గోవులకి ఆహారంగా ఈ పదార్థాలని అర్పిస్తే,
గోవులకి ఆహారంగా ఈ పదార్థాలని అర్పిస్తే, చక్కటి ఫలితాలని పొందొచ్చు !
సేకరణ
ఆవుల్ని కామధేనువులుగా, సర్వదేవతా స్వరూపాలుగా ఆరాధించడం మన సంస్కృతీ . గోపూజలు చేయడం అంటే, ముక్కోటిదేవతలనీ అర్చించడమే అని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి . ఈ అర్చనతో పాటు గోవులకి ఆహారంగా ఏ పదార్థాలని సమర్పించాయి అనేది కూడా ఒక ముఖ్యమైన విశేషమే. ఇలా ఏ పదార్థాన్ని గోవులకి ఆహారంగా సమర్పించడం వలన మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే విశేషాలని పండితులు ఇలా వివరిస్తున్నారు . ఆ వివరాలు తెలుసుకుందామా !
రోజుకొక్క సారైనా గోవు వెనక తట్టు చూసిన వారు, ప్రదిక్షణ చేసిన వారూ లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటిముందుకు వచ్చి నిలబడిన గో మాతకు చేతులారా పండూ, ఫలమూ, పరక ని తినిపించిన వారు సాక్షాత్తు లక్ష్మీ దేవికి పాయసం తినిపించినంత ఫలాన్ని పొందుతారు. ఇదే విధంగా, గోవులలో ముక్కోటి దేవతలూ ఉంటారని మన శ్రుతులు వివరిస్తున్నాయి . గోవుకు సాధారణంగా గరికను ఆహారంగా పెడతారు. కానీ ప్రతి ఆహార పదార్థానికి అది దేవతలు ఉంటారు. మనం పెట్టే ఆహార పదార్థాలు తినగానే ఆ ఆహార పదార్ధం వల్ల సంతుష్టి చెందే గోవులోని అధిదేవత దానికి అనుగుణంగా మనకు ఫలితాలను అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ విధంగా గోవుకు ఆహారాన్ని సమర్పించి భక్తిపూర్వకంగా 3 ప్రదక్షణలు చేయడం వలన మన అభీష్టాలు సిద్ధిస్తాయని వివరిస్తున్నారు పెద్దలు. ఆ వివరాలని తెలుసుకుందాం .
నానబెట్టిన ఉలవలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసే వృత్తిలో నిలకడగా ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్ల ను ఆహారంగా పెట్టడం వల్ల ధనం అభివృద్ధి చెందుతుంది. నానబెట్టిన గోధుమలను ఆహారంగా పెట్టడం వల్ల మన కీర్తి పెరుగుతుంది.
బియ్యప్పిండి బెల్లం కొంచెం నీటితో కలిపి ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. నానబెట్టిన కందులను ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. నానబెట్టిన కుసుమాలను ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి, బెల్లము కొంచెం నీటితో కలిపి పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసర్ల ను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది.
ఉడికించిన ఆలుగడ్డలను ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటి పళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. బెండ కాయ పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయ పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది.
జొన్నపిండి బెల్లము నీటితో కలిపి పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినప పిండి బెల్లం నీటితో కలిపి పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం నీటితో కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియనిగ్రహం శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి.
నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి చనగ పప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగ పిండి బెల్లం నీటితో కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధికుశలత కలుగుతుంది. ఇలా ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే పైన చెప్పిన ఫలితాలు వస్తాయి.