Online Puja Services

విష్ణుసహస్రనామం, శివసహస్రనామం పఠించిన పుణ్యం

18.227.49.73

ఈ చిన్న పని చేశారంటే విష్ణుసహస్రనామం, శివసహస్రనామం పఠించిన పుణ్యం !!
- లక్ష్మి రమణ 

విష్ణుసహస్రనామం , శివసహస్రనామం పారాయణం చేయడం అనంత పుణ్యాన్ని అనుగ్రహిస్తాయి .  సుదీర్ఘమైన ఈ సహస్రనామాల్ని పారాయణ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు . సంస్కృతం మన భాష . ఒకప్పుడు ఈ దేశంలో విరాజిల్లిన రాజభాష. కానీ ఇప్పుడు ఈ భాషా పదాలని పలకడం కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి . మరి విష్ణు సహస్రనామ ఫలం, శివసహస్రనామ పారాయణా ఫలం మనకి దక్కేదెలా ? దానికి కూడా ఆ పరమేశ్వరి ఒక దారి చూపింది . ఒకప్పుడు పార్వతీ దేవి, విష్ణుసహస్రనామ పారాయణాన్ని కాస్త లఘువుగా ఆచరించేందుకు  స్వామీ ! అని పరమేశ్వరుణ్ణి ప్రశ్నించారట . 

అప్పుడు అసలు రహస్యం చెప్పారు పరమేశ్వరుడు . “పార్వతీ ! నిరంతమూ రామనామాన్ని స్మరిస్తే, విష్ణు సహస్రాన్ని జపించిన ఫలితం దక్కుతుంది. నేను కూడా నిత్యమూ అటువంటి మహత్తర ఫలాన్ని దక్కించుకునేందుకు రామ నామ పారాయణ చేస్తుంటాను. కేవలం ఒక  చదువుకుంటే చాలు . అటువంటి ఫలితం దక్కుతుంది . “ అంటూ ఆ మహత్తర రామ శ్లోకాన్ని ఇలా గౌరమ్మకి ఉపదేశించారు.     

“శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||”

రామనామం తప్ప ఈ శ్లోకంలో క్లిష్టమైన పదాలు ఏవీ లేవు . ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. అందువల్ల ప్రతి రోజూ చక్కగా చదువుకోవచ్చు. మూడు సార్లు కాకుంటే ముఫై సార్లు చదవచ్చు . అంత సులువుగా ఉంటుంది . 

దీని గొప్పదనం ఏమంటే, కేవలం సులువుగా ఉండడం, విష్ణుసహస్రనామ పారాయణా ఫలాన్ని అనుగ్రహించడం మాత్రమే కాదు , మనసు రాముని మీద నిలిచేలా చేయడం . అందుకే  గోచరించే జగతులో గోప్యమై దాగిఉండేది రామనామమని , శ్రీమదఖిల రహస్యమ౦త్ర విశేషధామము రామనామమని, జన్మ తరించడానికి ఈ నామమొక్కటే సాధనమని యోగులైనవారు చెబుతూంటారు . 

శుభం !!

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi