Online Puja Services

ప్రతి రోజూ పెరిగే ఈశ్వరుడు శని బాధల నుండీ విముక్తినిస్తారు .

13.59.127.63

ప్రతి రోజూ పెరిగే ఈశ్వరుడు శని బాధల నుండీ విముక్తినిస్తారు . 
లక్ష్మీ రమణ

ఏటా పెరిగే స్వయంభూ దేవీ దేవతలు మన భువిపైన కొత్తేమీ కాదు . కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోతున్న ఈశ్వరుడు మాత్రం ప్రతి రోజూ పెరుగుతూ ఉంటారు . బ్రిటీష్ కాలంలో ఈ ఆలయంలో శివుడు నిజంగానే పెరుగుతున్నారా అని పరిశోధ చేయడానికి , ఆయన లింగాకృతి చుట్టూ తాడుని ముడి వేశారట. ఉదయం తిరిగి వచ్చి ఆలయాన్ని తెరిచి చూసే సరికి, ఆ తాడు తెగి కిందపడి ఉన్నదట.  ఆ విధంగా ఎన్నిసార్లు చేసినా చివరికి ఫలితం మారకపోవడంతో, బ్రిటీషువారు ఈ ఈశ్వరుడు పెరుగుతూ ఉన్నమాట నిజమేనని ధృవీకరించారట. అలాగే తురష్కరులు మన ఆలయాలపైన దండయాత్రలు ఎన్నో సార్లు చేశారు. ఈ ఆలయం పైన కూడా దాడికి యత్నించారు. కానీ ఆ మహాదేవుని మహత్యం వలన వారి ఆటలు సాగలేదు . అటువంటి గొప్ప చరిత్రగల ఆలయం గురించి తెలుసుకుందాం రండి .   

శ్రీ తిల్ భండేశ్వరుడుగా మహాదేవుడు కొలువైన పుణ్య స్థలం వారణాసి.  ఈ ఆలయాన్ని దాదాపు 18వ శతాబడంలో నిర్మించినదిగా చెబుతూంటారు . పాండే హవేలీ ప్రాంతంలో ఉన్న శివాలయం అత్యంత పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిని పొందింది . కాశీలో అడుగడుగునా ఒక ఈశ్వర ఆలయం ఉన్నప్పటికీ, ఏ  ఆలయ ప్రాధాన్యత దానికే ఉండడం విశేషం . 

దాదాపు 2500 సంవత్సరాల క్రితం స్వయంభువుగా పరమేశ్వరుడు నువ్వులు పండించే ఒక పొలంలో అవతరించారు. అప్పటి నుండీ  ఈ శివ లింగం ప్రతి రోజూ పెరుగుతూ ఉంటుందట . అదికూడా ఒక్క నువ్వు గింజంత పరిమాణంలో మాత్రమే ! ఆ విధంగా పెరుగుతూ 3.5 ఫీట్లు పొడవు దాదాపు 3 ఫీట్ల వ్యాసార్థంతో ఆయన ప్రస్తుతం దర్శనమిస్తున్నారు . భూమిలోపల మరో 30 అడుగుల మేర ఆయన విస్తరించి ఉన్నారని చెబుతారు . అంటే, ఆయన ఎన్ని ఏండ్ల నుండీ మహాదేవుడు ఇక్కడ ఇలా ఎదుగుతూ ఉన్నారనేది ఊహించవచ్చు . మాత  శారదా దేవి కొన్ని రోజులు ఈ ఆలయంలో గడిపారని , అందువల్ల ఈ ఆలయం జ్ఞానప్రదాయకమని చెబుతారు స్థానికులు . ఇక్కడి మహాదేవుని స్పర్శిస్తే, చాలా మృదువుగా , శరీరమైన ఈశ్వరుని స్పర్శించిన అనుభూతి కలుగుతుందని చెబుతారు భక్తులు . 

కొన్ని వేల సంవత్సరాల క్రితం, విభండక మహాముని దక్షిణ భారత దేశం నుండీ వారణాశి క్షేత్రానికి వచ్చారు .  విశ్వనాధుని దర్శించాలని వచ్చిన ఆయన, ఇక్కడ నిత్యమూ ఒక నూవు గింజంత పరిమాణంలో పెరుగుతూ ఉన్న ఈ ఆలయాన్ని దర్శించి ఆశ్చర్యపోయారు. విష్వఈశ్వర దర్శనానికి వెళ్లకుండా, ఈ ఆలయంలోనే ఉండి , అనేక సంవత్సరాలు తపస్సుని ఆచరించారు . దాంతో పరమేశ్వరుడు అనుగ్రహించి, విభాండకుని పేరుని కూడా చేర్చుకొని శ్రీ తిల్ భండేశ్వరుడుగా పేరొందారని స్థల ఐతిహ్యం . 

   ఈ ఈశ్వరుని దర్శనం శని దోషాల నుండీ విముక్తిని ప్రసాదిస్తుందని విశ్వశిస్తారు . ఇక్కడి పరమేశ్వరునికి బిల్వ పత్రాలతో పాటు , నల్ల నువ్వులని కూడా  భక్తులు సమర్పిస్తూ ఉంటారు . అదే విధంగా పితృదేవలకి కూడా ఈ ఆలయంలో ఈశ్వరార్చన చేయడం వలన ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని విశ్వశిస్తారు. ఈయన దర్శనం వలన కాశీ అన్నపూర్ణ సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది .  మహాశివరాత్రి, నాగపంచమి, దేవీ నవరాత్రులు , మకర సంక్రాంతి  ఉత్సవాలు ,  అయ్యప్ప స్వామి పూజలు ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయి . 

ఉత్తరప్రదేశ్లోని వారణాశిలో గంగా నదికి తూర్పున కేవలం 500 మీటర్ల దూరంలో ఈ అద్భుతమైన శివాలయం ఉంది . ఈ సారి కాశీ యాత్రలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి లతో పాటుగా ఈ  శ్రీ తిల్ భండేశ్వర మహాదేవుని ఆలయాన్ని దర్శించండి . 

Shiva, siva, varanasi, ganga, thil bhandeswar, visweswara, visalakshi, annapurna, kashi, kasi, 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi