Online Puja Services

Mangalam Bhagavan Vishnu, Mangalam Garuraddhvajah;
Mangalam Pundarikaksho, Mangalayatano Harih.

స్వామి సుందర సత్యనారాయణ పాట | Swami Sundara Satyanarayana Song | Lyrics in Telugu

స్వామి సుందర సత్యనారాయణ
నీ మోమైన చూపించు కమలాసనా

స్వామి సుందర సత్యనారాయణ
నీ మోమైన చూపించు కమలాసనా

సమకూడె నిను చూచు ఆ సమయము
ప్రభు మైమరిచె నినుజూచి ఆ నిమిషము 

సమకూడె నిను చూచు ఆ సమయము
ప్రభు మైమరిచె నినుజూచి ఆ నిమిషము

పూమాలను నీ మెడ వేతును
పూమాలను నీ మెడ వేతును

ఓ పరమాత్మ నీ ప్రతిభ ఏమందును
ఓ పరమాత్మ నీ ప్రతిభ ఏమందును

స్వామి సుందర సత్యనారాయణ
నీ మోమైన చూపించు కమలాసనా

శ్రీ రత్నగిరిపైన కొలువైతివా
పెడదారులలో పడువారి కరుణింతువా

శ్రీ రత్నగిరిపైన కొలువైతివా
పెడదారులలో పడువారి కరుణింతువా

నిరుపేదను కోరి నిను కొలుతును
నిరుపేదను కోరి నిను కొలుతును

స్వామి నారాయణా కడకు నీ వాడను

స్వామి సుందర సత్యనారాయణ
నీ మోమైన చూపించు కమలాసనా

అతి వైభవము అన్నవరమందున
బహు ఖ్యాతుండి వున్నావు  స్థితి అందునా

అతి వైభవము అన్నవరమందున
బహు ఖ్యాతుండి వున్నావు  స్థితి అందునా

స్తుతియింతును నీ మహిమను
నా గతిచూపు మమ్మేలు నారాయణా

స్వామి సుందర సత్యనారాయణ
నీ మోమైన చూపించు కమలాసనా

స్వామి సుందర సత్యనారాయణ
నీ మోమైన చూపించు కమలాసనా

 


swami, sundara, satyanarayana, song, devotional, songs, satya, narayana, 

Videos View All

Auspicious day for Satyanarayana Swamy Vratham in 2014
Sri SATYANARAYANA SWAMI Vratha Vidhanam in Telugu
స్వామి సుందర సత్యనారాయణ పాట
శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళి

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore