Online Puja Services

ఈ ఆచారాలన్నీ పాటించటం వల్ల లాభమేమిటి?

18.223.209.98

ఆచారాలు ఎన్నో రకాలుగా చెబుతారు.  ఈ ఆచారాలన్నీ పాటించటం వల్ల లాభమేమిటి? 
- లక్ష్మి రమణ 

 ఆచారాలు, సంప్రదాయాలు అనేవి హైందవ ధర్మంలో ఎన్నో, ఎంతో నిగూఢమైన అర్థాలతోటి మన ఋషులు మన కోసం ఇచ్చినటువంటి గొప్ప సంప్రదాయాలు. వాటిల్లోని గొప్పదనాన్ని ఇప్పుడిప్పుడు సైన్స్ తెలుసుకొని ధ్రువీకరిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకి, గుమ్మానికి మామిడాకులు కట్టడం , కాళ్ళకి పసుపురాసుకోవడం, నుదుటన బొట్టు పెట్టుకోవడం తదితరాలు . కానీ మన ఋషులు వీటన్నింటివెనుకా ఉన్న విజ్ఞానాన్ని ఏనాడో గ్రహించారు . విజ్ఞానంగా అది అందిస్తే , కేవలం చదువుకున్న వారికే అర్థమవుతుందని కాబోలు వాటిని ఆచారాలుగా , సంప్రదాయాలుగా మలిచి సమాజానికి అందించారు . 

ఉదాహరణకి గంధం రాసుకోవడం మన సంప్రదాయం . ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే, పసుపు కుంకుమలు ఇచ్చి గంధం రాస్తాం .  ఇందులో ఇంటిని ఆప్యాయత అనురాగాలతో ఉంచుకోవాలంటే, ఇల్లాలు మృదువుగా, సహనంగా, ఓర్పుగా మాట్లాడాలనే అర్థం దాగివుంది . కంఠాన్ని మృదువుగా , మాటని సున్నితంగా ఉంచుకోమని ఈ చల్లని చందనం బోధిస్తుంది . 

ఈ విధంగా మనకున్న ఎన్నో ఆచారాలు , సంప్రదాయాలు నిగూఢమైన అంతరార్థాలతో , సమాజ ప్రయోజనాలతో కూడి ఉంటాయి.  ఇటువంటి   ఆచారాన్ని పాటించటం వల్ల, ఆయువు పెరుగుతుంది .  సంతానము కలుగుతుంది. ఎప్పటికీ తరగని ఆహారాన్ని పొందవచ్చు.  ఆచారాన్ని పాటించటమనేది, పాపాలని తొలగించి శుభాలనిస్తుంది. ఇహ లోకంలో సుఖాలతో పాటు పరలోకాలలో ఉత్తమ గతిని లభించేలా చేస్తుంది. ఆచారవంతులు సదా పవిత్రులు ధన్యులు ఇది ముమ్మాటికి నిజమని నారాయణుడు స్వయంగా నారదునితో చెప్పినట్టుగా నారద పురాణం చెబుతూ ఉంది . 

ఈ శృతి వాక్యం మనమందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం . మన పొరుగు వారిని చూసైనా , వారి విశ్వాసాల్ని ఉగ్గుపాలతో రంగలించి నేర్పిస్తున్న వైనాన్ని చూసైనా మనం కళ్ళు తెరుచుకోవాలి . హిందూ విశ్వాసాల్ని బలంగా ఆచరిస్తూ , మన ధర్మాన్ని రేపటి తరం ఆచరించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి . 

ధర్మో రక్షతి రక్షితః 

శుభం . 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi