Online Puja Services

కోరిన కోరికలు తీర్చే రేణుక ఈ జమ్ములమ్మ !

3.133.109.58

కోరిన కోరికలు తీర్చే రేణుక ఈ జమ్ములమ్మ !
-లక్ష్మీ రమణ 

రేణుకామాత  అమితమైన తేజస్సుతో విరాజిల్లే జమదగ్ని మహర్షి భార్య. పరశురాముని తల్లి . ఆమె దేవాలయం ఒకటి మహారాష్ట్రలోని , పూణే దగ్గర ఉంటుంది. సాధారంగా నాసిక్ , షిరిడీ వెళ్లేవారు , ఆ రేణుకామాత దేవాలయాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు . ఆదేవి అనుగ్రహం వలన ఆకర్షణ కలుగుతుంది. అటువంటి అమ్మవారు తెలుగు పారంతంలో మనకి అత్యంత సమీపంలోనే విడిది చేసి ఉన్నారు . ఆ ఆలయ విశేషాలు ఇక్కడ ఏమీకొసం . 

స్థల ఐతిహ్యం :
ఒకరైతు పొలం దున్నుతున్నాడు . నాగలి లోతుగా దిగేందుకు దానిపైన ఉంచాల్సిన బరువు కోసం వెతికాడు . అక్కడ ఒక గొప్ప రాయి కనిపించింది . దాన్ని తెచ్చి నాగాలిపైనా బరువుగా ఉంచుకొని పోలందున్నాడు. ఆరోజుకి దున్నడం పూర్తయ్యింది. రేపటికి ఇంకా పని మిగిలుంది. కాబట్టి ఆ రాయిని అందుబాటులో ఉంచుకొని ఇంటికి వెళ్ళాడు . తిరిగి మరునాటి ఉదయం నాగలి కట్టి పని ప్రారంభించాడు. ఆ రాయి కనిపించలేదు . ఎక్కడుందా అని వెతికితే, నిన్న తానూ ఎక్కడ నుండీ తీశాడో అక్కడే కనిపించింది . అక్కడికి ఎలా వెళ్లిందా అని ఆశ్చర్యపోయిన, మల్లి ఆరాయిని తెచ్చుకొని పని మొదలు పెట్టాడు .  అలా సాయంకాలందాకా నడిచింది. తిరిగి ఆ రాయిని గుర్తుగా పెట్టుకున్నాడు. కానీ మర్నాటికి మల్లి ఆ రాయి దాని యథాస్థానాన్నే చేరుకొని కనిపించింది . రైతుకి చిర్రెత్తుకొచ్చింది . ఆ రాత్రంతా మేలుకొని ఉంది ఆ రాయిని ఎవరు తీస్తున్నారో కనిపెట్టాలని రహస్యంగా ఒక చెట్టు వెనక నక్కి చూడసాగాడు . ఆ రాయి చీకట్లు ముసరాగానే, చక్కని యువతిగా మారి యథాస్థానానికి చేరుకొని, తిరిగి రాయిగా మారిపోయింది . ఆ రైతు ఆశ్చయపోయాడు . గ్రామస్థులకు ఈ విషయాన్ని చెప్పి, వారందరికీ కూడా ఆదృశ్యాన్ని చూపించాడు . 

ఆలయం :
అప్పుడు ఊరివారు అందరూ కలిసి అమ్మవారికి చిన్న గుడి నిర్మించారు. పొలములో విత్తనములు విత్తు సమయములో అమ్మవారిని పూజించి విత్తనములు విత్తున వారికి ఆ దేవత అనుగ్రహం వలన  దిగుబడి విస్తారముగా వచ్చింది . 

ఇలా అమ్మవారు జమ్మిచేడు గ్రామ శివార్లలో స్వయంభువుగా వెలిశారు కాబట్టి ఆవిడని జమ్ములమ్మ అనే పేరుతొ పూజించసాగారు. ఇది చాలా పురాతనమైన గాధ. ఈ జమ్ములమ్మరూపంలో ఉన్న రేణుకామాతని పాండవులు కూడా అర్చించారని స్థానికుల విశ్వాసం.  కాకతీయుల హయాములో రాణి రుద్రమదేవి ఈ ఆలయాన్ని సందర్శించినట్టు ఆనవాళ్లున్నాయి .  

మహత్యం :
జమ్ములమ్మ దేవస్థానం చుట్టూ రిజర్వాయర్ ఉంటుంది .  1983 వ సంవత్సరములో ఈ ఆలయం  నీటి ముంపునకు గురి అయ్యింది . ఆ సమయములో అమ్మవారిని వేరే సురక్షిత ప్రాంతమునకు తరలించి గుడి నిర్మాణముచేయాలని ప్రయత్నం చేశారు .  అమ్మవారి మూల విగ్రహమును తరలించేనిమిత్తం పెకిలించడానికి ప్రయత్నిస్తే,  ఎంతలోతు త్రవ్వినా,  విగ్రహము అడుగు భాగము కనిపించలేదు. పైగా ఆ త్రవ్విన వ్యక్తి చూపుని కోల్పోయాడు . అప్పుడు తెలిసిన వారు అమ్మవారి మూల విగ్రహము అక్కడి నుండి తొలగించడం ఎవరితరము కాదని, అమ్మవారిని మొక్కుకొని మీ ప్రయత్నములు మానివేయమని సలహా ఇచ్చారు . ఆ విధంగా ఆ పనివాళ్ళు మొక్కుకోవడంతో అతని కళ్ళు తిగివచ్చాయట . 

అందువల్ల అమ్మవారి దేవస్థానములోనికి రిజర్వాయర్ నీరు రాకుండా కట్ట నిర్మించినారు. ప్రతి సంవత్సరము మాఘ శుద్ధ పౌర్ణమి ముందు మంగళవారము రోజున శ్రీ అమ్మవారిని సాంప్రదాయ పద్దతిలో అమ్మవారి పుట్టినిల్లు అయిన గుర్రంగడ్డ గ్రామము నుండి దేవస్థానమునకు ఊరేగింపుగా తీసుకొని వస్తారు . ఆలయంలో రేణుకామాత పుత్రుడైన పరశురాముని ఆలయం కూడా ఉన్నది. 

ఇలా చేరుకోవచ్చు :
గద్వాల వరకూ రైలులో ప్రయాణించి, అక్కడినుండి, ఆటో, లేదా బస్సు ద్వారా 4కిలోమీటర్ల  ప్రయాణించి జమ్మిచేడు లోనెలకొని ఉన్న ఈ  జమ్ములమ్మ ఆలయానికి చేరుకోవచ్చు . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore