Online Puja Services

మంగళ సూత్రాల్లో ముత్యాలు, పగడాలు ఎందుకు?

3.133.109.58

మంగళ సూత్రాల్లో తెల్ల పూసలు (ముత్యాలు ) , ఎర్రపూసలు (పగడాలు), నల్లపూసలు ఎందుకు కడతారు ?
లక్ష్మీ రమణ 

మంగళ సూత్రాల్లో చాలా మందికి ముత్యాలూ , పగడాలు , నల్లపూసలు పసుపు తాడుతో వేసి కట్టుకోవడం ఒక సంప్రదాయంగా ఉంటుంది . ఈ సూత్రం కట్టేప్పుడు “ మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా !కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతం !! అని మంత్రయిక్తంగా మూడుములూ వేస్తారు . అది సమస్త కీడుల్నీ తొలగిస్తుందని విశ్వాసం . కానీ అప్పుడు ఆ సూత్రాల్లో కట్టని పూసల్ని ఎందుకు ఆ తర్వాత సూత్రాలలో వేసి కట్టమన్నారనే దానికి చక్కని వివరణని ఇక్కడ తెలుసుకుందాం !

ముత్యమనేది చంద్రగ్రహానికి ప్రతీక . అందుకే ముత్యం చల్లగా ఉంటుంది . శరీర సౌందర్యం , మనస్సు, శాంతి , ఆనందాలకు , అన్యోన్యమైన దాంపత్యంలకు కారకుడు చంద్రుడు . అదే విధంగా కన్నులు, హార్మోనులు , సిరలు , ధమనులు , గుహ్యావయవములు , ఇంద్రియాలు , గర్భధారణ , ప్రసవములని ప్రభావితం చేసేటటువంటివాడు . 

ఇక పగడము కుజునికి ప్రతీక . అతికోపము , కలహాలు , మూర్ఘత్వం , సామర్ధ్యం , రోగము , అప్పుల బాధలు , మంటలు , విద్యుత్తు అంటే భయము , అతిశయించిన కామ వికారము , దీర్ఘమైన మాంగల్య సౌభాగ్యము , ద్రుష్టి దోషములు కుజగ్రహ ప్రభావాలు . శరీరంలోని కడుపు ప్రాంతాన్ని, రక్తస్రావాన్ని ప్రభావితం చేస్తారు . గర్భస్రావాలు , ఋతుదోషాలని కలిగిస్తారు .
 
వీళ్ళిద్దరూ ఒక స్త్రీ జీవితంపైనా అత్యంత ప్రభావాన్ని చూపిస్తారు . చంద్రుడు 27 నక్షత్రాలలో సంచారాన్ని ముగించుకొని 28వరోజు కుజునితో కలుస్తాడు. అందువల్ల ఆరోగ్యవంతమైన స్త్రీలకి ఖచ్చితంగా 28 రోజులకి రుతుదర్శనం అవ్వాలి .ఇదీ కథ . 

ఇక , వీరిద్దరికీ ప్రతీకలైన ముత్యాన్ని , పగడాన్ని ఎందుకు మంగళసూత్రంలో ధరించామన్నారంటే,సూర్యకిరణాలలోని తెలుపుకాంతిని ముత్యం ద్వారా , యెర్రని కాంతిని పగడం ద్వారా స్త్రీలలోని నాడీవ్యవస్థ గ్రహించ గలుగుతుంది. దానివల్ల ఆమె శరీరం ఉత్తేజితమవుతుంది .  ఈ రెండిటినీ ధరించిన స్త్రీ ఖచ్చితంగా మానసికంగా కొత్తగా వచ్చిన తన కుటుంబ బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించగలిగిన స్థితిని పొంది ఉంటారు . దానికి తోడుగా సరైన ఋతు చక్రాన్ని పొందగలుగుతారు . అందుకె , మన పెద్దలకాలంలో వారికి ఆపరేషన్లు చాలా తక్కువగా అవసరమయ్యేవి . ఇప్పటి కాలంలో అసలు ఆపరేషన్ లేకుండా బిడ్డ ఎలా పుడుతుంది అని అడిగే పరిస్థితిలో సమాజం ఉంది.

సాంసారిక జీవనాన్ని ఆనందమయంగా అనుగ్రహించేవాడు కుజుడే కనుక, ఆ జీవనానికి మాంగళ్యంలో పగడం ధరించడం మంచిది అనే కారణాన్ని కూడా శాస్తం మనకి చెబుతుంది . ఇక , నల్లపూసలు ఆమె మాంగల్యానికి దిష్టి తగలకుండా , నీల గౌరిగా భావించి చేర్చేటటువంటి విశేషం.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore