Online Puja Services

కుటుంబంలో కలతలు

3.144.31.86

కుటుంబంలో కలతలు తొలిగిపోయి, సత్సంబంధాలు ఏర్పడేందుకు, ఇలా చేయండి . 
- లక్ష్మి రమణ 

కలతలు, కలహాలు , విభేదాలు , ఘర్షణలు ప్రతి కుటుంబంలో ