సంతు మీరాబాయి
మధుర భక్తితో కృష్ణుని చేరిన మరో గోదామాత , సంతు మీరాబాయి .
-సేకరణ : లక్ష్మి రమణ
మీరాబాయి రాజపుత్ర యువరాణి . వాయువ్య భారతదేశపు రాజస్థాన్లోని ప్రస్తుతం నాగపూర్ జిల్లాలో ఉన్న మెర్టా దగ్గరి చిన్న పల్లెటూరు కుడ్కీ (కుర్కీ) లో జన్మించింది. ఆమె తండ్రి రతన్ సింగ్ రాథోడ్.
మీరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సాధువుని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన కృష్ణుడి విగ్రహాన్ని ఘాడంగా మోహించింది, దీనిని ఆమె జీవితాంతం ఆమె దగ్గరే ఉంచుకుంది. ఆమె తల్లి ఆమె ఆధ్యాత్మిక భావనలకు మద్ధతునిచ్చేది కానీ ఆమె త్వరగా చనిపోయారు.
మీరా వివాహం ఆమె చిన్న వయస్సులోనే చిత్తోడ్ రాణా సంగా పెద్ద కొడుకు భోజ్ రాజ్ యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది. కాని తనని తానూ శ్రీ కృష్ణుని భార్యగా భావించుకునే మీరాకు ఈ వివాహం సంతోషం కలిగించలేదు. ఆమె కృష్ణుణ్ణి మాత్రమే నిజంగా పెళ్ళి చేసుకున్నానన్న భావనలో ఉండేది. ఆమె తననితాను కృష్ణుడి ప్రేమలో పిచ్చిదైన ‘గోపిక లలిత’ పునర్జన్మగా భావించేది.
మిరాబాయికి ప్రాపంచిక సుఖాలమీద విరక్తి కలిగింది. శ్రీకృష్ణునిపై విశ్వాసం, భక్తి స్థిరపడిపోయింది. తరచు దివ్యోన్మాదంతో తన్మయం పొందుతూండేది. దేవాలయంలో శ్రీకృష్ణుని దివ్య విగ్రహహం ముందు కూర్చుని కూర్చి పాడుతూండేది. ఈమెపాడే పాటలకు ముగ్ధులై అనేక మంది భక్తులు చేరేవారు. ఏమే పారమార్థిక జీవితం ఉపద్రవకరంగా ఉందని రాజవంశీయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోడానికి ఈమెను హత్యచేయడానికి ప్రయత్నించారు.
ఒక బుట్టలో పామును పెట్టి, పూవులదండ అని చెప్పారు . ఆమె ఆ కృష్ణపూలమాలని (పామును) పూలమాలగా కంఠంలో ధరించింది. మరొకసారి ఒక చిన్న బంగారుగిన్నెలో విషం కలిపిన పాలు ఇచ్చారు. నిర్భయంగా ఆ పాలను త్రాగింది. సజీవమై నిలిచింది .
ఒకానొక సమయంలో, మీరా కృష్ణాయిజానికి కేంద్రమైన బృందావనానికి వెళ్ళిపోయింది. ఇందులో ఒకచోట ఆమె ఆ సమయంలో బృందావనంలో గురు సాధువు చైతన్య ప్రత్యక్ష అనుయాయి రూపా గోస్వామితో ఆధ్యాత్మిక విషయాలను గురించిన చర్చ జరపాలన్న కోరిక వెలిబుచ్చింది, ఘోటక బ్రహ్మచారి అయిన ఆయన ఒక స్త్రీని కలవడానికి నిరాకరించారు. దీనికి మీరా ఈ విశ్వంలో నిజమైన పురుషుడు కేవలం కృష్ణుడు మాత్రమే అని బదులిచ్చింది. ఆమె తన తీర్థయాత్రను కొనసాగిస్తూ “ఒక గ్రామంనుంచి ఇంకొక గ్రామానికి నాట్యం చేస్తూ వెళుతూ దాదాపు మొత్తం ఉత్తర భారతాన్నంతా చుట్టింది”. ఆమె తన జీవిత చరమాంకాన్ని భక్తురాలిగా గుజరాత్ లోని ద్వారకలో గడిపింది.
కృష్ణుడితో కలయికకై ఆమె పడే తపన ఆమె కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె “నీలపు రంగు కావాలని” (కృష్ణుడి రంగు) కోరుకొనేది. ద్వారకలో మీరా శ్రీకృష్ణ విగ్రహం ముందు నిలిచి వెళ్ళడానికి అనుజ్ఞ ఇమ్మని వేడుకుంది. నాట్యంచేసి శ్రీకృష్ణునిపై రచించిన భక్తి పాటలు పాడింది. శ్రీకృష్ణ విగ్రహం పాదాలపై బడి పాదాలను కళ్ళకు అద్దుకుంది. చూస్తూండగానే శ్రీ కృష్ణ విగ్రహంతో ఐక్యమైపోయింది.
జై శ్రీ కృష్ణ !!