Shuklambaradharam Vishnum
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyaayeth
Sarvavighnopashantaye
పూర్వం పురుడు వచ్చినా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించినా ఆశౌచం(మైల) పాటించేవారు. ఈ విధానం భారతీయ సనాతన ధర్మం ప్రతిపాదించింది. దానిని చాదస్తం లేదా మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నాం. దానిని విశ్లేషిస్తే ఒక వాస్తవం వెలుగు చూస్తోంది. అదేమిటంటే:
ఒక ఇంటిలో శిశువు జన్మిస్తే, ఆ సమయములో తల్లి గర్భము నుంచి కలుషిత వ్యర్ధాలు అనగా నెత్తురులాంటివి అనేకం వెలువడతాయ్. అవి వాతావరణములో అనేక హానికారక సూక్ష్మజీవులు(వైరస్) ఉత్పత్తికి దోహదం చేస్తాయి ఆ పరిసర ప్రదేశాలలోఅనగా ఆ ఇంటిలో లేదా ఆ గదిలో. ఆ యజమానికి సంబంధించిన దగ్గరి(అన్నదమ్ముల కుటుంబాలు) బంధువులు పరామర్శకి(చెడు అర్ధాన్ని ఆపాదించకండి) వచ్చి అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అటువంటి వారిని ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సాధారణముగా వైరస్ జీవన ప్రమాణం 10 రోజులు. అందుకే 11వ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిపిన నీటితో సంపూర్ణ స్నానం చేయాలి అక్కడి వస్తువులన్నీ పసుపు(క్రిమి సంహారిణి) కలిపిన నీటితో శుద్ధి చెయ్యాలి అన్నారు. దీనినే పురిటి శుద్ధి అన్నారు.
ఇక మరణశౌచం అనగా మరణం కారణముగా ఏర్పడే మైల:
మనం గమనిస్తే మరణించిన మానవ శరీరం చుట్టూ క్షణాలలో చీమలు అపరిమితముగా గుమిగూడుతుంటాయ్. వాతావరణములో మార్పుల కారణముగా కనపడని సూక్ష్మజీవులు ఇంకెన్ని కోట్లలో ఆ ప్రదేశములో గుమిగూడతాయో చెప్పలేము. ఆ సమయములో ఆ ఇంటిపేరువారు (జ్ఞాతులు) అక్కడికి వచ్చి ఉండడం జరుగుతుంది. పైన చెప్పినట్లుగానే సూక్ష్మజీవులు జీవనప్రమాణం ఆధారంగా 11వ రోజు శుద్ధి స్నానం చేయమంది శాస్త్రం. జ్ఞాతులు కానివారిని(పెండ్లి అయిన ఆడబడుచులను ఇత్యాది వారిని) 4వ రోజున శుద్ధి స్నానం చేయమంది. కారణం వారు సాధారణముగా వారి నిజావాసాలకు చేరతారు శవ దహనం తరువాత. అంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం ఉండే స్థానాలకు తిరిగి వెళ్లిపోయేరు కాబట్టి *3 రోజులు మైలగా పరిగణించారు. అదే విధముగా శవం ఉన్న సమయములో చుట్టుపక్కల వంట వంటి కార్యక్రమాలు నిషేధించి ఆ ప్రాంతము నుంచి శవం తొలగించిన తరువాత అక్కడి నివాసులు స్నానం చేసి వంట భోజన కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఈ విధానాన్ని *భారతీయ సనాతన ధర్మం ఆశౌచం లేదా మైల అన్నది*
దీనినే *ఇప్పటి శాస్త్రవిజ్ఞానం(సైన్స్) ఇమ్మ్యూనిటి అనే పేరుతో సూక్ష్మజీవ ప్రభావ రోగులను ఐసోలేషన్ ప్రాంతాలలో పెట్టి ఆరోగ్యవంతులకు దూరముగా పెడుతున్నారు.*
అంటే అలనాడు చెప్పిన *మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటేగా. ఆంగ్లములో చెబితే ఇంపు-భారతీయములో చెబితే చాదస్తం. అంతేగా. గమనించండి భారతీయత ఔన్నత్యం*
శుభం భూయాత్.