Online Puja Services

శనిగ్రహ దోష నివారణకు

3.141.19.130

శనిగ్రహ దోష నివారణకు నీలకృత హనుమత్ స్తోత్రము............!!

నీలుడు చేసిన ఆంజనేయ స్తోత్రం. నీలకృత హనుమత్ స్తోత్రము నిత్యము పఠించు వారియెడ హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.

ఓం జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియ నందన -వాయు కుమారా -ఈశ్వర పుత్ర -పార్వతీ గర్భ సంభూత -వానర నాయక -సకల వేద శాస్త్ర పార౦గ -సంజీవి పర్వతోత్పాటన -లక్ష్మణ ప్రాణ రక్షక -గుహ ప్రాణ దాయక -సీతా దుఃఖ నివారణ -ధాన్య మాలీ శాప విమోచన -దుర్దండీ బంధ విమోచన -నీల మేఘ రాజ్య దాయక -సుగ్ర్రేవ రాజ్య దాయక -భీమసేనాగ్రజ -ధనుంజయ ధ్వజ వాహన -కాల నేమి సంహార మైరావణ మర్దన -వృత్రాసుర భంజన -సప్త మంత్రి సుత ద్వంసన -ఇంద్రజిత్ వధ కారణ -అక్ష కుమార సంహార -లంఖిణీ భంజన -రావణ మర్దన -కుంభకర్ణ వధ పరాయణ-జంబు మాలి నిష్టుదన వాలి నిబర్హన -రాక్షస కుల దాహన అశోక వణ విదారణ -లంకా దాహక -శత ముఖ వధ కారణ -సప్త సాగర వాల సేతు బంధన -నిరాకార నిర్గుణ సగుణ స్వరూపా -హేమ వర్ణ పీతాంబర ధార -సువర్చలా ప్రాణ నాయక -త్రయ త్రిమ్శాత్కోటి అర్బుద రుద్ర గణ పోషణ -భక్త పాలన చతుర -కనక కు౦డలాభారణ -రత్న కిరీట హార నూపుర శోభిత –రామ భక్తి తత్పర –హేమ రంభావన విహార -వక్షతాంకిత మేఘ వాహక -నీల మేఘ శ్యామ -సూక్ష్మ కాయ -మహా కాయ -బాల సూర్య గ్రసన –ఋష్యమూక గిరి నివాసక -మేరు పీతకార్చన –ద్వాత్రిమ్శాదాయుధ ధర -చిత్ర వర్ణ -విచిత్ర సృష్టి నిర్మాణ కర్త -అనంత నామ -దశావతార -అఘటన ఘటనా సమర్ధ -అనంత బ్రహ్మన్ -నాయక -దుర్జన సంహార -సుజన రక్షక -దేవేంద్ర వందిత -సకల లోకారాధ్య -సత్య సంకల్ప -భక్త సంకల్ప పూరక -అతి సుకుమార దేహ -ఆకర్డమ వినోద లేపన -కోటి మన్మధాకార -రణ కేళి మర్దన -విజ్రుమ్భ మాణ -సకల లోక కుక్షిమ్భర -సప్త కోటి మహా మంత్ర తంత్ర స్వరూప -భూత ప్రేత పిశాచ శాకినీ దాకినీ విధ్వంసన -శివలింగా ప్రతిష్టాపన కారణ -దుష్కర్మ విమోచన -దౌర్భాగ్య నాశన -జ్వరాది సకల లోప హర -భుక్తి ముక్తి దాయక -కపట నాటక సూత్రా దారీ -తలావినోదాంకిత -కళ్యాణ పరిపూర్ణ -మంగళ ప్రద -గాన ప్రియ -అష్టాంగా యోగ నిపుణ -సకల విద్యా పారీణ -ఆది మధ్యంత రహిత -యజ్న కర్త -యజ్న భోక్త -శన్మత వైభవ సానుభూతి చతుర -సకల లోకాతీత -విశ్వంభర -విశ్వ మూర్తే -విశ్వాకార -దయాస్వరూప -దాసజన హృదయ కమల విహార –మనోవేగ గమన -భావజ్న నిపుణ –రుషి గణ గేయ -భక్త మనోరధ దాయక -భక్త వత్సల -దీన పోషక -దీన మందార -సర్వ స్వతంత్ర -శరణాగత రక్షక -ఆర్త త్రాణ పరాయణ –ఏక అసహాయ వీర -హనుమాన్ –విజయీ భవ -దిగ్విజయీ భవ -దిగ్విజయీ భవ.

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi