ఈ చిన్న శ్లోకం నాగదోషాన్ని హరించి సంతానాన్ని ఇస్తుంది
ఈ చిన్న శ్లోకం నాగదోషాన్ని హరించి సంతానాన్ని ఇస్తుంది .
- లక్ష్మి రమణ
తెలుగు నిఘంటువులు నాగులు సప్తగాణాలైన ఋషులు, గంధర్వులు, నాగులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, దేవతలలో ఒకరు . నాగులు అంటే, కేవలం మనకి కనిపించేవి మాత్రమే కాదు . దివ్యమైన నాగులు . అవి భువిలో , అంతరీక్షంలో, దివ్య లోకాలకి చెందినటువంటివి . నాగులని అర్చించడం, వారిని జ్ఞాన ప్రదాయకాలుగా అర్చించడం మన సంప్రదాయంలో ఒక భాగం . దేవతా మూర్తులైన నాగుల ఆరాధనకు సంబంధించిన ఒక చిన్న శ్లోకం రోజూ చదువుకుంటే, ప్రత్యేకించి ఉదయం పూట చదువుకుంటే , నాగ దోషాలు హరించుకుపోతాయి. సంతానం కలుగుతుంది . సర్పాలు కనిపించినప్పుడు స్మరిస్తే, విష భయం ఉండదు. సర్వకార్యాలలో జయం సిద్ధిస్తుంది . ఆ దివ్యమైన శ్లోకం ఏమిటో చూద్దాం .
నవనాగ నామ స్తోత్రం (శ్రీ నాగ స్తోత్రం )
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!
ఫలశృతి:
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!
సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్!!
ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి
ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.
(ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర నిధి పుస్తకం నుండీ గ్రహించబడింది . )