Online Puja Services

బాలారిష్టాలు తొలగించే శక్తివంతమైన పరిష్కారం

3.139.64.39

సంతానం లేకపోవడం, ప్రసవసమస్యలు, గ్రహదోషాలు, బాలారిష్టాలు తొలగించే శక్తివంతమైన పరిష్కారం . 
- లక్ష్మి రమణ 

చిన్ని కృష్ణుడు మనోహరుడు . ఆ రూపాన్ని చూసి అటువంటి బిడ్డే  మా కడుపున పుట్టాలని కోరుకోని తల్లి రేపల్లెలో లేదంటే అతిశయోక్తి కాదు . చూడచక్కనివాడు, చిలిపివాడు , అల్లరి కృష్ణుడు. అంతేనా , అంతులేని అనుగ్రహాన్ని ఆ రేపల్లె వాసులకి రుచి చూపించిన పరమాత్ముడు.  ఆయన అనుగ్రహాన్ని పొందితే సంతానానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి .  ప్రసవ సమస్యలు , సంతానం ప్రాప్తికి సంబంధించిన  గ్రహ దోషం, దృష్టి దోషాలు,  దుష్ప్రభావాల నుండి విముక్తి పొందేందుకు చిన్ని కృష్ణుని ఆరాధనే శ్రేష్టమైన విధానం . 

శ్రీశం కమలపత్రాక్షం దేవకీనందనం హరిమ్ ।
సుతసంప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్ ॥ 1 ॥

నమామ్యహం వాసుదేవం సుతసంప్రాప్తయే హరిమ్ ।
యశోదాంకగతం బాలం గోపాలం నందనందనమ్ ॥ 2 ॥

అస్మాకం పుత్రలాభాయ గోవిందం మునివందితమ్ ।
నమామ్యహం వాసుదేవం దేవకీనందనం సదా ॥ 3 ॥

గోపాలం డింభకం వందే కమలాపతిమచ్యుతమ్ ।
పుత్రసంప్రాప్తయే కృష్ణం నమామి యదుపుంగవమ్ ॥ 4 ॥

పుత్రకామేష్టిఫలదం కంజాక్షం కమలాపతిమ్ ।
దేవకీనందనం వందే సుతసంప్రాప్తయే మమ ॥ 5 ॥

అని ఆ గోపాలుని ప్రతి రోజూ సంతాన గోపాలుని స్తోత్రం . ఈయన్నే బాలగోపాలుడు అని కూడా అంటారు . ఈ స్తోత్రంలో చెప్పినట్టు , పుత్రకామేష్టి చేసిన ఫలాన్ని ఇచ్చి అనుగ్రహించే వరదుడు సంతాన గోపాలుడు .  సంతానానికి సంబంధించిన సమస్యలని అధిగమించేందుకు ఆయన స్తోత్రాన్ని ప్రతి రోజూ పారాయణ చేయడం చక్కని ఫలితాన్నిస్తుంది. 

ఇది కాకుండా సంతానగోపాల హోమం కూడా గొప్ప ఫలితాన్ని అనుగ్రహించేదే ! ఈ దివ్య హోమం శ్రీ విష్ణువు ద్వాపర యుగంలో ధరించిన అవతారమైన శ్రీకృష్ణునికి ఉద్దేశ్యించినది. ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలని మరియు తల్లీ బిడ్డల మంచి ఆరోగ్యం కోసం భగవంతుడు శ్రీ హరి అనుగ్రహాన్ని కోరుతూ శ్రీ కృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 19, 2022) నాడు తమిళనాడులోని కుంభకోణంలో కూడా ఈ హోమాన్ని నిర్వరిస్తూ ఉంటారు . సంతాన గోపాల మంత్రంతో హోమము నిర్వహించడం ద్వారా త్వరితమైన ఫలితాలు సంతార్ధులకి ఉంటాయని పండితులు చెబుతున్నారు .  

సంతాన గోపాల మంత్రం ప్రాముఖ్యత: 

సంతానం కలగడడం ఒక వరమైతే, ఆ సంతానం సత్సంతానమై చక్కని విద్యాబుద్ధులతో, గుణగణాలతో , చక్కని సంస్కారంతో, ఆయుష్మంతునిగా  జన్మించడం మరో గొప్ప వరమని చెప్పాలి . అటువంటి పుత్రుడు వంశాన్ని నిలబెడతాడు.  వంశ కీర్తి ప్రతిష్టలని ఇనుమడింపజేస్తాడు.  అటువంటి గప్ప సంతానాన్ని పొందగలగడం ఈ హోమం నిర్వహించడడం వలన సాధ్యం అవుతుంది . ఇది పిల్లలని ఇవ్వడమే కాకుండా,  గర్భానికి , పిండానికి  రక్షణ నిస్తుంది .  శిశువు సురక్షితమైన ప్రసవానికి దోహదం చేస్తుంది . తత్సంబంధమైన  అవరోధాలను తొలగిస్తుంది .

సంతాన గోపాల మంత్రం

|| దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే । 
దేహి మే తనయం కృష్ణ త్వమహం శరణం గత: ||

|| ఓం దేవకీసుత గోవిందా వాసుదేవ జగత్పతే  |
| దేహి మే తనయం కృష్ణ త్వమ్ అహం శరణాంగతే  ||

ఈ విశిష్టమైన సంతాన గోపాల హోమాన్ని మీరు మన హితోక్తి వర్చువల్ పూజారి సాయంతో కూడా నిర్వహించుకోవచ్చు. వేదకోవిదులైన బ్రాహ్మణోత్తముల చేత ఈ సేవని మీకు అందుబాటులోనికి తీసుకొస్తున్నాము . ఈ సేవని వినియోగించుకోవాలి అనుకున్నవారు వెంటనే మా వెబ్ సైట్ కి లాగిన్ అవ్వండి . 

శుభం భూయాత్ !!

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore