Online Puja Services

వేద మంత్రాన్ని వింటే లాభమొస్తుందా?

18.219.42.240

వేద మంత్రాన్ని వింటే లాభమొస్తుందా?
-సేకరణ 

పీఠాధిపతులు, అవధూతలు, సత్యమెరిగిన స్వాములు వేదం రాకపోయినా ఫర్వాలేదు, వింటే చాలు. మీకు లాభం చేకూరుతుంది అంటారు. మంత్రశాబ్దాన్ని వింటేనే ఏమి లాభం కలుగుతుంది అని అనుమానం మనకు రాకపోదు.    

మనకు చిన్నప్పుడు మన అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కొన్ని సార్లు కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం ఆ చంటిపిల్లకు తెలియనవసరం లేదు. అది ఏ రాగమో అర్ధం అవ్వవలసిన అవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది చంటి బిడ్డకి. 

సనాతన ఋషులు తాము దర్శించిన సత్యాన్ని మనకి అటువంటి అమ్మలాలిపాటలాగా వేదాలలో నిక్షిప్తం చేశారు . సంస్కృత భాషలో ఉన్న వేదం తప్పు లేకుండా చదవగలిగితే , స్వరాలతో సహా పొల్లుపోకుండా గానం చేయగలిగితే, ఈ ప్రకృతే పరవశించిపోయి వింటుంది .  అడవిలోని మృగాలు కూడా ఆ ధ్వని తరంగాలకు ముగ్దులై బద్దులై పరవశిస్తాయి . క్రూర మృగాలు సైతం తమ సహజ ప్రవృత్తిని మార్చుకొని సాత్వికంగా ప్రవర్తిస్తాయి . ఇది నిరూపితమైనది . మన పురాణాలలో మునిఆశ్రమాల గురించిన పలు వర్ణనలలో ఈ విషయాన్ని చెప్పారు కూడా !  ఇక, బుద్ధిలేని జీవులే అలా బుద్ధికలిగి ప్రవర్తించినప్పుడు కేవలం వేదాన్ని వినడం చేత బుద్ధి జీవులలో విజ్ఞాన వీచికలు పరిమళించవా?

వేదమంత్రాన్ని పలకడం , లేదా అలా వేదశబ్దం ధ్వనిస్తున్న ప్రదేశంలో ఉండడం ద్వారా మన చుట్టూ తయారయ్యే ఆ శబ్ద తరంగాలు మన పరిశరాలనీ , వాతావరణాన్నీ ప్రభావితం చేస్తాయి. ఆ శబ్ద బ్రహ్మం మనకు రక్ష అవుతుంది. 

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మన చుట్టూ  రేడియో తరంగాలు,  AV/ఆడియో వీడియో తరంగాలు, కమ్యూనికేషన్ తరంగాలు, UV  తరంగాలు ఉంటాయని తెలిసిన విషయమే . లేకపోతె మనం రేడియోలు, టీవీలు , సెల్ ఫోనులు ఆపరేట్ చేయలేము కదా ! ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు వాటి వాటి నిర్దుష్ట ఫ్రీక్వెన్సీ (frequency)తో మనను చుట్టుముట్టి వుంటాయి. 

ఎలా అయితే  ఇటువంటి తరంగాలు ఉన్నాయో, మనకు తెలియని నెగటివ్ ఫీలింగ్స్, తప్పుడు ప్రభావం కలిగించే తరంగాలు కూడా మన చుట్టూ ఉంటాయి. అలాగే మంచిని ప్రేరేపించే తరంగాలు కూడా వుంటాయి. 

ప్రతి మంత్రానికి స్వర, అనుస్వర ఉదాత్తలతో ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు నా చుట్టూ ప్రకటితం అవుతాయి.  ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను తొలగిస్తాయి . తద్వారా కేవలం మన కర్ణావయవం అనే రిసీవర్ ద్వారా కేవలం మంచికి సంబంధించిన తరంగాలు మన మెదడుకు అందుతాయి . తద్వారా మన బ్రెయిన్లో grey matter పెంపొందుతుంది. మానసిక దౌర్భాల్యం మాయమై ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది. 

మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తాయి . అటువంటప్పుడు అదే మంత్రం మరిన్ని సార్లు మనమే కనుక చదవగలిగితే, ఆ ఎనర్జీ మనమే తయారు చేసుకోగలుగుతాము. మరింత శక్తియుతంగా ఆ పాజిటివ్ శక్తిని మనం గ్రహించగలుగుతాము . 

ఉదాహరణకి, ఒక గదిలో చెడువాసన వస్తోంది . అక్కడ గుగ్గిలంతో పొగ వేశారంటే, ఆ ప్రాంతమంతా చక్కని సువాసనతో నిండిపోవడంతో పాటు అక్కడున్న సూక్షమ క్రిములు కూడా బయటికి వెళ్లి , ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కదా ! ఇది కూడా అలాగన్నమాట !! 

కాబట్టి వేదమంత్రాన్ని, మంత్ర పాఠాన్ని అర్థం తెలియకుండా, కేవలం విన్నప్పటికీ కూడా ఫలాన్ని అందిస్తుంది . పురాణాలలో ఈ కథని విన్నా చదివినా అనంతమైన ఫలం దక్కుతుంది . అంటాను భగవంతుని సాన్నిధ్యం లభిస్తుంది. అని చెబుతుంటారుకదా ! అటువంటిది , ఆ భగవంతుని వ్యక్తీకరణని వివరించే వేదాన్ని వింటే ఫలం దక్కదా !! చక్కడా వేదం శ్రవణం చేయండి .  ఏదైనా శుభకార్యక్రమాలు ఉన్నప్పుడు వేదం పండితులని ఆహ్వానించి వేదాశీర్వాదాము తీసుకోండి .  

సర్వేజనా సుఖినోభవంతు !! శుభం !!

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya