రాముడికి సీత ఏమవుతుంది ?

రాముడికి సీత ఏమవుతుంది ? ఇది హనుమంతుడి అనుమానం .
-సేకరణ
సాధరణముగా మన జీవనములో అన్నీ,అంతా వివరముగా చెప్పినా, మొత్తము విన్నతరువాత మూలము గురించి ఎవరైనా సందేహంగా ఆడిగితే ఇదిగో ఇలా అంటారు రామాయణమంతా విని రాముడుకు సీత ఎమవుతుంది ? అన్నాడట అని వేళాకోళము చేస్తారు. కానీ ఈ సందేహం వచ్చింది హనుమంతులవారికి అంటే, మనకి ఆశ్చర్యం కలుగక మానదు .
అచంచల రామభక్తుడు , సీత కోసం అన్వేషణ జరిపిన వాడు హనుమంతుడు. ఆయనకీ ఇలాంటి అనుమానమేమిటా అని ఆశ్చర్యపోవడం మనవంతు. కానీ, ఈ ప్రశ్నకు మనము అంతరార్ధము తెలుసుకుంటే, రామయణ పరమార్ధము మనకు అర్థము చేసుకోగలుగుతాం .
సీతా అన్వేషణకై హనుమంతుడు లంకలోకి అడుగు పెట్టాడు. లంకలో తీవ్రాతితీవ్రమయిన అన్వేషణ చేసిన హనుమంతులవారికి అశోకవనంలో సీతమ్మ దర్శనమిచ్చింది. ఆమెని చూసి ఆశ్చర్యపోయారు మారుతి .
“అస్యా దేవ్యా యధారూపం అంగప్రత్యంగ సౌష్టవమ్ రామస్య చ యధారూపం తస్యేయ మసితేక్షణా” అనుకున్నారు హనుమ .
సీతారాములకు అన్నివిషయాలలొ సామ్యము, సారూప్యము, ఏకత్వము వున్నది. అశోకవనములొ సీతాదేవి రూపలావణ్యము చూసి హనుమంతుడు నివ్వెరపొతాడు. అది అమ్మ అతిలోక సౌందర్యాన్ని చూసిన నివ్వెరపాటు కాదు ; అమె రూపమంతాకూడా ముమ్ముర్తులా రామచంద్రమూర్తిని పోలి , ఆ స్వామే స్వయంగా స్త్రీ రూపాన్ని ధరించి వచ్చారేమో అనే అనుమానం కలిగింది హనుమంతునికి .
సాధారంగా తల్లి- పిల్లలు, తండ్రి -బిడ్డలు, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లు, మేనమామ ,మేనత్తల పిల్లలు ఒకే పోలికలతో ఉండడము సహజమైన విషయమే . కానీ, ఏ సంబంధమూ లేని భార్య భర్తలు ఒకే రూపంలో ఉండటము చాలా అరుదు.
ఇది ఎలా సాధ్యమయింది? ఇదే రామయణములోని అద్వైత రససిద్ధి. సీతారాములకు రూపములొనే కాదు గుణగణాల్లో,ఆలోచనల్లొ,ఆనందములో.ఆవేదనలో అన్నిటా ఏకత్వమే దేనిలోకూడా వ్యత్యాసములేదు."అస్యా దెవ్యా మనస్తస్మిన్ - తస్య చాస్యం ప్రతిష్ఠితం" అన్నట్టుగా ఆయన మనసులో ఆమె , ఆమె మనస్సులో ఆయనఇలా ఒక్కరిలో ఒకరు లయించి ఉన్నారన్నమాట . ఇలా ఒకరికొకరు బింబ ప్రతిబింబముగా ఉన్న సీతారాముల ఆత్మ, మనస్సు , శరీర సామరస్యాన్ని చూసిన హనుమంతుడు స్థంభించిపోతాడు.
అలాంటి మనస్థితిలో హనుమంతుడులాంటి బుద్ధిమంతుడే పడిపోయాడంటే, ఇక మనలాంటి పామరులు ఆ విధంగా సీతమ్మ రాములోరి ఏమవుతుందని అనుకోవడంలో పొరపాటులేదు. సీతారాముల మధ్యగల అన్యొన్యతను,అభిన్నతను,అనుబంధాన్ని అక్షరరూపములో నిరూపించటమే "రామయణ" పరమావధి. శ్రీరాముడు పరామాత్మస్వరూపుడయితే సీతాదేవి పరామాత్మయందలి పరమ కళ. ఈ కళ ముల్లొకాలకుకూడా మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.
ఈ కధనము ఇలపావులూరి పాండురంగారావుగారి రామాయణపరమార్ధము అన్న పుస్తకము నుంచి తీసుకొనబడినది.ఈ పుస్తకము టిటిడి వారు ప్రచురించారు. సుందరకాండలోని 15వ సర్గనందు 51వ శ్లోకంగా ఇందులో పైన చెప్పిన శ్లోకం ఉంది . ఆ సంఖ్యలని కూడా గమనించండి . 15 - అవే సంఖ్యలని తిరగేస్తే, 51 రెండూ ఒకదానికొకటి ఈ సంఖ్యలు కూడా సరిపోలుతున్నాయి కదూ !