బూడిద ( తెల్ల) గుమ్మడికాయతో ఈ చిన్న పరిహారం
బూడిద ( తెల్ల) గుమ్మడికాయతో ఈ చిన్న పరిహారం అందరూ పాటించవచ్చు !!
-సేకరణ
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు , ఇంటిముందర గుమ్మడికాయ కట్టుకోవడం కూడా ఒక రకమైన పరిష్కారమే . ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని లేదా నెగిటివ్ ఎనర్జీని నిరోధించడం సాధ్యం అవుతుంది అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. నరుడి దృష్టికి నల్లరాయయినా పగులుతుంది అంటారు కదా ! అలా మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు దృష్టిని , ప్రభావాన్ని ఆ గుమ్మడికాయ స్వీకరించి, మన ఇంటిని రక్షిస్తుంది .
ఒకవేళ ఇప్పటికీ మీరు దిష్టిగుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్ల గుమ్మడికాయ (బూడిద గుమ్మడికాయ) తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాసి దాన్ని ఇంటిముందు ఉట్టిలో వేలాడదీయండి. ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి .
ఈ గుమ్మడి కాయలని కూష్మాండం అని పేరు. అంటే తలకాయ . సాక్షాత్తూ తలకాయనే ఇంటిముందు వేళ్ళాడదీశామ్ . ఇక దిష్టి ఎలా తగులుతుంది ? బాలి రూపంగా కూడా కూష్మాండం మహా ప్రశస్తమైనది . పూర్వమున్న బలి సమర్పణ విధుల్లో చాలా సందర్భాల్లో కూష్మాండ బలిని శాస్త్రం ఆమోదిస్తుంది.
అయితే, ఒకవేళ ఇలా కట్టిన గుమ్మడికాయలు తరచుగా, కట్టిన కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే, ఆ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని అర్థం . అలా పాడైపోయిన గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్నవారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను చక్కగా కట్టుకోవచ్చు .
గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష , నరపీడ, నరద్రుష్టి, నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా తొలగించే శక్తి కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి, ఈ చిన్న పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించడం మంచిది. మరి ఇంకెందుకాలశ్యం, ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి, ఇంటుముందు కట్టేయండి.
శుభం !!