మీ ఇంట్లో సీతాఫలం చెట్టుందా ?
మీ ఇంట్లో సీతాఫలం చెట్టుందా ?
లక్ష్మీ రమణ
సీతాఫలం రామాఫలం అని సీతాఫలం జాతికి చెందిన రెండు రకాల పండ్లనిచ్చే చెట్లున్నాయి. ఈ రెండూ చూసేందుకు ఒకేరకంగా ఉన్న పళ్లనే ఇస్తాయి. రామాఫలం అయితే, కాస్త ఎర్రగా కూడా ఉంటుంది. సీతాఫలం చిగురులూ, మొగ్గలూ వ్యసనాలకు బానిసయినవారికి మంచిమందు. ఇక, దాని బెరడు , ఆకులూ అన్ని కూడా గొప్ప ఆయుర్వేద విలువలు కలిగినవి అంటారు ఆయుర్వేద వైద్యులు. ఇదిలా ఉంచితే, ఇంతటి గొప్ప చెట్టుని ఇంట్లో పెచుకోవద్దంటారు వాస్తు పండితులు.
సీతాఫలం పేరులోనే లక్ష్మీ దేవి స్వరూపాన్ని కలిగినది . గొప్ప ఆయుర్వేద గుణాలు ఉన్నది. గ్రామాలల్లో సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఉంతూనే ఉంటుంది. ఇప్పుడు పట్టణాల్లో అయితే ప్రత్యేకించి ఇంట్లో ఈ చెట్టుని పెంచుకుంటున్నారు కూడా ! అయితే, ఇక్కడ విషయం ఏంటంటే, సీతాఫలాన్ని ఇంట్లో పెచుకోకూడదట ! సీతాఫలం చెట్టు ఇంట్లో ఉంటె, సీతమ్మోరు పడ్డ కష్టాలన్నీ , ఇంట్లో వారు పడాల్సి వస్తుందట !
సీతాఫలం చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులుపడాల్సి వస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఇప్పుడు వాస్తుకు, చక్కగా ఇష్టపడి పెంచుకున్న సీతాఫలం చెట్టుని నరికేయమంటారా అని బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి పరిష్కారం ఏంటంటే, మన ఇంటి ఆవరణంలో సీతాఫలం చెట్టుని నరికి వేయకుండా, ఆ చెట్టు పక్కనే ఉసిరి చెట్టు లేదా అశోక చెట్టును పెంచుకోవాలి . ఇలా చేయడం వలన వాస్తు దోషం తొలగిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సీతాదేవి శోకాన్ని అశోకవనమేకదా భరించింది.
అదే సమయంలో ఈ సీతాఫలాలతో లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది. లక్ష్మీ దేవి కటాక్షం కోసం సీతాఫలాలు నివేదన చేయడం చాలా మంచి ఫలితాన్ని వెంటనే అనుగ్రహిస్తుందని సూచిస్తున్నారు పండితులు.