కోరి తెచ్చుకుంటున్నామా ? మనం ఆగిపోమంటే అవి ఆగిపోతాయా ? అని అనుకోవడం సహజమే !! వాటిని ఆపుకోమని ఎవరు చెప్పారు ? మన ధర్మం ఎప్పుడూ మంచినే కదా చెబుతుంది .అయితే, అది అపచారం అనేమాట మాత్రం కరక్టే !  అలా జరిగినప్పుడు ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది . 

మన శరీరంలో వాయు ప్రసారం అనేక రకాలుగా జరుగుతూనే ఉంటుంది . వాయువే ప్రాణాధారము , ప్రాణము కూడా ! శ్వాస ఆగితే , శరీరం నిలబడుతుందా ? లేదు కదా ! అందుకే ప్రాణమే వాయువు అని చెప్పేది . ఈ వాయువు , ప్రాణ , అపాన , వ్యాన, ఉదాన , సమాన అనే ఐదు రకాలుగా ఉంటుంది .  వీటినే కదా మనం పంచప్రాణాలు (పంచభూతాలతో నిర్మితమైన శరీరాల్లో పంచ ప్రాణ స్వరూపమై ప్రాణ వాయువు సంచరిస్తుంది) అంటున్నాం . వీటి సంచారము వల్లే మనకి తుమ్ము, దగ్గు, ఆవలింతలు, అపానవాయువు వస్తూంటాయి . చివరికి కనురెప్ప కొట్టడానికి కూడా ఈ వాయువే మనకి సహాయ పడుతూ ఉంటుంది . 

ఇదిలా ఉంటె, మన ఇంటికి ఎవరైనా అతిధి వచ్చారనుకోండి , వారి ముందర గట్టిగా తుమ్మడం, దగ్గడం, అపానవాయులు వదలడం  చేస్తే,   అమర్యాదగా ఉంటుంది . అవునాకాదా !మరి మనం ఆ పరమాత్మనే ఆహ్వానించి , ఆసనం వేసి కూర్చో బెట్టి ఆరాధిస్తూ , ఇవన్నీ చేయడం ఆయనకి అపచారం చేసినట్టే కదా ! 

అలాగని శరీరంలో అసంకల్పితంగా జరిగే వీటిని నియంత్రించమని కాదు , నియంత్రించలేము , కూడదు కూడా ! ఇలాంటప్పుడు ఎంచేయాలంటే, శ్రాస్త్రాన్ని అనుసరించి తుమ్ము వచ్చినా, అపానవాయువు విడిచినా , కన్నీరు, కోపం వంటి భావోద్వేగాలు కలిగినా , ఆచమనం చేస్తే, ఆ దోషం పోతుంది . అలాగే, అసౌచులని చూసినా సరే ( రుతుక్రమంలో ఉన్న స్త్రీలు , మైలలో ఉన్నవారు , ఇతరత్రా) ఆచమనం చేసి,  కుడి చేతితో కుడి చెవిని తాకాలి . 

ఈ సారి పూజాదికాలు నిర్వర్తించేప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారు కదూ ! 

శుభం . 

Pooja, puja, cough, sneeze

#pooja #puja

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

Love is an endless mystery, for it has nothing else to explain it.…

__________Rabindranath Tagore