“Vinaa Venkatesam Nanaadho Nanatha
Sadhaa Venkatesam Smaraami Smaraami
Hare Venkatesa Praseedha Praseedha
Priyam Venkatesa Prayaccha Prayaccha”
ప|| మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది | వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||
చ|| జీవస్వరూపము చింతించి యంతటాను | దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే | వేవేలు విధముల వేదాంత రహస్యము ||
చ|| తనలోని (వి)జ్ఞానము తప్పకుండా తలబోసి | పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుటే | వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||
చ|| వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి | జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే | వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||