Online Puja Services

దీపం పెట్టుకోవాలంటే, రోజూ తలారా స్నానం చెయ్యాలా ?

3.139.234.124

ఇల్లాలు దీపం పెట్టుకోవాలంటే, రోజూ తలారా స్నానం చెయ్యాలా ?
లక్ష్మీ రమణ 

ఇంట్లో  యజమాని నిత్యం దీపారాధన చేసుకుంటే మంచిది. ఆ దీపారాధన ఫలం ఇంటిమొత్తానికీ అందుతుంది . ఇంటిని తన కాంతితో కాపాడుతుంది . సమాజంలో ఉన్న పరిస్థితులవల్ల కావొచ్చు, నిత్యం ఉన్న ఒత్తిడి పరిస్థితులవల్ల కావొచ్చు , ఇంటి యజమానికి దీనిని పాటించడానికి ఇబ్బంది ఉన్నప్పుడు, యజమానురాలు దీపం పెట్టుకోవాలి . అంతేకానీ దీపం పెట్టుకోవడం మాత్రం మానకూడదు .  ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు కదా ! కానీ, భర్త పుణ్యంలో భార్యకి సగభాగం లభిస్తుంది. భార్య పుణ్యంలో  భర్తకి భాగం ఉండదని పెద్దలు చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ మనవారు గ్రహించుకోవాలి . ఆవిడ నిత్యం దీపం పెట్టుకోవడానికి  ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి . నెలనెలా రుతుక్రమం వస్తుంటుంది.  అప్పుడెలా దీపారాధన చేసుకోవాలి ? వివాహితలైతే నిత్యమూ తలస్నానం చెయ్యాలా అని సందేహం ? 

దీపారాధన చేసుకొనే ఇల్లాలు నిత్యమూ తలంటు చేయవలసిన అవసరం లేదు . స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకోవచ్చు . స్నానం చేసేముందర కాస్త పసుపు ముఖానికి రాసుకోండి. సౌభాగ్యము, సౌచము రెండూ సంప్రాప్తిస్తాయి . ఆడవారికి పసుపుని మించిన శుచి, పసుపునీళ్లని మించిన సంప్రోక్షణా మరింకేదీ లేదంటారు పండితులు.   అయితే, ప్రత్యేకసందర్భాలలో , పండుగరోజుల్లో , వారంలో విహితమైన రోజుల్లో చక్కగా తలంటి స్నానం చేసి దీపారాధన చేసుకోండి . 

ఇక నెలసరి సమయాల విషయానికొస్తే, రుతుస్రావం మొదలైన నాటినుండీ మూడురోజులపాటు దూరంగా ఉంచే సంప్రదాయం ఉంది . అది ఇంకా కొన్ని ఇళ్లల్లో ఇప్పటికీ అమలులో ఉంది . నాల్గవరోజు తలస్నానం చేసి ఇంట్లోకి రావొచ్చు . ఐదవనాడు మళ్ళీ తలస్నానం చేశాక వారు అన్ని కార్యములకీ అర్హులే . ఇంకా సందేహం  ఉంటె, ఆరవనాటినుండీ చక్కగా దీపారాధన చేసుకోండి .

భార్యాభర్తల్లో భార్య శక్తి స్వరూపం . శక్తి స్వరూపమైన అమ్మవారికి స్త్రీలు దీపం పెట్టుకుంటే చాలా మంచిది . ఐశ్వర్యము, సౌభాగ్యము ఇచ్చి అమ్మ ఆశీర్వదిస్తుంది . గౌరీదేవి ప్రసన్నమై ఐదవతనాన్ని అనుగ్రహిస్తుంది . కామాక్షీ దీపం వెలిగించుకుంటే మరీ మంచిది . యువతులు ఇలా నిత్యమూ దీపారాధన చేసుకుంటే, చక్కని రూపవంతుడూ , భాగ్యవంతుడు , శ్రీరామచంద్రుడు లాంటి భర్త లభిస్తాడు . భార్యాభర్తలమధ్య అనురాగం ఆప్యాయతలు నెలకొని , ఇంట్లో చక్కని నందనవనంలాంటి వాతావరణం  ఏర్పడుతుంది . శాంతి , సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి .  కాబట్టి ,సందేహాలన్నీ పక్కన పెట్టేసి చక్కగా నిత్యం దీపారాధన చేసి అమ్మవారి కృపకి పాత్రులవ్వండి .

శుభం .    

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore