Online Puja Services

Namastestu Mahamaye
Shree pithe sura poojite
Shanka Chakra Gadha haste
Maha Lakshmi Namoostute

సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట | Sowbhagya Lakshmi Ravamma Song | Mahalakshmi Song | Lyrics in Telugu

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నుదుట కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక వెలుగా

కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండగా 

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 )

నిండుగా కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల  మువ్వలు 

గల గల గలమని సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల సేవలు నందగా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నిత్య సుమంగళి నిత్య కళ్యాణి
భక్త జనులకు కల్పవల్లి

కమలాసనవై కరుణ నిండగా
కనక వృష్టి కురిపించే తల్లి

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

జనకరాజుని ముద్దుల కొమరిత
రవికుల సోముని రమణీమణివై

సాధు సజ్జనుల పూజలందుకొని
శుభములనిచ్చే దీవెన లీయగ

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

కుంకుమ శోభిత పంకజ లోచని
వేంకట రమణుని పట్టపురాణి

పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
పుణ్యమూర్తి మా ఇంట వెలసిన

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

సౌభాగ్యమ్ముల  బంగరు తల్లి
పురందర విఠలుని  పట్టపు రాణి 

ప్రతి నిత్యంబున  పూజలందుకొన
సర్వకాలములు    శుభ ఘడియలుగా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

 

sowbhagya Lakshmi ravamma, mahalakshmi, lakshmi, asta lakshmi, song, devotional, songs,

Videos View All

అష్టలక్ష్ములూ తిష్టవేసుకొని ఉండిపోతారట
సర్వదేవకృత శ్రీ లక్ష్మి స్తోత్రం
అష్ట లక్ష్మీ స్తోత్రం
సౌభాగ్య లక్ష్మి రావమ్మా పాట
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
శ్రీ మహాలక్ష్మి ధ్యాన స్తోత్రం | Sri Mahalakshmi Dhyana Stotram

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore