Online Puja Services

ఆంజనేయుని పూజించుకోవడానికి శ్రేష్ఠమైన పర్వదినాలు

18.222.32.154

ఆంజనేయుని పూజించుకోవడానికి  శ్రేష్ఠమైన పర్వదినాలు ఏవి ?
- లక్ష్మి రమణ 

ఆంజనేయుని పూజించడానికి ఏరోజు మంచిది కాదు అని ప్రశ్నించుకోవాలి ? ఆయన పూజకి కాలములో అన్ని రోజులూ విశిష్టమైనవే ! అయితే ప్రతి రోజూ ఉండే మానసిక స్థితి కంటే, పుట్టిన రోజు వంటి  ప్రత్యేక రోజులలో, పర్వాదినాలలో ఉండే మానసిక స్థితి మరింత ఉత్సాహంగా ఉంటుంది కదా ! అదే విధంగా ఆ స్వామిని అర్చించడానికి, తప్పకుండా పూజించడానికి అనువైన కొన్ని దివ్యమైన రోజులుంటాయి .  వాటిని పండితులు ఇలా తెలియజేస్తున్నారు . 

సాధారణంగా మంగళవారం, శనివారము ఆంజనేయునికి ప్రీతికరమైన వారాలు.  ఆరోజుల్లో ఆంజనేయ పూజ చేయడం వలన భయాలు తొలగిపోతాయి . జయాలు కలుగుతాయి. సంపద ప్రాప్తిస్తుంది . ఇవి కాకుండా ఆంజనేయస్వామి జన్మ నక్షత్రం పూర్వాభాద్రా . కృష్ణ లేదా బహుళ పక్షంలో ఈ నక్షతమున్న రోజు వారంతో సంబంధం లేకుండా హనుమంతుని ఆరాధన గొప్ప అనుగ్రహాన్నిస్తుంది . అలాగే, హస్త, మృగశీర్షా నక్షత్రములతో కూడిన ఆదివారములు కూడా స్వామి వారికి ప్రీతిదాయకములు.  

ఇక మాసప్రాధాన్యతలతో కూడి ఉన్న నక్షత్రపర్వాలని చూస్తే,  

చైత్రమాసం - పుష్యమీ నక్షత్రం
వైశాఖమాసం - ఆశ్లేషా నక్షత్రం
వైశాఖమాసం - కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి
జ్యేష్ఠ మాసంలోని - మఖా నక్షత్రం
జ్యేష్ఠమాసం -శుద్ధ విదియ \ దశమి ఉన్న రోజులు 
ఆషాఢ మాసం - రోహిణి నక్షత్రం
శ్రావణ మాసం - పూర్ణిమ
భాద్రపద మాసం - అశ్వనీ నక్షత్రం
ఆశ్వీయుజ మాసం - మృగశీర్షా నక్షత్రం
కార్తీక మాసం - ద్వాదశి
మార్గశీర్ష మాసం - శుద్ధ త్రయోదశి
పుష్య మాసం - ఉత్తరా నక్షత్రం
మాఘ మాసం - ఆర్ధ్రా నక్షత్రం
ఫాల్గుణ మాసం - పునర్వసు నక్షత్రం 

ఆ హనుమంతునికి ఇష్టమైన రోజులు . ఇవి కాక,  అమావాస్యతో కూడిన సోమవారము, ప్రతి మంగ ళవారం స్వామి వారి పూజకు ప్రీతి దినములు. వైధృతియోగయు లో (అనగా ఉత్తమము, అపూర్వము అగు గ్రహయోగకాలము, విష్కం భాది 27 యోగాలలో చివరిది వైధృతి యోగము) స్వామిని పూజించిన విశిష్ట ఫలసిద్ధి ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు . 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi