హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తున్నారా ?
హనుమంతుడికి ప్రదక్షిణలు చేస్తున్నారా ?
సేకరణ: లక్ష్మి రమణ
హనుమంతుడు వాయుపుత్రుడు , మహాబలుడు . ఆయనకీ ప్రదక్షిణాలు చేయడం వలన చాలా ప్రయోజనాలున్నాయి. శని, రాహు, కేతు గ్రహ బాధల నండీ విముక్తి లభిస్తుంది. రాక్షస పిశాచ పీడలు ఆయన పేరు చెబితే చాలు ఆమడ దూరం పారిపోతాయి. మనోదౌర్బల్యం మాయమై పోతుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ కూడా హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం వలన సిద్ధిస్తాయి. అయితే, ప్రదక్షిణలు చేయాలనుకునే వారు ఈ విషయాలని గుర్తుంచుకోవాలి.
1.ఆలయాలలో ప్రదక్షిణాలు చేసేప్పుడు, త్వరగా తిరగేస్తే అయిపోతాయనే భావనతో తిరగకూడదు . గర్భాలయంలో ఉన్న ఆ ఆంజనేయునిపైన మనసునిలిపి , మెల్లగా నడుస్తూ, తలని వంచి, చేతులు జోడించి ప్రదక్షిణాలు చేయాలి .
2. ఆంజనేయుడు ఆయన పేరు కన్నా శ్రీరాముని పేరు చెబితేనే ఎక్కువగా సంతోషిస్తారు. త్వరగా అనుగ్రహిస్తారు కూడా ! కాబట్టి ఆయనకీ ప్రదక్షిణాలు చేసేప్పుడు రామనామాన్ని జపించడం మంచిది .
3. ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క సంఖ్యలో ప్రదక్షిణాలు చేయడం భారతీయులకి ఆనవాయితీ. హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి .
4. సాధారణంగా ఆంజనేయునికి వారి మొక్కుని అనుసరించి 108 ప్రదక్షిణలు చేస్తారు . ఒకే సారి 108 కుదరకపోయినా , 54, లేదా 27 ప్రదక్షిణలు చేయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది .
5. ఆంజనేయస్వామి తన పాదాల కింద భూత , ప్రేత పిశాచాలని ఏడ్చివేసి , తొక్కిపెట్టి ఉంచుతారట. అందుచేత, ఆయన పాదాలకి నమస్కారం చేయకూడదని కొందరి వాదన .
6. అలాగే, స్త్రీలు ఆ స్వామిని తాకకూడని చెబుతారు . ఆయన ఘోటక బ్రహ్మచారి కాబట్టి ముట్టుకోకూడదని అంటారు .