Shuklambaradharam Vishnum
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye
గుడిలోకి తాబేలు ఎలా ప్రవేశించిందో పూజారులకే అర్ధం కాలేదు. వీడియో చూడండి.ఇవాళ తెల్లవారు జామున చిలుకూరు బాలాజీ దేవాలయం లోపల కల శివాలయంలో ఒక తాబేలు, కూర్మ మూర్తి ఎక్కడి నుంచో ప్రవేశించి కనిపించింది.దానికి ప్రవేశించడానికి దారి లేదు దాదాపు పది సెంటీమీటరు పొడవు ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఈ తాబేలు ఎలా ప్రవేశించిందో ఆశ్చర్యంగా ఉంది అని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం గారు తెలియజేశారు.
ఈ కూర్మ మూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తూ ఉన్నది పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మావతారం పైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకి అనేటటువంటి సర్పంతో ఒకవైపు దేవతలు ఒకవైపు అసురులు మదించారు.ఇప్పుడు కూడా covid 19 నీ జయించడం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తున్నది సాగర మథనంలో హాలాహలం వచ్చింది దానిని పరమశివుడు మింగుతాడు అలాగే ఇవాళ చిలుకూరులో సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు త్వరలో లోకం నుండి డి ఇ వైరస్ అంతా పోతుంది. అమృతం లభిస్తుంది అని సూచిస్తున్నట్లు గా ఉన్నది.భక్తులు చేసేటటువంటి ప్రార్థనలు డాక్టర్ల ప్రయత్నాలు ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు అన్నిటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుంది.
సీఎస్ రంగరాజన్
చిలుకూరు బాలాజీ దేవాలయం.