ఒకేసారి ఇద్దరు కవల సోదరులకి ఉపనయనం చేయాలంటే ఎలా ?
ఒకేసారి ఇద్దరు కవల సోదరులకి ఉపనయనం చేయాలంటే ఎలా ?
- లక్ష్మి రమణ
ఉపనయన సంస్కారం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ! అయితే, కవల సోదరులకు తండ్రి ఉపనయనం చేయాల్సి వచ్చినప్పుడు , ఆ శుభముహూర్తానికి ఇద్దరికీ ఒక్కరే బ్రహ్మోపదేశం చేయడం సాధ్యం కాదుకదా ! ఆ సమయంలో ఉపనయనంకి పాటించవలసిన నియమాలు ఏమిటి? ఒకే ముహూర్తంలో ఇద్దరికీ ఎలా ఉపనయనం చేయాలో ఇక్కడ తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం .
ఉపనయనం ఒక సంస్కారం. ఏ వయసులో చేయవలసినది ఆ వయసులో తప్పకుండా చేయాలి. ఒకేసారి అన్నదమ్ములకు ఉపనయనం చేయాల్సి వచ్చినప్పుడు ఒకరికి తండ్రి , అదే ముహూర్తానికి మరొకరికి తాతగారు బ్రహ్మోపదేశం చేయవచ్చు. కావాలా సోదరుల విషయంలో మాత్రమే ఇది వర్తించదు. ఇద్దరు అన్నదమ్ములకు ఒకే ముహూర్తం వారి వారి జాతక బలం బట్టి కుదిరేటట్టయితే, ఆ సమయంలో కూడా ఈ విధంగా ఉపనయనం చేయవచ్చు అని సూచిస్తున్నారు పండితులు. అయితే, ఇద్దరిలో పెద్ద వాడికి ముందుగా ఉపనయనం జరగాలి . కాబట్టి, మొదట అన్నగారికి , ఆతర్వాత తమ్మునికి ఉపదేశం చేయవచ్చు.
ఈ రోజుల్లో జాతక ప్రకారం కాకుండా శంకర జయంతి వంటి పుణ్య తిథుల్లో సామూహిక ఉపనయనాలు చేస్తూన్నారు. దీనికన్నా , జాతక ప్రకారం చేయడం ఉత్తమం. అన్న దమ్ములకు ఒకే సారి చేయడం కొందరికి ఇష్టం ఉండదు. ఇది సంస్కారం కాబట్టి మంచి ముహూర్తం దొరకడం అరుదు అని కొందరి అభిప్రాయం.
ఏదేమైనా ఈ విషయంలో అనుభవజ్ఞులైన పురోహితుల సలహాని తీసుకోవడం మంచిది. హితోక్తి వర్చువల్ పూజారి మీకు ఇటువంటి సేవలని అందిస్తుంది . ఈ సేవని పొందడానికి హితోక్తి వర్చువల్ పూజారిని సంప్రదించండి . అనుభవజ్ఞులు, వేదకోవిదులు అయిన పురోహితులు మీకు సరైన సలహాని అందజేస్తారు . శుభం .
Vupanayanam, thread ceremony, twin brothers