Om Tryambhakam Yajamahe
Sugandhim Pushtivardhanam |
Urvarukamiva Bandhanan
Mrityor Mukshiya Maamritat ||
అమరనాథయాత్ర 2020 తేదీల ప్రకటన
ఈ సంవత్సరం అమరనాథ యాత్ర జూన్ 23 నుండి ప్రారంభం కానున్నది. ఆగస్ట్ 3వతేదీ శ్రావణపౌర్ణిమ తో ముగుస్తుంది. మొత్తం 42 రోజులపాటు యాత్ర సాగుతుంది.
నిన్న , J&K లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన Amarnath Shrine Board మీటింగ్ లో బోర్డ్ ఈ తేదీలను ఖరారు చేసింది. 2019 లో ఇదే యాత్ర 46 రోజులు , 2018 లో 60 రోజులపాటు సాగింది. జూన్ 23 న జగన్నాథ రథయాత్ర దినమైనందున , పరమపావనమైన ఆ దినమునుండి యాత్ర ప్రారంభించాలని సభ్యులు నిర్ణయించారు.
రిజిస్ట్రేషన్ : April 1 నుండి ప్రారంభమౌతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న 442
1. Punjab National Bank
2. Jammu Kashmir Bank
3. YES Bank శాఖలలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.