Online Puja Services

భావించి తెలుసుకొంటే భాగ్యఫలము 
ఆవలీవలి ఫలములు అంగజజనకుడే

దానములలో ఫలము తపములలో ఫలము
మోస(న)ములలో ఫలము ముకుందుడే
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము
నానా ఫలములు నారాయణుడే

వినుతులలో ఫలము వేదములలో ఫలము
మనసులోని ఫలము మాధవుడే
దినములలో ఫలము తీర్థయాత్రల ఫలము
ఘనపుణ్యముల ఫలము కరుణాకరుడే

సతతయోగ ఫలము చదువులలో ఫలము
అతిశయోన్నత ఫలము యచ్యుతుడే
యతులలోని ఫలము జితకామిత ఫలము
క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుడే

Videos View All

భావించి తెలుసుకొంటే భాగ్యఫలము అన్నమయ్య కీర్తన
నమస్తే అంటే ఏమిటి? ఎలా చేయాలి?
బడలెను పానుపు పరచరే అన్నమయ్య కీర్తన
భావమెరిగిన నల్ల(బల్లి చెన్నుడా అన్నమయ్య కీర్తన
కరోనా మహమ్మారి నిర్మూలనార్థం

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi