శకుని ఏమయ్యాడు? ఆలయంలో స్థాణువై నిలబడిపోయాడా ?
శకుని ఏమయ్యాడు? ఆలయంలో స్థాణువై నిలబడిపోయాడా ?
లక్ష్మీ రమణ
మహా భారతాన్ని చూస్తే, కురుక్షేత్ర సంగ్రామానికి కారణమైన వారిలో కౌరవులందరూ పాండవుల చేతిలో అంతమయ్యారు. ఆ తర్వాత, పాండవులు రాజ్యపాలన చేసి, స్వర్గావరోహణ చేశారు . కృష్ణుడు అవతారాన్ని చాలించాడు . కానీ అసలు మాయా పాచికలు సృష్టించి, వాటితోటి అన్నదమ్ములమధ్య చిచ్చుపెట్టి, కురుక్షేత్ర సంగ్రామానికి కారకుడైన శకుని ఏమయ్యాడు ? అటువంటి శకునికి కేరళలో ఆలయం కట్టి అర్చిస్తున్నారంటే , నమ్మగలమా ?
మహాభారతంలో అత్యంత రాజకీయమైన, నాటకీయ పాత్ర ‘శకుని’. గాంధార రాజ్యాన్ని జయయించి గాంధార వంశాన్నే మట్టుబెట్టాలన్న యోచనకి, కార్యాచరణకు పాగా తీర్చుకోవాలనుకుంటాడు బుద్ధి కుశలుడైన శకుని. దానికి అనుగుణంగానే , మేనల్లుడైన దుర్యోధనుని మచ్చిక చేసుకొని, చక్కని కుతంత్రాన్ని నేర్పుగా నడిపిస్తాడు. కౌరవ వంశమే లేకుండా కురుక్షేత్ర సంగ్రామానికి తెరతీసి , వారందరినీ మట్టు బెడతాడు . ఇలా బయటకు దుష్ట బుద్ధి కనిపించినా, ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయని, ఆయన తమకి ఆరాధ్యుడని విశ్వశిస్తారు కేరళీయులు.
కేరళలోని కొల్లమ్ జిల్లాలో మాయమ్ కొట్టు మల్చేరు మలందా ఆలయంలో గాంధార యువరాజు శకుని పూజలందుకుంటున్నాడు. ఆ ఆలయంలోని సింహాసనాన్ని శకుని ఉపయోగించినదిగా భావించి పూజిస్తుంటారు. అయితే ఇక్కడ ఎలాంటి సంప్రదాయ లేదా తాంత్రిక పూజలను నిర్వహించరు. కేవలం కొబ్బరికాయ, సిల్క్, టోడీ అనే ద్రావణం (విస్కీ, పంచదార, నీళ్లు) అర్పిస్తారు.
మహాభారత యుద్ధ సమయంలో తన మేనల్లుళ్లు కౌరవులతో కలిసి శకుని దేశమంతా పర్యటిస్తాడు. అయితే కొల్లం చేరుకునేసరికి కౌరవులు ఆయుధాల విభజన జరుగుతుంది.
అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని పకుతేశ్వరమ్‌గా పిలుస్తున్నారు. తర్వాతి కాలంలో ఇది పవిత్రేశ్వరంగా మారింది.
ఈ ఆలయంలో ఇంకా భువనేశ్వరీ దేవి, కిరాత మూర్తి, నాగరాజు విగ్రహాలు కూడా ఉన్నాయి. మళయాల క్యాలెండర్ ప్రకారం మకర నెల (జనవరి- ఫిబ్రవరి)లో వినోదం కూడిన మలక్కుడ మహోలస్వామ్ అనే పండుగను నిర్వహిస్తారు.
తెలుగువారికి విచిత్రంగా అనిపించినా కేరళీయులకి శకునికి, దుర్యోధనుడికి గుడులు కట్టి ఆరాధించడం అలవాటే ! వాళ్లకి మనకన్నా కాస్త పాజిటివిటీ ఎక్కువేమో అనిపించడం తప్పులేదేమో ! అయినా ఎవరి నమ్మకాలు వాళ్ళవి !! అంతేగా !