Online Puja Services

కుడివైపుకి తిరిగి నిద్రిస్తే పిశాచాలు అవహిస్తాయా?

18.220.199.255

కుడివైపుకి తిరిగి నిద్రిస్తే పిశాచాలు అవహిస్తాయా?
-లక్ష్మీ రమణ 

మన హిందూ సంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి. ప్రతి నమ్మకం వెనుక ఏదో ఒక పరమార్థం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఉత్తర దిక్కున తల పెట్టి నిద్రించడం వాస్తు దోషము అని మన పూర్వికులు చెబుతుంటారు. ఇక కుడివైపుకి తిరిగి నిద్రిస్తే పిశాచాలు అవహిస్తాయనే నమ్మకం కూడా ఉంది.  వెనుకున్న సైన్స్ ఏమిటి ?

కాలికి పసుపు రాసుకోవడం, గుమ్మాళికి వేపమండలు, మామిడాకులూ కట్టుకోవడం, తులసికి పూజలు చేయడం , రోజూ ధూపాన్ని దేవీదేవతలు ముందు అర్పించడం అనేవి సైన్స్ పరంగా సూక్ష్మక్రిమి నాశకాలుగా నిరూపితమయ్యాయి. ఇలాగే ఎన్ని హిందూ ఆచారాలు ఇప్పుడు వైజ్ఞానికంగా నిరూపితమవుతూ , సనాతనధర్మం లోని సంస్కృతీ వైదుష్యాన్ని చాటుతున్నాయి . సృష్టిలో ఇప్పటికే ఉన్నది ఎప్పటికి చెరిగిపోదు. ప్రయత్నించినా అంతకు మించినదేదీ సృష్టించబడదు .  మూలమైనదానిని మానవుడు సృస్టించలేడు.  ఈ సత్యాన్ని గుర్తెరుగుతున్న సమాజం ఇప్పటికైనా పాశ్చ్యాత్త పిచ్చి నుండీ బయటపడి , మన సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తుందని భావించాలి. 

ఇక , ఈ నమ్మకాల విషయానికొస్తే, కుడి వైపుకి తి రిగి నిద్రిస్తే అనేక పీడకలలూ కలత నిద్రావస్తాయని, శాస్త్రం వాక్కానిస్తోంది. కావున ఎడమ వైపు తిరిగి పడుకోవాలని చెబుతారు. పెద్దల మాటల్లో ఎంతో ఆరోగ్య సత్యం కూడా ఉంది. మానవునకు ఎడమ పార్శ్వమున జఠరాగ్ని ఉంటుంది. తిన్న ఆహారము సరిగ్గా జీర్నించటానికి ఎడమ వైపు తిరిగి పడుకోమని చెబితే వినరని, చాదస్తంగా కొట్టి పారేస్తారని, భయముతోటైనా జనం వింటారని ఉద్దేశ్యంతో ‘ కుడివైపు తిరిగి నిద్రిస్తే పిశాచాలు ఆవహిస్తాయని’ చెబుతారు. 

ఇదే విధంగా ఉత్తరం దిశగా తిరిగి నిద్రించవద్దని చెప్పే విధానం కూడా ! 

భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంద‌ని చ‌దువుకున్నాం క‌దా. ఉత్త‌ర, ద‌క్షిణ ధృవాలు కూడా ఉంటాయి. ఇవి అయ‌స్కాంత క్షేత్రాల్లా ప‌నిచేస్తాయి. అలాగే మ‌నిషిలో కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ క్ర‌మంలో త‌ల వైపు ఉత్త‌ర దిశ క్షేత్రం, కాళ్ల వైపు ద‌క్షిణ దిశ క్షేత్రం ఉంటుంద‌ట‌. అందుకనే త‌ల‌ను ఉత్త‌రం వైపు పెట్ట‌కూడ‌ద‌ని చెబుతారు. 

ఎందుకంటే శ‌రీర ప‌రంగా త‌ల వైపు ఉత్త‌ర దిశ క్షేత్ర‌మే ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి భూమిపై ఉండే ఉత్తర దిశ‌కే పెడితే అప్పుడు స‌జాతి ధృవాలు రెండు విక‌ర్షించుకున్న‌ట్టు అవుతుంది. దీంతో శ‌రీరానికి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

అలా వికర్షణ చెందినప్పుడు, మన మెదడులో ఉన్న కోబాల్ట్ నికిల్ ఐరన్ కణాలను ఆకర్షిస్తుంది . దీనివల్ల మెదడు తన శక్తిని కోల్పోవడం జరిగి, తరచూ  పీడకలలు రావడం,అర్ధరాత్రి మేలుకువ రావడం,సరిగ్గా నిద్ర పట్టక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

 ఇంకా శరీరంపైనా ఈ  అయ‌స్కాంత క్షేత్ర ప్ర‌భావం ఉంటుంది. రక్తప్రసారం దీని ప్రభావానికి లోనుకావడం వలన బీపీ పెరుగుతుంద‌ట‌. గుండె స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌డుతుంద‌ట‌. ఇంకా ప‌క్ష‌వాతం వ‌చ్చేందుకు అవ‌కాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.

అందువలన ఉత్తరదిశకి తిరిగి పడుకోవడం , కుడివైపుకు తిరిగి నిద్రించడం చేయకూడదు . 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha