శ్రీ రామ దూతం శిరసా నమామి
మకుట రత్న కాంతి మధిత తమిశ్రం -శ్రీ రామ దూతం శిరసా నమామి –
అరుణోదయ రుచిరానన కమలం —శ్రీ రామ దూతం శిరసా నమామి
స్వర్ణ పింగల భాస్వర నేత్ర యుగళం —శ్రీ రామ దూతం శిరసా నమామి
చలిత మకరకుండల గండ భాగం —శ్రీ రామ దూతం శిరసా నమామి
నవమని మయ రసనా మధ్య భాగం –శ్రీ రామ దూతం శిరసా నమామి
తరుణ రుచిరా శుభ తర వరహారం —-శ్రీ రామ దూతం శిరసా నమామి
సమలంకృత దివ్య స్వర్నోపవీతం –శ్రీ రామ దూతం శిరసా నమామి
కటి తట విలసిత కాంచన చేలం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మంజు మంజీర మహిత పదాబ్జం –శ్రీ రామ దూతం శిరసా నమామి
దినమని శత నిభ దివ్య ప్రకాశం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సకల సద్గుణ బృంద సార పయోదిం –శ్రీ రామ దూతం శిరసా నమామి
దాస ముఖామ్భోజ దశ శత భానుం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వాల్మీకి కృత కావ్య వర సరోహంసం –శ్రీ రామ దూతం శిరసా నమామి
శ్రిత జన కువలయ శీత మయూఖం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రామ లావన్యాభ్ర రాగ మయూరం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రామచంద్ర పద రాజీవ మధుపం —శ్రీ రామ దూతం శిరసా నమామి
త్రుణాయత దోస్తంభ గంభీరం —శ్రీ రామ దూతం శిరసా నమామి
సుగ్రీవ శ్రీ రామ సంధాన హేతుం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సుగ్రీవ వేదిక శ్రీ రామ వృత్తాంతం —శ్రీ రామ దూతం శిరసా నమామి
అగ్ని సాక్షీక్రుత అర్కజ రామం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సీతా భూషణ సమర్పిత రామం. -శ్రీ రామ దూతం శిరసా నమామి
శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం. –శ్రీ రామ దూతం శిరసా నమామి
వాలి వదోపాయ వర మృదు వాక్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వానర సేనా సమాహుత ధీరం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సకల దేశాగత శాఖా మ్రుగాలిం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రామచంద్ర దత్త రమణీయ భూషం –శ్రీ రామ దూతం శిరసా నమామి
స్వయం ప్రభా దత్త సుఫలాతి భోజ్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
లంకాగమనా సమలన్క్రుతదేహం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సాగరోల్లంఘన సంపూర్ణ కాయం –శ్రీ రామ దూతం శిరసా నమామి
అబ్ది మధ్య మిత్ర నగపతి పూజ్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సరస మాయాధ్వాంత సూర్యప్రకాశం –శ్రీ రామ దూతం శిరసా నమామి
చాయాగ్రహచ్చెద శమన స్వరూపం —శ్రీ రామ దూతం శిరసా నమామి
దివ్య వేగ గోష్పదీకృత జలదిం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సువేర శిఖరాగ్ర శ్రమితాభి గమనం –శ్రీ రామ దూతం శిరసా నమామి
లంకినీ భంజన లావణ్య హారం –శ్రీ రామ దూతం శిరసా నమామి
లంకా వరోధ నిశ్శన్కిత హృదయం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సీతాన్వేషణ సుర శత్రు సదనం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వాయు ప్రేరిత వర వన గమనం–శ్రీ రామ దూతం శిరసా నమామి
సీతా దర్శన చిన్తాప హరణం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రావణ దుర్వాక్య అక్షీన కోపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సీతా నివేదిత శ్రీ రామ కుశలం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రాఘవీయ కధా రంజిత రామం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రామాన్గులీయక రామ నివేద్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వసుదాత్మజా దత్త వరశిరోభూషణం —శ్రీ రామ దూతం శిరసా నమామి
