మహా సంస్కర్త రామానుజాచార్య యతి
మహా సంస్కర్త రామానుజాచార్య యతి .
-సేకరణ: లక్ష్మి రమణ
మన దక్షిణ భారత దేశంలో విశిష్టా ద్వైత స్థాపకుడు,శ్రీ వైష్ణవ సాంప్రదాయ స్థాపకుడు శ్రీ రామానుజా చార్యులు. వీరు చెన్నైకు దగ్గరలోని శ్రీ పెరంబుదూరు అనే గ్రామంలో కాంతిమతి,సర్వ క్రతు కేశవ దీక్షితులు పుణ్య దంపతులకు క్రీస్తు శకం 1017 వ సంవత్సరంలో చైత్ర శుద్ధ పంచమినాడు రామానుజాచార్యులు జన్మించారు. వీరిది ఆరుద్ర నక్షత్రం. హరితస గోత్రం. వీరిని ఆ లక్ష్మణ స్వామి అపరావతారంగా శ్రీ వైష్ణవులు భావిస్తారు. వీరు నిజంగా అవతారపురుషులు. గురువాజ్ఞని అతిక్రమించాయినాసరే, తనకి నరకం ప్రాప్తించినా సరే, ప్రజాబాహుళ్యానికి మోక్షం సిద్ధించాలని , గురువు ఉపదేశించిన మహామంత్రాన్ని తిరునారాయణపుర గోపురమెక్కి , కులమత విచక్షణ లేకుండా ఉపదేశించిన మహానుభావుడు .
బాల్యంనుంచీ రామానుజుడు ఏక సంత గ్రాహి.స్వతంత్రంగా ఆలోచించే స్వభావం కలవాడు.అవసరమైతే గురువునుకూడా కాదని వాదించే స్వభావం కలవాడు. ఒక నాడు తన గురువైన యాదవ ప్రకాశుడు భగవంతుని రూప లావణ్యాలను గురించి వివరిస్తూ,”కప్యాశం పుండరీకం”అని ఉపనిషత్తులో ఉన్న విషయాన్ని వ్యాఖ్యానిస్తూ భగవంతుని ముఖం కోతి ముడ్డి వలే ఎర్రగా ఉంటుంది. అని వివరించగానే మన రామానుజుడు ఒక్కసారి మూర్చ పోయినంత పనై ఏడుపు ముఖం పెట్టేశాడు. గురువు మందలిస్తూ ఉంటే మీరు భగవంతుని నిందించి భగవదపచారం చేశారు. అందుకు చింతిస్తున్నానని అన డంతో ప్రకాశునికి కోపం తారస్థాయికి చేరింది. ఇంతకన్నా గొప్పగా నువ్వు వ్యాఖ్యానించగలవా?అని ప్రశని స్తాడు. నాకు గురు అనుగ్రహం ఉంటే అంతకన్నా బాగా చెబుతానని ఇలా భాష్యం చెప్పాడు.
“కప్యాశం పుండరీకం”కం జలం పిబంతీతి కపి:కపి అనగా సూర్యుడు అని అర్ధం.నీళ్ళను నిరంతరం ఎవరు తాగుతారో వారు.ఎవరి కాంతి వల్ల నీళ్ళలో ఉండే పద్మం వికసించి ఎర్రగా ఉంటుందో అలాగే భగవంతుని మూతి కమలం వలె ఎర్రగా ఉంటుంది.అదే ఈ మంత్రార్ధమని రామానుజుడు చెప్పాడు.అలాగే వేరొకసారి”సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” అనే దాన్ని యాదవ ప్రకాశుడు సత్యం,జ్ఞానం,అనంతం బ్రహ్మ అని చెప్పగా,వెంటనే రామానుజుడు ఆయన్ను ఖండిస్తూ సత్యం,జ్ఞానం,అనంతం అనేవి భగవంతుని నుంచి విడదీసి చూడలేని గుణాలు.అవి ఆయన విగ్రహ గుణాలు.తటస్థ గుణాలు వేరుగా ఉంటాయి అని చెప్పాడు.
అలాగే ఒకనాడు శ్రీమద్రామానుజాచార్యుల గురువుగారు ఆయనికి తిరుమంత్రం ఉపదేశించారు . ఆ ఆమన్తరం అత్యంత రహస్యమని కూడా ముందే హెచ్చరించారు . కానీ ఆ రామానుజ యతి గురువాజ్ఞని లెక్కచేయకుండా తిరునారాయణపుర గోపురమెక్కి , కులమత విచక్షణ లేకుండా సమస్త జనానికి తిరుమంత్రోపదేశం చేశారు . గురువుగారు ప్రశ్నిస్తే, ‘ స్వామీ నేనొక్కడినే నరకానికి పోతేమాత్రమేమి ? ఇంతమంది మహాజనానికి మోక్షం లభిస్తుంది కదా ! “ అంటారు మహా సంస్కర్త రామానుజాచార్యులవారు .
గురు ధిక్కారాన్ని సహించలేని యాదవ ప్రకాశుడు ఇతనిని చంపించాలని చూస్తాడు.తల్లి సలహా మేరకు యామునా చార్యుని,తిరు కచ్చికాచార్యుని,నంబిని ఆశ్రయిస్తాడు.ఆయన వద్దనే శ్రీ వైష్ణవాన్ని స్వీకరిస్తాడు.
భక్తి,ప్రపత్తి,శరణాగతి-వైష్ణవంలో అంగీకరించిన మోక్ష మార్గాలు.వీటినే సామాన్య జనం ఆదరించి మోక్షాన్ని పొందుతారు.