ఆంగ్లేయుల అరాచకానికి అడ్డుకట్టవేసిన గురు రాఘవేంద్రులు .
తన బృందావనం నుండే ఆంగ్లేయుల అరాచకానికి అడ్డుకట్టవేసిన గురు రాఘవేంద్రులు .
- లక్ష్మి రమణ
భారత దేశంలో అడుగడుగునా ఒక గుడి ఉంది . అందులోని దైవం సనాతనం . కేవలం ఒక రాతి బొమ్మకాదు అనడానికి ఆనాటి నుండీ ఈ నాటి వరకూ ఎన్నో దృష్టాంతారాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి . ఉంటాయి కూడా ! మన దేశాన్ని పట్టి పీడించిన పరాయి పాలకులకి సైతం ఎన్నో సార్లు ఆ భగవంతుడు స్వయంగా దర్శనమిచ్చిన సందర్భాలున్నాయి . దాని వలన వారిలో వచ్చిన పరివర్తన అసామాన్యమే . అందుకు ఉదాహారణలుగా ఇప్పటికీ కంచిలో అమ్మవారు తొడుక్కునే పీటర్ పాదుకలు కనిపిస్తాయి . భద్రాచలంలోని ముత్యాల తలంబ్రాలు దర్శనమిస్తాయి . కల్నల్ మార్టీన్ కి దర్శనమిచ్చిన శివుడు కనిపిస్తాడు . ఇలా ఎన్నో ! తురుమలేశునికి ప్రసాదం సమర్పించే మన్రో గంగాళాలు కనిపిస్తాయి . అటువంటిదే మరో అద్భుతమైన అనుభవం థామస్ మన్రోకి ఎదురయ్యింది. బ్రిటీష్ వారి కుతంత్రానికి అడ్డుకట్ట వేసిన దైవలీల ఇది .
క్రీ.శ. 1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమానయినా మరణిస్తే, ఆ చట్టం ప్రకారం, ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు, ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్టంప్రకారం, మంత్రాలయo రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు, స్వాధీనపరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి, బృందావనం దగ్గర నిలబడగానే, బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో, రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు.
కాసేపు మాట్లాడిన పిమ్మట, మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి, బృందావనం సాదారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదు .తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి, స్వామి జీవించి ఉన్నట్టే అని మన్రో తీర్మానించుకున్నారు. దాంతో చట్టం నుండి, మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో, "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా శాసించే స్వరం, దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు" అని వ్రాసుకున్నారట .
ఇది ఈ దేశం మీద కుట్ర చేయాలి అనుకున్న ఆంగ్లేయులకు కనిపించిన ప్రత్యక్ష దైవ నిదర్శనం . సంతాన ధర్మం గొప్పదనాన్ని ఇంతకన్నా గొప్పగా ఎవరు నిరూపించగలరు ! ఇదే థామస్ మన్రో కి మరెన్నో అద్భుతమైన దృష్టాంతరాలని భగవంతుడు ప్రత్యక్షంగా చూపించడం మరో విశేషం . మరో పోస్ట్ లో వాటిని గురించి చెప్పుకుందాం . శుభం .
Raghavendra, swami, swamy, mantralayam, manro, manroe, englandi, east india, english, british,