అతిశయ బలదర్ప అశోక భంగం –శ్రీ రామ దూతం శిరసా నమామి
దనుజ నివహ వన దహన దావాగ్నిం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వజ్రాయుధ ఘోర వాల కరాళం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సప్త మంత్రి కృత శలభ క్రుశానుం –శ్రీ రామ దూతం శిరసా నమామి
జంబు మాలీ వధ చండ ప్రతాపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
అక్షకుమార సంహరణ ప్రవీణం –శ్రీ రామ దూతం శిరసా నమామి
బ్రహ్మాస్త్ర బంధిత బ్రహ్మ వర దానం –శ్రీ రామ దూతం శిరసా నమామి
చతుర్భాగ సైన్య చందిత రూపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వాయు ప్రేరిత వాలాగ్ని జ్వాలం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సీతా ప్రసాదిత శీతల వాలం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వర రాక్షస గృహ వహ్ని సందిగ్ధం— శ్రీ రామ దూతం శిరసా నమామి
కపి దృక్ చకోర సంగత చంద్ర బింబం –శ్రీ రామ దూతం శిరసా నమామి
తారా చందనాది తరుచర యుక్తం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మధు వన మధు పాన మత్త కపీన్ద్రం –శ్రీ రామ దూతం శిరసా నమామి
కౌశాలేయ కార్య కారణ సమర్ధం —శ్రీ రామ దూతం శిరసా నమామి
రామ నివేదిత రామ వృత్తాంతం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వర విభీషణ రక్ష వాక్య నైపుణ్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రామ సంవర్ధితా రాక్షస సంఖ్యం —శ్రీ రామ దూతం శిరసా నమామి
అబ్ది బంధన కార్య అమితోత్చాహం –శ్రీ రామ దూతం శిరసా నమామి
ప్రబల జలధి సేతు బంధన నిపుణం –శ్రీ రామ దూతం శిరసా నమామి
దూమ్రాక్షాకంపన త్రిశిర సంహారం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రామ నామాస్త్రేనా రాక్షస నాశం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రణ కర్కశ ఘోర రాజిత వేషం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రావణ ఘన యుద్ధ రామ తురంగం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మేఘనాధ శైన్య మృత్యు స్వరూపం —శ్రీ రామ దూతం శిరసా నమామి
రక్షేంద్ర జిద్యుద్ధ లక్ష్మణ తురంగం –శ్రీ రామ దూతం శిరసా నమామి
లక్ష్మణ మూర్చా సంరక్షణ హృదయం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సంజీవాద్రి గమన సంతోషం –శ్రీ రామ దూతం శిరసా నమామి
కాలనేమి కృత ఘన మాయా యుక్తం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మకర బందీక్రుత మహిత పదాబ్జం –శ్రీ రామ దూతం శిరసా నమామి
ధాన్య మాలినీ శాప దర్శిత రూపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
కాలనేమి దనుజ ఖండిత ధీరం —శ్రీ రామ దూతం శిరసా నమామి
దిక్రుతాద్ర్యదీశ తీవ్ర ప్రకోపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
గంధర్వ శైన్య సంక్షోభ ప్రతాపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
స్తబకీక్రుత ద్రుత సంజీవనాద్రిం –శ్రీ రామ దూతం శిరసా నమామి
భరత సంబోధిత ప్రశమిత బాణం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మాల్యవదాది మహోదధిహరణం —శ్రీ రామ దూతం శిరసా నమామి
లక్ష్మణ ప్రాణ సంరక్ష నిలయం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సౌమిత్రి సంమోహ జలద సమీరం –శ్రీ రామ దూతం శిరసా నమామి
అబ్ది మధ్య మధిత రాక్షస వారం –శ్రీ రామ దూతం శిరసా నమామి
స్థూల జన్ఘాసుర తుముల సంహరణం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సిన్దూల్లంఘన జలజ సమీరం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వాల ప్రాకార సంవేష్టిత ధీరం –శ్రీ రామ దూతం శిరసా నమామి
పాతాల లంకా ప్రవేశిత ధీరం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మత్య వల్లభ ధీర మహనీయ భీతం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మైత్రీక్రుత ధీర మత్యాధి పత్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
దొర్దందీక్రుత ధైర్య ప్రతాపం —శ్రీ రామ దూతం శిరసా నమామి
భిన్న తులాయంత్ర భేమ స్వరూపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
బాల రాక్షస కోటి భంజిత సత్వం –శ్రీ రామ దూతం శిరసా నమామి
శృతి వాక్య శ్రవణ సంతోషిత స్వాంతం —శ్రీ రామ దూతం శిరసా నమామి
మైరావణ కృత మర్మ సంవేద్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మైరావణ సైన్య మర్దిత సూరం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మహానీయాతి ఘోర మైరావనాజితం —శ్రీ రామ దూతం శిరసా నమామి
దోర్దండ వ్యాఘాతి ఖండిత దైత్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
నీలమేఘ కృత నిస్తుల రాజ్యం – శ్రీ రామ దూతం శిరసా నమామి
రామ లక్ష్మణ పూర్వ లంకాభి గమనం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సకల వానర స్తుతి సంతోష హృదయం –శ్రీ రామ దూతం శిరసా నమామి
ప్రబల మూల బల ప్రళయ కాలాగ్నిం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రామ రావణ యుద్ధ రామ తురంగం –శ్రీ రామ దూతం శిరసా నమామి
దశ కంఠ కంఠ విలుమ్తన దీక్షం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రాక్షసానుజ దత్త లంకాభి షేకం –శ్రీ రామ దూతం శిరసా నమామి
పుష్పకాది రూఢప్రుద్వీశ సహితం –శ్రీ రామ దూతం శిరసా నమామి
సాకేత పుర వాస సాల సంయుక్తం –శ్రీ రామ దూతం శిరసా నమామి
భక్త పాప తిమిర భాస్కర రూపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
శత కన్త్త వదోపాయ చాతుర్య యుక్తం –శ్రీ రామ దూతం శిరసా నమామి
ఏకైక రాక్షస ఏకైక రూపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
శత కన్స్ట చ్చేదక సీతా ప్రబోధం –శ్రీ రామ దూతం శిరసా నమామి
అవనిజాదిప యుక్త రాజ్య ప్రవేశం –శ్రీ రామ దూతం శిరసా నమామి
ఆశ్వ మేధ యాగ అమితోత్చాహం –శ్రీ రామ దూతం శిరసా నమామి
దశ శత శిరచ్చేద దీక్షా ప్రతాపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
దశ శత శిరోధార్య భాష్యాతి రిక్తం –శ్రీ రామ దూతం శిరసా నమామి
రాక్షస సైన్య జిత భయద స్వరూపం —శ్రీ రామ దూతం శిరసా నమామి
దశ శత శిరచ్చేద దాశరధ సూనుం -శ్రీ రామ దూతం శిరసా నమామి
సకల సైన్యావ్రుత సాకేత వాసం –శ్రీ రామ దూతం శిరసా నమామి
బోధిత కపివర్య పూర్ణ స్వరూపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
ఝాన్కారోచ్చాటిత ధాకినీ శైన్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
చలిత వాల సంవేస్తిత కాయం –శ్రీ రామ దూతం శిరసా నమామి
యజిత రామ పాద యజురాది వాక్యం –శ్రీ రామ దూతం శిరసా నమామి
శ్రీకాకులేశాశ్రిత మందారం –శ్రీ రామ దూతం శిరసా నమామి
భక్త జన కాంక్షా ముక్తి విధానం –శ్రీ రామ దూతం శిరసా నమామి
లీలా వినోదిత దాస స్వరూపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
పరిపాలిత భక్త పాద పరికల్పం –శ్రీ రామ దూతం శిరసా నమామి
బుధ జన వేదిత పూర్ణ స్వరూపం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మోహన ఘన ”పెదముక్తీవి ”నివాసం –శ్రీ రామ దూతం శిరసా నమామి
భద్రాచల రామ భద్ర సమేతం –శ్రీ రామ దూతం శిరసా నమామి
వర సుందర రామ దాసాను దాసం –శ్రీ రామ దూతం శిరసా నమామి
మంగలమంజనా మారుతి పుత్రం — శ్రీ రామ దూతం శిరసా నమామి ..
రామయ్య దూతం మనసా స్మరామి –మనసా స్మరామి -మనసా స్మరామి . ;