Online Puja Services

విష్ణునాభి రహస్యం

18.217.132.107

విష్ణునాభి రహస్యం ఇది కావొచ్చని  శాస్త్రవేత్తల అంచనా !
-సేకరణ 

గెలాక్టిక్ సెంటర్ అయినా విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలు ఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది ఒక గెలాక్సీలో (పాలపుంతలో )అని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కే లేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈ పాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్ సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. ఇదే విష్ణువు నాభి కావొచ్చు !! కానీ ఎలా ?

ఈ గ్యాలక్టిక్ సెంటర్  ప్రస్తుతం ధనూరాశిలో ఉంది. ఈ ధనూ రాశిలోనే గేలాక్టిక్ సెంటర్ దగ్గరగా మూలా నక్షత్రం ఉంది. మూలాల నక్షత్రం సరస్వతీదేవిదని , జ్ఞానానికి పుట్టుకగా మన ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతాయి .  ఈ ప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నదని సైన్సు అంచనా వేసింది.ఆ బ్లాక్ హోల్ ఒక పెద్ద నక్షత్రం సైజులో ఉండి, కొన్ని మిలియన్ల సూర్యుల సాంద్రతను కలిగి ఉంది. ఇది ఊహించ నలవి గానంత రేడియో తరంగాలను వేదజల్లగల శక్తిని కలిగి ఉంది. జ్ఞానమంటే వెలుగు అని మనం అనుకుంటే, ఈ మూలాల నక్షత్రాన్ని గురించి పెద్దలు ముందే ఈ విధంగా సూచించారా అని అనుకోవాలేమో !

మన సూర్యుని నుంచి ఈ బ్లాక్ హోల్  దాదాపు 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన సూర్యుడు తన సౌరమండల గ్రహాలతో సహా ఈ గెలాక్టిక్ సెంటర్ చుట్టూతా 200 మిలియన్ సంవత్సరాలలో ఒకసారి ప్రదక్షిణం చేస్తాడు. దీనికోసం ఆయన శూన్యంలో సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకొక విచిత్రం ఏమిటంటే- ఈ విష్ణు నాభి అనే ప్రాంతం ఒక ఎక్కుపెట్టబడిన విల్లువంటి ఆకారంలో,ధనుస్సులాగా ఉండి ధనూ రాశి అనే పేరుకు సరిగ్గా సరిపోతూ ఉంటుంది.

విష్ణు నాభి గురించి మన పురాణాలు చెప్పిన విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి . శ్రుతులు  విశ్వం మొత్తాన్నీ విష్ణు స్వరూపంగా వర్ణించాయి. విశ్వం విష్ణు: అంటూ విష్ణు సహస్ర నామం కూడా చెప్పింది. విష్ణు నాబినుంచి ఉద్భవించిన కమలంలో సృష్టి మూలమైన బ్రహ్మ జననం జరిగిందని పురాణాలు చెప్పాయి. మన గెలాక్సీకి కేంద్ర స్థానం అయిన ఈ సెంటర్ ను మన భాషలో నాభి అనవచ్చు. నాభి అనగా కుదురు, కేంద్రం అని అర్ధాలున్నాయి. అంటే విష్ణునాభి అయినగెలాక్టిక్ సెంటర్ - సృష్టికి మూలం అవడానికి చాలా దగ్గరి అవకాశాలు  ఉన్నాయి. 

ఇక్కడే ఉన్నటువంటి "మూలా" నక్షత్రమండలం ఈ ఊహకు ఆధారాన్ని కలిగిస్తున్నది. ఇందులో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి . సృష్టికి మూలమైన మహాశక్తి ఇక్కడే ఉన్నదని మనకు సూచన ప్రాయంగా తెలుస్తున్నది. ఇదే ప్రాంతంలో ఉన్నదని సైన్స్ ఊహిస్తున్న బ్లాక్ హోల్ ఆ శక్తి స్వరూపం కావచ్చునా? ఈ విషయం పురాణాలు రాసిన ఆ నాటి మన  మహర్షులకు ఎలా తెలిసి ఉండొచ్చనేది ఆలోచించాల్సిన విషయం . 
, ఈనాడు రేడియో టెలిస్కోపులకు కూడా లీలగా మాత్రమే అందుతున్న ఈ రాశిని, వాళ్ళు ఆరోజుల్లోనే  కళ్లతో చూసినట్లు "ధనూరాశి" అని ఎలా నామకరణం చేశారో, అందులో బ్లాక్ హోల్ సమీపంలోని నక్షత్రానికి "మూలానక్షత్ర మండలం" అని ఎలా పేరు పెట్టారోమన ఊహకు అందదు. 

రాహుకేతువులు- సృష్టి క్రమం- ఒక అంతుబట్టని రహస్యం. ధనూ రాశి బాణం ఎక్కుపెట్టిన ఒక విలుకాని రూపంలో ఉంటుంది. ఆ బాణం సరాసరి ఎదురుగా ఉన్న మిధున రాశి వైపు గురి పెట్టి ఉంటుంది. ఈ విధంగా ధనూ రాశి నుంచి మిధున రాశి వరకు ఒక గీత గీస్తే, అది జ్యోతిశ్చక్రాన్ని రెండుగావిభజిస్తుంది. మిధున రాశిలో రాహువుదైన ఆర్ద్రా నక్షత్రం ఉన్నది. ధనూ రాశిలో కేతువుదైన మూలా నక్షత్రం ఉన్నది. మిధున రాశి జంట మిధునానికి సూచిక. అనగా స్త్రీ పురుషులు జంటగా ఉన్న బొమ్మ ఈ రాశిని సూచిస్తుంది. దీన్ని బట్టి ఏం అర్ధం అవుతున్నది? మూలా నక్షత్రం ఉన్న ధనూ రాశి నుంచి స్త్రీ పురుషుల సృష్టి జరిగడానికి అవసరమైన శక్తి ప్రసారం మిధున రాశి వైపు జరుగుతున్నది అని తెలుస్తున్నది. 

అంటే ప్రధమంగా విశ్వంలో జీవావిర్భావానికి మూలం అయిన శక్తి ప్రసారం ధనూ రాశిలో ఉన్న మూలా నక్షత్ర ప్రాంతం నుంచి మిధున రాశి వైపుగా జరిగి ఉండవచ్చు. ఇక్కడే ఇంకొక విచిత్రం ఉన్నది. ఈ నాటికీశిశు జననం జరిగినప్పుడు బొడ్డు కోయడంజరుగుతుంది. గర్భస్ఘ శిశువుకు బొడ్డు ( నాభి) ద్వారానే తల్లినుంచి పోషణ అందుతుంది. అలాగే విశ్వం మొత్తానికీ శక్తి ప్రసారం విశ్వ నాభి అయిన గెలాక్టిక్ సెంటర్లో ఉన్న మూలా నక్షత్రం నుంచి జరుగుతూ ఉండవచ్చు. ఆ శక్తి కేంద్రంతో బంధం తెగిన మరుక్షణం జీవి మాయామోహాలకు లోబడి మానవ జన్మలోకి ఆడుగు పెట్టటం జరుగుతుండవచ్చు. అద్భుతంగా ఉన్నాయి కదూ ఈ విశేషాలు .  

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore