రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి ?
రుద్రాభిషేకం ఎన్నిసార్లు చేయాలి ?
కూర్పు లక్ష్మీ రమణ
రుత్ అంటే - దుఃఖం ద్రానయతి అని అర్థం . దుఃఖాన్ని నాశనం చేయువాడు రుద్రుడు . వశా అనే ధాతువు నుండీ పుట్టిన శబ్దం శివ ! వశతి అంటే, ప్రకాశిస్తున్నవాడు అనిఅర్థం . ప్రకాశం అంటే, చీకటిని అంతం చేసేది . చీకటి అజ్ఞానానికి రూపమైతే, వెలుగు దాని నిరోధకం అంటే, జ్ఞానం . జ్ఞానం అంటే, మంలో ఉన్న ఆత్మే ! మొత్తంగా మనలోని పరమాత్మ ప్రకాశమే రుద్రుడు .
కార్తీక మాసంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఆ పరమేశ్వరునికి విరివిగా చేస్తుంటారు . అయితే, ఈ రుద్రాభిషేకం చేసేందుకు ఒక లెక్కుంది . ఏకాదశ రుద్రాభిషేకం అనేది మనం సాధారణంగా వినేమాటే . కానీ వీటిలో రుద్రం, మహారుద్రం, లఘు రుద్రం, అతి రుద్రంలోతేడాలు ఉన్నాయి. యజుర్వేదంలో మంత్రభాగమైన 11 అనువాకాల'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లుకూడా ఉన్నాయి.
ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లుచెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి'అంటారు. రుద్రం అంటే - నమకం + చమకాలు . వీటిని కలుపుతూ చేసేదే రుద్రాభిషేకం . పదకొండుసార్లు నమకం చేస్తే , ఒక్కసారి చమకం చెప్పాలి. ఈ లెక్కనే , చేసే విధానాన్ని బట్టి, సంఖ్యని బట్టి ఆవృత్తి , రుద్రమని , ఏకాదశ రుద్రమని , శత రుద్రమని, లఘు రుద్రమని , మహా రుద్రమని, అతిరుద్రమని పిలుస్తారు .
వీటిల్లో ఆవృత్తి – నమకం 121 సార్లు, చమకం 11 సార్లు చెప్పితే ఆవృత్తి అంటారు.
2. రుద్రం- నమకం 121 సార్లు, చమకం – 11 సార్లు
3. ఏకాదశ రుద్రం- నమకం 14,641 సార్లు, చమకం-1331 సార్లు
4. శతరుద్రం- నమకం 1,61,051 సార్లు,చమకం 14,641 సార్లు
5. లఘురుద్రం- నమకం 17,71,561 సార్లు, చమకం- 1,61,051 సార్లు
6. మహారుద్రం- నమకం 1,94,87,171 సార్లు, చమకం- 17,71,561 సార్లు
7. అతిరుద్రం- నమకం 21,43,58,881 సార్లు, చమకం -1,94,87,171 సార్లు
ఈ రుద్ర మంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం', హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితోగ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్నసమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు పరమాత్మ లోనికి ఐక్యం చెందుతాడు.