Online Puja Services

ఇక్కడికొస్తామని వెళ్లకపోతే మహాపాతకమే !

18.116.49.243

కాశీ వస్తామని వెళ్లకపోయినా ఫర్వాలేదు . కానీ ఇక్కడికొస్తామని వెళ్లకపోతే మహాపాతకమే ! 
సేకరణ 

ఉత్తరాన కాశీ వెళ్తామని వెళ్ళకపోయినా ఫరవాలేదట. కాని ఇక్కడికి వెళదామని వెళ్లకపోతే మాత్రం మహపాతకమట. మీ మనస్సులోకి వెళ్దామనే సంకల్పం రాగానే,  మన పితృదేవతలు మన రాకకోసం స్వర్గంలో నిరీక్షిస్తారట.  క్షేత్రానికి కాహీ క్షేత్రానికి విడదీయరాని అనుబంధం ఉంది . ఆ బంధాన్ని వేసింది కూడా గంగమ్మే ! కాబట్టి ఈ క్షేత్ర విశేషాలని వివరంగా తెలుసుకునే ప్రయత్నాం చేద్దాం .  

దేశంలోని చతుర్ధామాల్లోని మొదటి ధామంగా భావించబడుతుంది రామేశ్వరం. ఈనాలుగు ధామములతో దేశం నలుమూలలూ చుట్టివేసినట్లే. వీటిలో మొదటిది రామేశ్వరం, రెండవది ద్వారక, మూడవది పూరి జగన్నాధ్, 4వది-బదరీనాధ్ ధామం. ఈనాలుగు ధామములతో దేశం నలుమూలలూ చుట్టివేసినట్లే. 

 అయితే, మొదటగా యాత్రికులు  కాశీ వెళ్ళి గంగాజలం తెచ్చి రామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వరుని అర్పించితేగాని జన్మసాఫల్యం కాదని చెప్తారు పెద్దలు.  రామేశ్వర క్షేత్రంలో చూడదగినవి - చూడవలసినవి ఎన్నో ఉన్నాయి . ఇక్కడి ప్రధాన ఆలయం రామేశ్వరాలయంలో  దైవం  శ్రీరామనాధస్వామి లేదా రామలింగేశ్వర స్వామి. అమ్మవారు పర్వతవర్దనిదేవి. ఇక్కడ కోదండ రామస్వామి ఆలయం, గంధమాదన పర్వతం కూడా చూడదగిన ప్రదేశాలు .

రామేశ్వర దేవాలయం:
ఆలయ నిర్మాణం దాదాపు క్రీ.శ. 12వ శతాబ్దంలో మొదలయి తరువాత అనేక రాజవంశాలు అనేక రీతుల అభివృద్ధి పరచినట్లుగా తెలుస్తుంది.  పురాణకథగా రామాయణ కధాకాలంలో కధప్రకారం సీతమ్మవారిని లంకేశుడు చెరబట్టి తీసికొని వెళ్ళిన తరువాత, అమ్మవారి జాడ కనుగొని లంకాధిపతి రావణుని సంహరించివేశాడు శ్రీరాముల వారు. కానీ రావణుడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుని చంపిన పాపముగా  బ్రహ్మ హత్యాదోషము అంటింది శ్రీరాములవారికి. అప్పుడు శివలింగ ప్రతిష్ఠ చేయవలసిందిగా పెద్దలుసలహా యిచ్చారు.  వెంటనే ప్రియభక్తుడైన వాయుపుత్రుడు హనుమంతుని హిమాలయాల్లోని కైలాసగిరి యందున్న శివలింగమును తెమ్మని పంపారు. వాయువేగ, మనోవేగాల్తో వెళ్ళాడు హనుమ. ముహుర్తం దగ్గర పడుతోంది. హనుమ జాడలేదు. అప్పుడు సీతమ్మవారు తన స్వహస్తాలతో సైకత లింగమును అక్కడిక్కడే తయారు చేసింది. సీతారాములు శివలింగ ప్రతిష్ఠ జరిపారు. అంతలోనే హనుమ కైలాసగిరి నుండి వచ్చాడు శివలింగముతో. హనుమంతుని చిన్న బుచ్చకుండా అదిగూడా ప్రతిష్టించారు సీతారాములు. 

 మొదట హనుమతెచ్చిన లింగము పూజించబడింది. శ్రీరాముల వారిచేత ప్రతిష్టించబడినది. అదే  శ్రీరామ లింగేశ్వర స్వామి .  శ్రీరామ భక్త హనుమాన్ తెచ్చినది శ్రీ కాశీవిశ్వేశ్వర లింగం.

ఈ శివక్షేత్రంలో ఆలయం కట్టుబడిలోను, శిల్పకళలోను ద్రావిడ శిల్ప రీతులకి మణిపూసయై నిలిచింది. ముచ్చటగా మూడు ప్రాకారాలున్నాయి. మొదటి ప్రాకారంలో గర్భాలయం ఉంటుంది . ఇక్కడ  శ్రీరామ ప్రతిష్ఠిత లింగానికి  ప్రతిరోజూ గంగాజలాభిషేకం వైభవంగా  జరుగుతుంది. ప్రక్కనే కాశీవిశ్వనాధ లింగము ఉంటుంది . ఈ ప్రాకారంలో కోటితీర్ధము, సర్వతీర్ధము ఉన్నాయి.

రెండవ ప్రాకారంలో అమ్మవారి దేవాలయం ఉంది. నూతనంగా అనేక విధముల అభివృద్ధి పరచబడింది. ఆలయ గోపురం, గొప్ప నందీశ్వరుని విగ్రహాలు సున్నంతో నిర్మించి రంగులు వేయబడినప్పటికీ, జీవకళతో ఉట్టిపడుతూ ఉంటాయి . 

3వ ప్రాకారం ఒక మహల్ మాదిరిగా నిర్మించబడింది. ప్రాకారంలోని మంటపము మనకి ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది . 4000 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుగలిగి ఈ చివరినుండి ఆ చివరివరకు కనబడుతూ ఉంటుంది .  గాలిబాగా వచ్చేలా  వెంటిలేషన్ ఏర్పాటుతో మండప స్థంభాలన్నీ చిత్రవిచిత్రాలైన శిల్పాలతో కూడి ఉంటుంది . ప్రపంచం మొత్తం మీద ఇంతటి వైభంతో , గొప్ప శిల్పకళతో అలరారే నిర్మాణం ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదేమో ! 

 చక్కటి శిల్పవైభవంతో అలరారే ముచ్చటైన  ప్రాకారంలో రామలింగ విగ్రహములు, శ్రీ కోదండ రామస్వామి, నటరాజ మందిరం, సేతుమాధవ స్వామి ఆలయం, కోనేరు, ఇతర తీర్దాలు ప్రాకారంలోని విశేషాలు తూర్పువైపున సముద్రం, పడమటి వైపున గోపురాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ విశిష్టత అంతా గోపురాల్లోను, ఈ ప్రాకారంలో మండపంలోను నిక్షిప్తమైఉంది. సేతు యాత్రాక్రమం ఆనంద రామాయణంలో ఉన్నది. ఇది చదువుకొని అనుసరించదగినది.

దేవాలయంలో మొత్తం 22 తీర్ధాలు, ఇతరత్రా 21 తీర్ధములు ఉన్నాయి. తీర్దాల్లో స్నానం చేయువారు ముందుగా పురోహితునితో మాట్లాడుకొని యాత్రని  సాగించాలీ . ఓషధుల కలయిక ఉందని నమ్మకం ఉండటంచేత శరీర రుగ్మతలతోబాటు, ఆత్మ ప్రక్షాళనం జరుగుతుందని ప్రతీతి.

ధనుష్కోటి:
1964లో వచ్చిన తుఫానులో మిగిలింది కోదండరామస్వామి ఆలయం మాత్రమేనట. ఇది ఒక ద్వీపం. ఇక్కడే రావణుని తమ్ముడు విభీషణుడు శరణుజొచ్చినచోటు. యుద్ధానంతరం వానరులు నిర్మించిన సేతువును పగుల గొట్టారట ఇక్కడ. శ్రీరాములవారు బాణముతో కొట్టగా వంతెన విచ్చిపోయి రత్నాకరము, మహొదధి, రెండున్నూ కలిసిపోయాయట. ధనుస్సుచే పగులగొట్టటంచేత ధనుష్కోటి అనే పేరు సార్ధకమయిందంటారు. ఇక్కడ 108గాని, 36గాని సముద్రస్నానాలు చేయాలని అంటారు భరద్వాజ మహర్షి నిర్ణయానుసారంగా చాంద్రాయణ వ్రతఫలం గలుగుతుందని నమ్మిక.

రెండు సముద్రాలు కలిసేచోట యిసుకను తీసికొని రామేశ్వరంలో 3భాగాలు చేసి పూజించాలట. 2 భాగాలు దానంచేసి 3వభాగం జాగ్రత్తగా పదిలంగా పట్టుకువెళ్ళి ప్రయాగలో త్రివేణి సంగమంలో సమర్పించాలట. ఇక్కడ చేసిన దానం కోటి రెట్లధిక ఫలమట. కాబట్టి రామేశ్వరాన్ని దర్శించిరండి మరి ! 

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda