Online Puja Services

ఐశ్వర్యాన్ని అనుగ్రహించే శివ ప్రదోష స్తోత్రం .

13.59.100.205

ఐశ్వర్యాన్ని అనుగ్రహించే శివ ప్రదోష స్తోత్రం . 
- లక్ష్మి రమణ 

ప్రదోషకాలం అత్యంత పవిత్రమైంది. ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే త్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత మూడు గడియలు (గంటా పన్నెండు నిమిషాలు) ప్రదోషకాలమని కొందరు చెబుతారు. ప్రదోషకాలం అంటే రాత్రికి ఆరంభ సమయంగా పరిగణిస్తారు. దీనిని పాపనిర్మూలన సమయంగా భావిస్తారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవం చేస్తాడని ప్రతీతి. ఈ సమయంలో ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం గానీ, భజనలు గానీ చేస్తే మంచిదని పెద్దల మాట. ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుందనీ, నెయ్యితో అభిషేకిస్తే మోక్షం లభిస్తుందనీ, గంధంతో అభిషేకం చేస్తే లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ప్రదోష  చేయవలసిన పరమేశ్వర స్తోత్రం ఇది. 

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా ఈ శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించిన భక్తులకు ఆ భోళా శంకరుడు కోరిన కోర్కెలన్నిటినీ అనుగ్రహించి  దీవిస్తాడు.

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi