Online Puja Services

Shuklambaradharam Vishnum 
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye

 
చాంద్రమానం ప్రకారం కాలవిభజన ఎంత అద్భుతంగా ఉందో చూడండి .
- లక్ష్మి రమణ  
వైదికంలో చంద్రుడుని అనుసరించి కాలంని విభజించారు. చాంద్రమానం ప్రకారం ఒక రోజుని తిధి అని అంటారు. అలా నెలలో 30 రోజుల ఉంటాయి. మొదటి 15 రోజులుని శుక్ల పక్షం అని తరువాత 15 రోజులుని కృష్ణ పక్షం అని అంటారు.
పాడ్యమి,విదియ,తదియ,చవితి,పంచమి,షష్టి,సప్తమి,అష్టమి,నవమి,దశమి,ఏకాదశి,ద్వాదశి,త్రయోదశి,చతుర్దశి,పౌర్ణమి(శుక్లపక్షంలో)/అమావాస్య(కృష్ణపక్షంలో) అనేవి తిధులు.
 
12 నెలలు ఒక సంవత్సరం,
అవి:  చైత్రం,వైశాఖం,జ్యేష్ఠం,ఆషాడం,శ్రావణం,భాద్రపదం,ఆశ్వయూజం,కార్తీకం,మార్గశీర్షం,పుష్యం, మాఘం,ఫాల్గుణం
 
చైత్రం,వైశాఖం నెలలు కలిపి వసంత ఋతువు

జ్యేష్ఠం,ఆషాడం నెలలు కలిపి గ్రీష్మ ఋతువు

శ్రావణం,భాద్రపదం నెలలు కలిపి వర్ష ఋతువు

ఆశ్వయూజం,కార్తీకం నెలలు కలిపి శరద్ ఋతువు

మార్గశీర్షం,పుష్యం నెలలు కలిపి హేమంత ఋతువు

మాఘం,ఫాల్గుణం నెలలు కలిపి శిశిర ఋతువు

 
ప్రతి నెలలో విశేష తిధులు ఉంటాయి ఆరోజులో చేయతగినవి, చేయకూడనివి వేదంలో వివరించారు. ప్రతి నెలలో వచ్చే విశేష తిధులు కింద చెప్పబడినవి
మాసం/నెల పేరు: చైత్రం:-
విశేష తిధులు: 
శుక్ల/శుద్ధ పాడ్యమి - ఉగాది (తైలాభ్యంగ స్నానం, నూతన పంచాంగ శ్రవణం),వసంత నవరాత్రులు

శుక్ల/శుద్ధ పంచమి - శ్రీ పంచమి

శుక్ల/శుద్ధ నవమి - శ్రీ రామనవమి

శుక్ల/శుద్ధ దశమి - ధర్మరాజ దశమి

శుక్ల/శుద్ధ ఏకాదశి - కామద ఏకాదశి/మతత్రయ ఏకాదశి

శుక్ల/శుద్ధ ద్వాదశి - వామన ద్వాదశి

శుక్ల/శుద్ధ త్రయోదశి - అనంగ త్రయోదశి

పౌర్ణమి - మదన పౌర్ణమి

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - సర్వేషాం ఏకాదశి, వరూధిని ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

అమావాస్య - సర్వేషాం అమావాస్య

 
మాసం/నెల పేరు: వైశాఖం:-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ విదియ - పరశురామ జయంతి

శుక్ల/శుద్ధ తదియ - అక్షయతృతీయ

శుక్ల/శుద్ధ పంచమి - శ్రీ శంకర జయంతి

శుక్ల/శుద్ధ ఏకాదశి - శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం

శుక్ల/శుద్ధ త్రయోదశి - శ్రీ నృశింహ జయంతి

పౌర్ణమి - శ్రీ అన్నమాచార్య జయంతి

కృష్ణ/బహుళ పాడ్యమి - శ్రీ కంచి పరమాచార్యుల జయంతి

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ దశమి - హనుమ జయంతి

కృష్ణ/బహుళ ఏకాదశి - మతత్రయ ఏకాదశి, అపర ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

అమావాస్య - సర్వేషాం అమావాస్య

 
మాసం/నెల పేరు: జ్యేష్ఠం:-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ దశమి - దశపాపహర దశమి

శుక్ల/శుద్ధ ఏకాదశి - నిర్జల ఏకాదశి, సర్వేషాం ఏకాదశి

శుక్ల/శుద్ధ ద్వాదశి - రామలక్ష్మణ ద్వాదశి, శ్రీ శంకరాచార్యుల కైలాస గమనం

పౌర్ణమి - ఏరువాక పౌర్ణమి,వృషభపూజ

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - యోగినీ ఏకాదశి, సర్వ ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

అమావాస్య - సర్వేషాం అమావాస్య

 
మాసం/నెల పేరు: ఆషాడం :-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ విదియ - పూరీ శ్రీ జగన్నాథస్వామి రథోత్సవం

శుక్ల/శుద్ధ పంచమి - స్కంద పంచమి

శుక్ల/శుద్ధ షష్టి - కుమార షష్టి

శుక్ల/శుద్ధ ఏకాదశి - తొలి ఏకాదశి,హరిశయన ఏకాదశి,చాతుర్మాస్య వ్రతారంభం

శుక్ల/శుద్ధ ద్వాదశి - వాసుదేవ ద్వాదశి

పౌర్ణమి - వ్యాసపౌర్ణమి,గురుపౌర్ణమి

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - కామైక ఏకాదశి, సర్వ ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

అమావాస్య - సర్వేషాం అమావాస్య

 
మాసం/నెల పేరు: శ్రావణం :-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ పంచమి - గరుడ పంచమి

పౌర్ణమి - జంద్యాల పౌర్ణమి

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ అష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

కృష్ణ/బహుళ ఏకాదశి - మతత్రయ ఏకాదశి, అజ ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

అమావాస్య - పొలాల అమావాస్య

 
మాసం/నెల పేరు: భాద్రపదం :-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ చతుర్థి - శ్రీ సిద్ధి వినాయకచవితి, గణపతి నవరాత్రారంభం

శుక్ల/శుద్ధ పంచమి - ఋషి పంచమి

శుక్ల/శుద్ధ ఏకాదశి - సర్వేషాం ఏకాదశి,పరివర్తన ఏకాదశి

శుక్ల/శుద్ధ ద్వాదశి - వామన జయంతి

శుక్ల/శుద్ధ చతుర్దశి - శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం

కృష్ణ/బహుళ పాడ్యమి - మహాలయ పక్ష ప్రారంభం

కృష్ణ/బహుళ విదియ - బృహత్యుమావ్రతం

కృష్ణ/బహుళ తదియ - ఉండ్రాళ్ళ తద్ది

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ అష్టమి - మధ్వాష్టమి,అనఘాఅష్టమి

కృష్ణ/బహుళ ఏకాదశి - మతత్రయ ఏకాదశి, జయ ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

అమావాస్య - మహాలయ అమావాస్య, సర్వేషాం అమావాస్య

 
మాసం/నెల పేరు: ఆశ్వయూజం :-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ పాడ్యమి - శ్రీ దేవీ నవరాత్రులు ప్రారంభం

శుక్ల/శుద్ధ విదియ - ప్రీతి విదియ

శుక్ల/శుద్ధ అష్టమి - దుర్గాష్టమి

శుక్ల/శుద్ధ నవమి - మహర్నవమి

శుక్ల/శుద్ధ దశమి - విజయ దశమి

శుక్ల/శుద్ధ ఏకాదశి - పరాంకుశ ఏకాదశి

శుక్ల/శుద్ధ ద్వాదశి - గోపద్మనాభద్వాదశి,గోద్వాదశి

పౌర్ణమి - వాల్మీకి జయంతి

కృష్ణ/బహుళ తదియ - అట్లతద్ది

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - మతత్రయ ఏకాదశి, రమా ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - నరక చతుర్దశి, ధన్వంతరి జయంతి, మాసశివరాత్రి

అమావాస్య - దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజ, కేదారవ్రతం, సర్వేషాం అమావాస్య

 
మాసం/నెల పేరు: కార్తీకం :-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ పాడ్యమి - ఆకాశ దీప ప్రారంభం, కార్తీక స్నానాలు

శుక్ల/శుద్ధ విదియ - యమవిదియ,భగినీహస్త భొజనం, అన్నాచెల్లెలి పండగ

శుక్ల/శుద్ధ చతుర్ది - నాగులచవితి

శుక్ల/శుద్ధ పంచమి - నాగ పంచమి

శుక్ల/శుద్ధ అష్టమి - కార్తవీర్యజయంతి

శుక్ల/శుద్ధ దశమి - యజ్ఞవల్క్య జయంతి

శుక్ల/శుద్ధ ఏకాదశి - భోదన ఏకాదశి

శుక్ల/శుద్ధ ద్వాదశి - క్షిరాబ్ది ద్వాదశి

శుక్ల/శుద్ధ త్రయోదశి - చాతుర్మాస్య వ్రతసమాప్తి

పౌర్ణమి - కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - ఉత్పన్న ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

అమావాస్య - సర్వేషాం అమావాస్య

 
మాసం/నెల పేరు: మార్గశీర్షం:-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ షష్టి - సుబ్రహ్మణ్య షష్టి

శుక్ల/శుద్ధ అష్టమి - కాలభైరవాష్టమి

శుక్ల/శుద్ధ ఏకాదశి - గీతాజయంతి,మోక్షద ఏకాదశి

శుక్ల/శుద్ధ త్రయోదశి - హనుమద్ వ్రతం

పౌర్ణమి - దత్తాత్రేయ జయంతి,కోరల పౌర్ణమి

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - మతత్రయ ఏకాదశి, సఫల ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి,కృష్ణంగారక చతుర్దశి

అమావాస్య - సర్వేషాం అమావాస్య

 
మాసం/నెల పేరు: పుష్యం:-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ ఏకాదశి - వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి,ఉత్తర ద్వార దర్శనం

శుక్ల/శుద్ధ ద్వాదశి - శ్రీ కూర్మ ద్వాదశి

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - మతత్రయ ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

అమావాస్య - చొల్లంగి అమావాస్య

 
మాసం/నెల పేరు: మాఘం:-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ పంచమి - శ్రీ పంచమి,మదన పంచమి

శుక్ల/శుద్ధ సప్తమి - రధ సప్తమి, శ్రీ సూర్య జయంతి

శుక్ల/శుద్ధ అష్టమి - భీష్మాష్టమి

శుక్ల/శుద్ధ ఏకాదశి - భీష్మ ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - మతత్రయ ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మహాశివరాత్రి

 
మాసం/నెల పేరు: ఫాల్గుణం:-
విశేష తిధులు:
శుక్ల/శుద్ధ పంచమి - శ్రీ కంఠ జయంతి

శుక్ల/శుద్ధ ఏకాదశి - మతత్రయ ఏకాదశి, అమలక ఏకాదశి

శుక్ల/శుద్ధ ఏకాదశి - నరసింహ ద్వాదశి

పౌర్ణమి - లక్ష్మి జయంతి

కృష్ణ/బహుళ పాడ్యమి - వసంతోత్సవం

కృష్ణ/బహుళ చతుర్థి - సంకష్టహర చతుర్థి

కృష్ణ/బహుళ ఏకాదశి - పాపవిమోచన ఏకాదశి, మతత్రయ ఏకాదశి

కృష్ణ/బహుళ చతుర్దశి - మాసశివరాత్రి

కృష్ణ/బహుళ అమావాస్య - సర్వేషాం అమావాస్య,కొత్త అమావాస్య

సంకలనం: కోటేశ్వర్
 
Distribution of time as per chandramanam
Chaitra, Vaisakha, Jyesta, Ashada, Sravana, Bhadrapada, Aswayuja, Karthika, Margasira, Pushya, Magha, Phalguna
 
#chandramanam #moon #telugumonths
 

Videos View All

గర్భవతులు దేవాలయానికి వెళ్లకూడదా ?
దీపం పెట్టేటప్పుడు కుందిలో వత్తిని ఏ ముఖంగా వెలిగించాలి ?
పూజ మధ్యలో తుమ్ములు, దగ్గు లాంటివి వస్తే ఏంచేయాలి ?
అర్థరాత్రి 12 గంటలకి తేదీ మారుతుంది కదా! ఒక రోజు గడిచినట్టేనా ?
ఇంట్లో వచ్చే మున్సిపల్ నీటిని పూజకి వాడుకోవచ్చా ?
మన ధర్మం వివాహానికి అగ్నిని సాక్షిగా పరిగణిస్తుంది . ఎందుకు ?

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi