మనం ఏ నామంతో జపిస్తే ఏ పలితం వస్తుంది.
భగవంతుడిని మనం ఏ నామంతో జపిస్తే ఏ పలితం వస్తుంది.
–లక్ష్మీ రమణ
జిహ్వకోరుచి , పుర్రెకో బుద్ధి అంటారు కదా ! అలాగే ఏ బుద్ధికి తోచిన దేవతని వారు అర్చించుకోవచ్చనేనేమో మనకి ముఫై మూడు కోట్లమంది దేవీ దేవతలని చెప్పారు . అప్పటికైనా చిత్తవృత్తులని నిరోధించి , భగవంతునిపైన మనసుని లగ్నం చేయగలరని ఇన్ని రూపాలూ ధరించి ఒక్కడే అయిన ఆ దైవం ఎదురు చూస్తూ ఉంటుంది . కోటికోటి నామాలవాడికి ఏ పేరు పెడితే అది ఆయనది కాదు చెప్పండి ! అయినా ఈ పేరుతొ పిలిస్తే, ఇలాంటి వరం అనుగ్రహిస్తారని కొన్ని విశేష ఫలితాలని చెప్పారు విజ్ఞులు . వాటి వివరాలు ఒకసారి చూద్దాం .
మన ఇంట్లో చిన్నవారినీ పెద్దవారిని పిలిచేప్పుడు ఉండే మార్దవం, మన కంఠంలో పలికే గౌరవం చాలా పనులు జరగడానికి కారణంగా ఉంటూంటాయి . పెద్దలు ఒక సామెత చెబుతుంటారు కదా ! “ ఏమ్మా మీ నాన్నగారున్నారా ? “ అని మర్యాద పూర్వకంగా అడిగే తీరుకీ వేరే విధంగా అడిగే తీరుకీ సమాధానం కూడా అదేవిధంగా గోడకి కొట్టిన బంతిలా వస్తుంది . అలాగే భగవంతునికి కూడా ! సరే, ఇక , ఆ నామాలూ వాటి ఫలితాలూ ఏమిటో తెలుసుకుందాం పదండి .
• శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది.
• కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాదులు మటుమాయం అవుతాయి.
• దమోదర అని జపిస్తే బందముల నుంచి విముక్తి లబిస్తుంది.
• నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమశిపోతాయి.
• మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.
• ఆచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషదంగా పనిచేస్తుంది.
• నరసింహ అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది, అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుండీ విముక్తి కలుగుతుంది.
• గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది.
• శ్రీ లక్ష్మినారాయణ లను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలాడుతుంది.
• సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది.
• జగన్నాథా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత చేకూరుతుంది .
• కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి.
• శివ శివ అని స్మరిస్తే సకలమూ సంప్రాప్తిస్తాయి.
మరింకా ఆలశ్యం ఎందుకు ? మీకు నచ్చిన నామాన్ని మనసు పెట్టి స్మరించి, జపించి , తరించండి . ఈ నామాలని జపిస్తే, నిజంగా ఇలాంటి ఫలితాలుంటాయా ? అని అనుమానం పక్కన పెట్టి, నమ్మి ఆచరిస్తే, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి .