పితృదేవతల అనుగ్రహం కోసం చేయాల్సిన కార్యక్రమం
చైత్రమాసం నుండీ పితృదేవతల అనుగ్రహం కోసం చేయాల్సిన కార్యక్రమం ఇదీ !
- లక్ష్మి రమణ
చైత్రమాసం చక్కని పర్వదినాలలో పాటు సూర్యతాపం కూడా కలిగి ఉంటుంది . ఇక ఎండాకాలం ముదురుతున్న మాట స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది . పగలంతా ఎండ వేడి, రాత్రంతా చల్లని వెన్నెల హాయి, విరిసిన మల్లెల సుంగంధమూ, కోయల గానం కలిసి ఒక చిత్రమైన శోభతో నిండి ఉంటుంది వాతావరణమంతా . ఇటివంటి చైత్రమాసం నుండీ మనం పితృదేవతలా సంతృప్తి కోసం చేయదగిన కార్యక్రమం ఒకటి ఉంది .
పితృదేవతల అనుగ్రహం దేవతా అనుగ్రహం కంటే కూడా గొప్పది . అందువల్ల పితృదేవతలని సంతృప్తి పరిచే ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా మనం వదులుకో కూడదు. పితరులు దేవతల్లాగానే చక్కని మంచి పనులు చేస్తే సంతోషిస్తారు . ఆ విధంగా చేయడం వలన పితరుల అనుగ్రహం మనకి సిద్ధించడమే కాకుండా, మన పితరులకు కూడా పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయి .
చైత్రమాసంలో మొదలుకొని చేయవలసిన ఈ కార్యక్రమం చాలా సులభమైన నాలుగు నెలల ప్రణాళిక. ఈ నాలుగు నెలలూ ప్రజలు దాహార్తితో అలమటిస్తూ ఉంటారు . వారికి దాహం ఇవ్వడం కన్నా మించిన పుణ్యం మరొకటి లేదు. కాబట్టి చైత్రమాసం మొదలుకొని నాలుగు నెలలపాటు చలివేంద్రాన్ని నిర్వహించడం , మజ్జిగ ఇచ్చే ఏర్పాటు చేయడం పితరులకు పుణ్యలోకాలని ప్రాప్తింప జేస్తుంది . తెలియాకైనా ఈ సేవ మనకు వారితోపాటు దైవానుగ్రహాన్ని కలిగేలా చేస్తుంది .
చలివేంద్రాన్ని నెలకొల్పేప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలని పూజ్య గురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు తెలియజేస్తున్నారు .
“ప్రపేయం సర్వసామాన్య భూతేభ్యహః ప్రతిపాదతే ప్రదానాత్
పితరసర్వే తృప్యంతు చ పితామహః అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం”.
జలాన్ని సర్వ జీవులకీ ఇవ్వడం వలన లేదా దానం చేయడం వలన పితరులందరూ కూడా సంతుష్టులై దైవానుగ్రహాన్ని పొందే వీలుంటుంది.
సర్వేజనా సుఖినోభవంతు !! శుభం !!