Online Puja Services

కాలసర్పదోషం నుండీ బయటపడే మార్గాలు !

3.128.204.196

ఆశ్లేష బలి, నవనాగమండలం, సర్పబలి- కాలసర్పదోషం నుండీ బయటపడే మార్గాలు !
-సేకరణ .

ఆశ్లేషా నక్షత్రం సర్పదేవతా నక్షత్రం . ఈ నక్షత్రం ఉన్న రోజున ఆశ్లేష బలి పూజ చేయడం వలన కాలసర్పదోషాలు, రాహు,  గ్రహాలవల్లన కలిగే ప్రతికూలతలు తొలగిపోతాయి. కాలసర్పదోషము లేదా కాలసర్పయోగము గా పిలిచే ఈ దోషము వలన ఆదోషము ఉన్న జాతకులు అనేకానేక బాధలు, కస్టాలు పడాల్సి వస్తుంది . మన్దారమూ కాలప్రవాహంలో ప్రయాణించేవాళ్ళమే కదా ! ఆ కాలమే ఒక సర్పమై మనని వెంబడిస్తే, ఎలా ఉంటుందో జాతకంలో కాలసర్పదోషము ఉంటె సరిగ్గా అలాగే ఉంటుంది .  ఇటువంటి అనిశ్చితిని జీవితంలో అధిగమించడానికి ఉద్దేశ్యించిన పరిష్కారమార్గం ఆష్లేషబలి పూజ / నవనాగమండల పూజ / సర్పబలి పూజ . దీనిని మీరు మార్చి 5దవ తేదీ 2023 నాడు చేయించుకోవచ్చు . ఈ సేవని అందిపుచ్చుకోవడానికి హితోక్తి వర్చువల్ పూజారి మీకు సాయపడుతుంది .  అయితే, ముందుగా  దీనిగురించి మరింత సమాచారం తెలుసుకుందాం రండి . 

   కాలసర్ప దోషం అంటే ఏమిటి అంటే,  ‘కాల’ అంటే కాలము అని, ‘సర్పం’ అంటే పాము అని కదా అర్థం. కాలసర్పము అనగా కాలము సర్పముగా మారి మానవుడిని అనేక రకముల కష్టాలపాలు చేయడం . జన్మకుండలిలో (జాతకచక్రంలో) రాహువు మరియు కేతువు సంచారం  వలన కాలసర్పదోషం ఏర్పడుతుందని వరాహమిహరుడు, పరాశర మహర్షి తెలియపరచారు.

ప్రభావం : 

 కాలసర్పయోగం ఉన్నవారు తమతమ వృత్తులలో పైకి రావడానికి ఎంతో అధికమైన శ్రమపడాల్సి ఉంటుంది.  ఎంతటి అధికమైన శ్రమ అనుభవించినా, ఆ శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

ఈ కాలసర్పయోగం  జాతకుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని, చూపిస్తుంది . కాలసర్పయోగం ఉన్న వారు, వారి వారి వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా అంచలంచాలుగా పెరిగి, అంతకన్నా హఠాత్తుగా పతనం అవుతారు. కాలసర్పయోగం తీవ్రంగా ఉన్నప్పుడు జాతకుడు కొన్నిసార్లు మరణ గండాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబానికి దూరం కావడం పెద్దమొత్తంలో ఆస్తిని కోల్పోవడం, నిష్కారణంగా అపకీర్తిని పొందడం, ఊహించని విధంగా ప్రమాదలకు గురి కావడం చట్టవిరుద్ధమైన మరియు అవినీతి కార్యాలకు పాల్పడి శిక్షలకు గురి కావడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.

             ఈ కాలసర్పయోగం వల్ల మనిషి తాను చేసే కార్యాలకు ఫలితం పొందలేకపోవడం, కొందరికి వివాహం కాకపోవడం, సంతానం కలుగక పోవడం తరచూ తగాదాలలో, కోర్టు కేసులలో ఇరుక్కుపోవడం, శత్రువుల పీడ అధికంగా ఉండటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతుంది. 

జాతకునికి  రావాల్సిన శుభాన్ని, అదృష్టాన్ని అడ్డగించడంలో కాలసర్పదోషం పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. కాలసర్పదోషం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ యోగ ప్రభావానికి గురి కావాల్సిందే. కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయములతో ఉత్కంఠను, ఆందోళనలను అనుభవిస్తూ ఉంటారు. వారిని అనుక్షణం ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికి వాటి అన్నింటిలోనూ తీవ్రమైనది కాలసర్పదోషం. ఒక్కోరకమైన కాలసర్పదోషం మనిషికి ఒక్కో వయసు వరకు ప్రభావం ఉంటుంది, కొన్ని కాలసర్పదోషాలు మాత్రం మనిషి జీవితంలో ఏదో ఒక దశలో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయి. 

పరిహారం : 

సర్పదోష నిర్మూలనకు చాలా విధాలుగా పరిహారాములు పండితులు సూచిస్తూ ఉంటారు . అటువంటి కాలసర్పదోష పరిహారాదులకు జరిపించవలసిన వాటిలో ప్రధానమైనది ఆశ్లేష బలి, నవనాగమండలం . ఈ రెండూ కూడాను చాలా శక్తివంతమైన కాలసర్పదోష పరిహారములు.

ఎక్కడ చేయాలి ? ఎలా చేయాలి ? 

 ఈ రెండూ సర్పతాంత్రిక పీఠాలలో, సర్ప దేవతల క్షేత్రములో, నదీ మరియు సాగర తీరములందు మాత్రమే జరిపించాలి. అలా కాకుండా సామూహికంగాను, గృహాలలోనూ, మరే ఇతర ప్రదేశాలలో ఈ కార్యములు నిర్వహించకూడదని శాస్త్ర నియమం. సర్పతాంత్రికులు, సర్ప పీఠాలలో చేసే నవనాగమండలం, ఆశ్లేష బలి పూజాది కార్యములకు మాత్రమే సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. తీవ్రమైన కాలసర్పదోషం, నాగ శాపం, నాగ దోషం, రాహు గ్రహ నాగదోషం, కేతు గ్రస్త సర్పదోషం సంపూర్ణంగా తొలగిపోవాలంటే ఆశ్లేష బలి, నవనాగమండలం పూజను తప్పనిసరిగా జరిపించుకోవాలి. 

జాతకులు ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని మరియు వ్యక్తిగతంగా గాని ఈ పూజను నిర్వహించుకోవడం మంచిది. సామూహికంగా జరిగే పూజలో ఒకరి దోషాలు మరొకరికి బట్వాడా కాబడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా దోషం నిర్మూలన కాకపోగా ఇతరుల దోషాలు సంక్రమించే అవకాశం. వారు ఎదుర్కొంటున్న దుష్పరిణామాలను కూడా పంచుకునే భాగాస్వాములు జరిగే అవకాశాలు మెండు. అందుకరణం చేత సర్పదోష పరిహారాలు వ్యక్తిగతంగా చేయించుకోవడం ఉత్తమం. పండితోత్తముల చేత ఈ పూజని మీతో జరిపించేందుకు  హితోక్తి వర్చువల్ పూజారి మీకు సాయపడుతుంది . మీరు చేయవలసిందల్లా , మా వెబ్సైట్ కి లాగిన్ అవ్వడమే ! 

శుభం !!
 

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore