|| Om Vakratunda Mahakaya Koti Surya Samaprabha
Nirvighnam Kurumedeva Sarvakaryeshu Sarvada ||
వినాయక పూజకు సన్నాహాలు
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలం కరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకుని స్నానం చేయాలి.
దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి,
దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో వుంచాలి.
వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఏదుట కొంచెం బియ్యాన్ని పోసి దాని పై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆ పై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి.
ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిణ వుంచుకుని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు - అవుతాయి. కాబట్టి తెల్లని వస్త్రాన్ని వుంచుకుంటే బాగుంటుంది.
పూజకు కావలసిన సామగ్రి
పసుపు,
కుంకుమ,
గంధం,
అక్షతలు,
అగరువత్తులు,
కర్పూరం,
తమలపాకులు,
వక్కలు,
పూలు,
పూల దండలు,
అరటి పండ్లు,
కొబ్బరి కాయలు,
బెల్లం లేదా పంచదార,
పంచామృతాలు,
తోరము,
దీపారాధన కుందులు,
నెయ్యి లేక నూనె,
దీపారాధన వత్తులు,
పత్తితో తయారు చేసిన చిన్న వస్త్రం/లేదా పసుపు గుడ్డ ముక్క (వస్త్రం అన్నప్పుడు విగ్రహానికి చుట్టటానికి)
పత్తితో తయారు చేసిన చిన్న యజ్నోపవీతం
వినాయకుడి ప్రతిమ,
పళ్లేలు 2
చెంబులు/గ్లాసులు 2
ఉద్ధరిణ
21 రకాల ఆకులు, (అథ ఏకవింశతి పత్ర పూజ కోసం)
మాచిపత్రి
వాకుడాకు
మారేడు
గరికె)
ఉమ్మెత్త
రేగి
ఉత్తరేణు
తులసి
మామిడి
గన్నేరు
విష్ణుక్రాంతం
దానిమ్మ
దేవదారు
మరువం
వావిలి
జాజి
గండకీ
జమ్మి
రావి
మద్ది
తెల్లజిల్లేడు
ఇంకా ఇవి కాకుండా వివిధ రకాలైన పత్రి పూజలో ఉపయోగించవచ్చు. వినాయకుడికి పత్రి అంటే చాల ఇష్టం.
(పూజలో పిల్లల పుస్తకాలు, పెద్దల వ్యాపారం లేదా వుద్యోగం సంబంధించిన ఏదైనా పుస్తకం లేదా పెన్ను కూడా ఉంచుకోవాలి)
ఉండ్రాళ్ళు,
పాయసం,
భక్ష్యాలు.