Online Puja Services

సమస్యకి సమాధానం అమ్మవారు, స్వయంగా చెబుతారు ఇక్కడ

3.139.87.113

మీ సమస్యకి సమాధానం ఆ అమ్మవారు, స్వయంగా చెబుతారు ఇక్కడ ! 
-లక్ష్మీ రమణ 

పూర్వకాలంలో భక్తులు మాట్లాడాలనుకుంటే, దేవుడే స్వయంగా దిగివచ్చి, మనం ఏ మిత్రునితోటో మాట్లాడుతున్నట్టు మాలాడేవారట . అటువంటి అవకాశం ఇక ఈలోకంలో లేనట్టేనా ? ఈ కలికాలంలో అంతులేని సమస్యలతో బాధపడే జనానికి కనీసం వారి ప్రశాలకైనా, అమ్మలాంటి , ఆ అమ్మలాగన్నమ్మ,  ఆ దేవదేవి అయినా సమాధానం చెప్పొచ్చుకదా ? అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో సమాధానం . ఆ మహేశ్వరి సమాధానం చెప్పే క్షేత్రం ఈ భువి మీద ఉన్నది . ఆ దివ్యక్షేత్రం విశేషాలు తెలుసుకోండిమరీ !

దేవుడు ఉన్నడా ? ఉంటె నీతో మాట్లాడాడా ? అనే, ఈసారి ఆ మాట్లాడాడు. నీతోకూడా మాట్లాడించనా అని అడగండి ధైర్యంగా ! మరేం ఫర్వాలేదు . ఆ చౌడేశ్వరీ దేవి మనకి తోడుగా ఉంది. అడిగిన ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం స్వయంగా ఇస్తుంది. కానీ ఒక్కటే సమస్య. మీకే భాషొచ్చినా సమస్యలేదు. ఆ దేవికి అర్థమవుతుంది. కానీ ఆ దేవి మాత్రం కన్నడంలోనే జవాబు చెబుతుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అవసరమైతే దుబాసీని (ట్రన్స్లెటర్) ని వెంట పెట్టుకొని వెళ్ళండి. 

 కర్ణాటక రాష్ట్రంలో, తుమకూరు జిల్లాలోని  తిపటూరులో స్వయంభువైన మహిమాన్విత పరాశక్తి వుంది. ఆమె దాసరిఘట్టలోని చౌడేశ్వరీదేవి. బెంగుళూరు నుంచి తుమకూరు సుమారు 72కి.మీ దూరం అదేవిధంగా తుమకూరు నుంచి తిపటూరుకి 74 కి.మీ ల దూరంలో దాసరిఘట్ట వుంది. ఇక్కడికి వచ్చినవారి సమస్యలకు స్వయంగా సమాధానం ఇవ్వడం ద్వారా పరిష్కారాన్ని చూపే దేవత ఈ చౌడేశ్వరీ మాత . 

దేశవిదేశాల నుండి అనేకమంది భక్తులు ఈ దేవీ దర్శనానికి తమ సమస్యలకు సమాధానాల కోసం వస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన టికెట్ కూడా తీసుకోవాలి . ఆ తర్వాత చౌడేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని బియ్యం పిండి మీద వుంచుతారు. దేవీ విగ్రహం మీద ఒక కలశాన్ని వుంచుతారు.

 అమ్మకి ప్రశ్నని చెప్పి, ఆమె సమాధానం కోసం సిద్ధం చేసిన కలశాన్ని కదిలించి తిప్పుతారు. వెంటనే అక్షరరూపంలో వచ్చిన సమాధానాన్ని పూజారులు తెలుపుతారు ఈ విధంగా వేల కొలది భక్తులు సమాధానాలు తెలుసుకున్నారు. వారికి సరియైన సమాధానాలు కూడా దొరికాయట . ఈ తల్లి చెప్పే భవిష్యత్తు ఎప్పుడూ తప్పు కాదు అనేది ఇక్కడి వారి నమ్మకం.

ఈ దేవి ఇక్కడ వెలసిన విధానం కూడా ఆశ్చర్యకరమైన కథతో కూడుకొని ఉన్నదే !  వందల సంవత్సరాలకు ముందు కర్ణాటక రాయచూరు జిల్లాలో, తుంగా నదీ సమీపంలో నందవరం అనే సామ్రాజ్యం వుండేది. ఈ ప్రదేశాన్ని పరిపాలించే రాజు గారికి అనేక మంత్రం శక్తులు ఉండేవి. ఆయన మహా శివ భక్తుడు . తన అపూర్వమైన శక్తి వల్ల ప్రతి నిత్యం ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచి, కాశీకి వెళ్లి ,గంగా స్నానం చేసి సాయంకాలం సమయంలో మళ్ళీ సాయంత్రం తన సామ్రాజ్యానికి తిరిగివచ్చేవారట. 

ఆ రాజుగారు అలా నిత్యం ఎక్కడికి వెళ్లొస్తున్నారా అని రాణిగారికి అనుమానం. దైవదర్శనానికా ? ఎవరైనా దేవి దర్శనానికా అని ఆమె సందేహాలు ఆమెవి . దాంతో ఆయనకీ నిజం చెప్పక తప్పింది కాదు. 
 
నిజం తెలుసుకొని భర్తతో పాటు తానుకూడా ఆవిధంగా ఒక్కరోజులోనే కాశీ దర్శనం చేసుకోవాలని ఆమె కూడా కోరుకుంది. రాజు సరే నన్నారు . తనతో తీసుకెళ్లారు కానీ ఆమెకి స్త్రీలకి సహజమైన రుతుక్రమం అదే సమయంలోనే వచ్చింది. ఆ దోషం వలన రాజు తన శక్తులని కోల్పోయాడు. అక్కడే ఉన్న బ్రాహ్మణులని , తన రథాలని ఇస్తానని తన దోషాన్ని తొలగించమని వేడుకున్నాడు. వారు ఆ రాజుకి దోషం తొలగిపోయేలా చేయాల్సిన విధులన్నీ నిర్వర్తించారు. దోషం తొలగిపోయాక, ఆ పండితులని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ, తానూ ఇస్తానన్న దానాన్ని దాటేసే ప్రయత్నం చేస్తాడు రాజు. అప్పుడా పండితోత్తములు, రాజన్న మాటలకి ఆ చౌడేశ్వరీదేవె సాక్ష్యమని , తాము నిజం చెబితే, ఆమె స్వయంగా సాక్ష్యం చెప్పాలనీ అంటారు. 

ఆ మాటకి కట్టుపడ్డ చౌడేశ్వరీ మాత , ఇప్పుడున్న ప్రాంతంలో వచ్చినిలచిందనీ ఆ బ్రాహ్మణులకి సాంఖ్యంగా నిలవడమే కాకుండా, తనని నమ్మిన భక్తులకి సమస్యలకి స్వయంగా సాధానమిస్తూ అనుగ్రహిస్తున్నదనీ స్థల ఐతిహ్యం . 

ఇదీ స్వయంగా సమాధానం ఇచ్చే చౌడేశ్వరీ మాత కథ. కర్ణాటక వెళితే, తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించి రండి . శుభం . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore