Online Puja Services

భవసాగరాన్ని దాటించే ‘గోవిందనామాలు’

18.189.171.154

భవసాగరాన్ని దాటించే ‘గోవిందనామాలు’
 
నామస్మరణం అంటే భగవంతుని పేరు నిరంతరం జపించడం ఒక్కటి చాలు మనకి కావసినవన్ని అనుగ్రహించడానికి . వేదం చెప్పిన ఏ నామమైనా మనల్ని ఉద్ధరించగలదు. శ్రీ వేంకటేశ్వరుని భక్తులు నిరంతరం గోవిందనామాలని స్మరిస్తూ ఉంటారు .  మెట్లమార్గం గుండా తిరుమల నడిచి వెళ్లే భక్తులయితే, కొండెక్కేవరకూ ఈ నామ భజన చేస్తూనే ఉంటారు . వారి సౌకర్యార్థం తిరుమల దేవస్థానం మెట్లమార్గం వెంట ఈ నామాలని రాయించి ఉంటారు . ఈ నామాలు మొత్తం 108. ఈ నామాలని  ఉదయం లేదా సాయంకాలం స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, ప్రశాంత వాతావరణంలో వీలయినన్ని సార్లు పఠించి నట్లయితే ఏడు కొండల వాని అనుగ్రహం తప్పక లభిస్తుంది. మనసులో చదవటం ఉత్తమం. వినిపించీ వినిపించనట్లు చదవడం మధ్యమం. పెద్ద గొంతుతో అరిచినట్టుగా వీటిని  చదవడం అధమం. కాబట్టి వీలున్నంతవరకూ ఈ దివ్యమైన గోవింద నామాల మాలని చదువుతూ అపారమైన ఆ శ్రీనివాసుని కృపకి పాత్రులు కండి !! 

గోవిందనామాలు 

గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

(వీటిని ప్రతి నాలుగు నామాల తరువాత చదవాలి .)

శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సల గోవిందా
భాగవతప్రియ గోవిందా

నిత్యనిర్మల గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్ష గోవిందా

నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా

దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా

వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తి గోవిందా
గోపీలోలా గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా

దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా
పాండవ ప్రియనే గోవిందా

మధుసూదనహరి గోవిందా
మహిమ స్వరూపా గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకట రమణ గోవిందా

సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్బాంధవ గోవిందా

కరుణాసాగర గోవిందా
శరణాగత విదే గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలదా గోవిందా

పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా

ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతిప్రియ గోవిందా
ప్రసన్నమూర్తి గోవిందా

అభయమూర్తి గోవిందా
ఆశ్రిత వరద గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్ఙ్గగదాధర గోవిందా

విరజాతీర్థస్థ గోవిందా
విరోధిమర్దన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా

లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబర గోవిందా

వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
అన్నదాన ప్రియ గోవిందా
అన్నమయ్య వినుత గోవిందా

ఆశ్రితరక్షా గోవిందా
అనంత వినుత గోవిందా
వేదాంత నిలయా గోవిందా
వేంకట రమణ గోవిందా

ధర్మ స్థాపక గోవిందా
ధనలక్ష్మీ ప్రియ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
లోక రక్షక గోవిందా

వెంగమాంబ నుత గోవిందా
వేదాచల స్థిత గోవిందా
రామకృష్ణ హరి గోవిందా
రఘుకులనందన గోవిందా

వజ్రకవచధర గోవిందా
వసుదేవతనయ గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుకసంస్థుత గోవిందా

బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకళ్యాణా గోవిందా
నీరజనాభా గోవిందా

హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్పతీ హరి గోవిందా

అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివారణ గోవిందా
రత్నకిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా

స్వయంప్రకాశా గోవిందా
సర్వకారణా గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశ గోవిందా

ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా

పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
గరుడాద్రి వాసా గోవిందా
నీలాద్రి నిలయా గోవిందా

అంజనాద్రీశ గోవిందా
వృషభాద్రి వాస గోవిందా
తిరుమల వాసా గోవిందా
తులసీ మాలా గోవిందా

శేషాద్రినిలయా గోవిందా
శ్రేయోదాయక గోవిందా

శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీవేంకటేశ గోవిందా

సర్వేజనా సుఖినోభవంతు

#govindanamalu #venkateswaraswami #bhajan

Tags: govinda namalu, naamaalu, govinda, bhajana, venkateswara swami

Quote of the day

Our duty is to encourage everyone in his struggle to live up to his own highest idea, and strive at the same time to make the ideal as near as possible to the Truth.…

__________Swamy Vivekananda