Online Puja Services

మంగళదాయని మంగళగౌరి

3.133.112.82

కన్నెపిల్లలకి అనుకూలురైన భర్తలని అనుగ్రహించే మంగళదాయని మంగళగౌరిని దర్శిద్దాం .
- లక్ష్మి రమణ  

మంగళ గౌరి మాంగళ్య దేవత. వివాహమైన తర్వాత మన సంప్రదాయ పడుచులందరూ చేసుకొనే తప్పనిసరి వ్రతము మంగళగౌరీ వ్రతమే . అమ్మవారి శరణు పొందినవారికి మాంగల్యానికి సంబంధించిన బాధలే ఉండవని నమ్మకం. ఆ దేవి సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించినవారికి అమ్మవారి చల్లని చూపు ఎంతటి మహిమాన్వితమైనదో అర్థం అవుతుందంటే అతిశయోక్తి కాదు. ఆ దేవదేవికి ఈ భువి మీద ఉన్న ఆలయాలు తక్కువే . కానీ, ఆ దేవదేవే స్వయంగా నివశించిన ప్రదేశం ఈ భువిమీదే ఉంది . అక్కడ అమ్మవారికి దివ్యమైన ఒక దేవాలయము ఉంది . మహిమోపేతమైన ఆ ఆలయాలన్ని దర్శిద్దాం రండి . 

మంగళూర్ లో ఈ మంగళా దేవి ఆలయం ఉంది. కర్నాటకలో ఉన్న ఈ ప్రాంతం కేరళ రాష్ట్రానికి చేరువగా ఉంటుంది.  ఒక సముద్ర తీర ప్రాంతం కూడా కావడంతో ఇది అన్ని రకాల చాలా ప్రాధాన్యతలూ  సంతరించుకొన్నది. ఇక్కడ  వెలసిన అమ్మవారు మంగళాదేవి వల్లనే ఈ ప్రాంతానికి దానికి ఆపేరు వచ్చింది . అంటే మంగళూర్/ మంగళా దేవి పురం గా పిలుచుకొంటారు. నిజానికి ఆలయం మంగలూర్ దగ్గరలోని బోలార అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతం చుట్టూ చాలా కోటలున్నాయి.  

తుళు ప్రాంతాన్ని పాలించిన అడిపే వంశ రాజు కుద వర్మన్ కాలానికి చెందిన ఆలయం. అంటే, దానిని తొమ్మిది వందల ఏళ్ళ నాటి ఆలయం ఇది. ఆ సమయంలో నేపాల్ దేశం నుంచి “నాధ సంప్రదాయానికి’’ చెందిన మశ్చేంద్రనాథ్, గోరఖ్ నాథ్ లు నేత్రావతి నది ఒడ్డున ఒక పవిత్ర ప్రదేశాన్ని  కనుక్కొన్నారు. ఆప్రదశమే గోరకోండి. ఒకప్పుడు ఇక్కడ కపిల మహర్షి తపస్సు చేసినట్లు గ్రహించారు. కపిల మహర్షి ఆశ్రమాన్ని స్తాపించి, పెద్ద విద్యా కేంద్రంగా తీర్చిదిద్ది, తన సాంఖ్యా శాస్త్రాన్ని బోధించిన ప్రదేశం ఇదే నని తెలుసుకొన్నారు .ఇద్దరు మహాత్ములు వచ్చారన్న సంగతి రాజుకు తెలిసి వారిని దర్శించుకున్నాడు. రాజ్య సుస్థిరతకు అవసరమైన ఒక పవిత్రకార్యాన్ని చేపట్టవలసిందని , ఈ ప్రాంతాన్ని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేద్రంగా మార్చడానికి తమకి అప్పగించాలని ఆ మహానుభావులు రాజుగారికి చెప్పారు . 

అంతేకాక, ఒకప్పుడు సర్వ శక్తి స్వరూపిణి అయినా అమ్మవారు మంగళాదేవిగా తపస్సు చేశారని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు . అందువల్లే ఆప్రాంతానికి ఆవిడ పేరు వచ్చిందని తెలుసుకొని అచ్చెరువును పొందాడు. ఆ ప్రదేశంలోనే విష్ణు స్వరూపుడైన పరశురాముడు అమ్మవారిని ప్రతిష్టించి అర్చించారు. అని తెలియజేసిన ఆ మహర్షులు ఒక ప్రదేశాన్ని రాజుగారికి ఒక ప్రదేశాన్ని చూపించి, అక్కడ తవ్వించమని కోరారు. రాజు ఆ ప్రదేశాన్ని తవ్వించాడు .అక్కడ శివ లింగం ధార పాత్ర దొరికాయి. అదే మంగళాదేవి పూర్వ ఆలయం గా నిర్ధారించారు. 

దాంతో వారు ఆ విగ్రహాలు దొరికిన ప్రదేశంలోనే శివలింగంతోపాటుగా, మంగళకరం స్వరూపిణిగా మంగళాదేవిని కూడా స్థాపించి ఆలయాన్ని నిర్మించారు. నాగరాజు ను కాపలాగా ఉండే విధంగా విగ్రహ ప్రతిష్ట చేశారు. 

అప్పటి నుంచి మంగాళాదేవి ఆలయం ప్రసిద్ధమై ఆ దేశ ప్రజల మనో భీస్టాలను తీర్చే దేవతగా మంగళాపుర అధిష్టాన దేవత గా ప్రసిద్ధి చెందింది. 

 ఇక్కడ దసరా వరాత్రి ఉత్సవాలు వైభవం గా జరుపుతారు. మహర్నవమి నాడు జరిగే రథోత్సవాన్ని చూడాలని రెండుకళ్ళూ చాలవు. ఈ ఉత్సవాన్ని చూడడానికి వేలాది భక్తులు విచ్చేస్తారు . మార్నమి కట్టెదాకా రధాన్ని బలమైన లావుపాటి మోకుల తో లాగుతూ అక్కడికి చేరి అమ్మవారికి అర్చన జరుపు తారు. 

ముఖ్యం గా కన్నె పిల్లలు అనుకూలురైన భర్తలు లభించాలని అమ్మ వారిని కోరుకొంటారు. తప్పక వారి కోరిక నేరవేరుతుందనేడి భక్తుల  విశ్వాసం ఉంది.  మంగాదేవిని దర్శిస్తే సకల శుభాలు కలిగి సంపద పెరుగుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది .పెళ్లి కాని పిల్లలు మంగళ పార్వతీ వ్రతాన్ని చేసి మంచి అనుకూలుడైన భర్త ను ఇమ్మని అమ్మను ప్రార్ధిస్తారు. ఈ సారి కర్ణాటక పర్యాటకంలో ఈ ఆ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని తప్పక దర్శిద్దాం.  

ఇలా వెళ్ళాలి : 

బేజాయ్ - కావూరి రోడ్డు NH 66 పై నుండీ వెళితే , తేలికగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.   కర్ణాటక లోని మంగళూరు నుండీ ఆటోరిక్షాలు ఎల్లప్పుడూ ఆలయానికి తీసుకుపోవడాకి అందుబాటులో ఉంటాయి. 

శుభం !!

Mangala Gowri 

#mangalagowri

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi