Online Puja Services

ఇంట్లో ఎప్పుడూ శుభం జరగాలి అనుకుంటే

3.23.103.216

ఇంట్లో ఎప్పుడూ శుభం జరగాలి అనుకుంటే, సింపుల్ గా ఇలా చేయండి . 
- లక్ష్మి రమణ 

వినాయకుడు విఘ్న నాశకుడు. అంతేనా , చెడు  దృష్టి నుండీ కూడా రక్షించే రక్షకుడు.  సిద్ధిని, బుద్ధిని అనుగ్రహించే వరదుడు.  అందుకే, ఇంటినుండీ  బయటికి వెళ్లేప్పుడు ఆయనకి  నమస్కారం చేసుకొని వెళితే శుభం జరుగుతుంది . నిత్యమూ వినాయకుని అర్చనలు జరిగే చోట ఆయన చక్కగా సిద్ధాసనంలో కూర్చొని అన్ని వ్యవహారాలు సరిగ్గా జరిగేలా చక్కబెడతారు. నిజమా ? అలా జరుగుతుందా ? అనే ప్రశ్న ఉదయించిందా ? సందేహాత్మకి ఎక్కడికెళ్లినా సార్ధకత లేదని, ఏం చేసినా పరమాత్మమీద నమ్మకం ముఖ్యం . ఇది గుర్తుంచుకోవాలి . అలాగే నిత్యమూ ఇలా గనక చేశారంటే , ఇంట్లో శుభాలు జరుగుతాయి . నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోతాయి  . అదేమిటో తెలుసుకుందాం రండి . 

వినాయకుని రూపాన్ని ప్రకృతిలోని పంచభూతాలలో దేనిలోనైనా దర్శించవచ్చు. ఆకులు, పూవులు, నీటి ధారలు , కొండ త్రోవలు, మబ్బు తునకలు , అగ్ని కీలలు ఇలా దర్శించే హృదయం ఉండాలి. కానీ, ఆ గణపయ్య కానరాని చోటే ఉండదు . సర్వవ్యాపకుడు , సదా రక్షకుడు గజాననుడు. ఆయన ఉన్న చోట సదా శుభాలే జరుగుతాయని శాస్రం. 

 ‘ప్రభావాత్తన్మూర్త్యా భవతి సదనం మంగళ’ అని ఆర్ష వాక్యం.

మనం ఎవరినైనా పిలిచి గౌరవంగా చూసుకుంటేనే కదా మన ఇంట ఉండి మన కష్టసుఖాలలో పాలు పంచుకుంటారు .  కనుక ఆయన  చెక్కతో చేసిన రూపాన్ని మన ఇంటి గుమ్మం దగ్గర ఉండేలా ఏర్పాటు చేసి , ప్రతిరోజూ స్నానం చేశాక , ఆయనకి సింధూరాన్ని తిలకంగా పెడుతూ,అగరవత్తులు వెలిగించి ధూపం వేయండి .  భక్తిగా నమస్కారం చేసుకోండి . అంతే చాలు . మన ఇంట్లో నిత్యమూ శుభాలు జరిగేలా ఆ గణపతి అనుగ్రహిస్తారు .  

కర్మపాశమూ , కాలపాశమూ కర్కశమైనవి .  అయితే వాటి ప్రభావం  ఈ చిన్న ఉపాయము వలన చాలా తక్కువగా ఉండొచ్చు  అని పండితులు తెలియజేస్తున్నారు .  ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వలన పెద్ద ప్రమాదాలు తప్పిపోయిన వారు ఎందరో ఉన్నారు . కాబట్టి ముందర మనం ఏం చేసినా పూర్తి శరణాగతితో , నమ్మకంతో చేయడం అవసరమని గుర్తుంచుకోండి .  

Quote of the day

Love is an endless mystery, for it has nothing else to explain it.…

__________Rabindranath Tagore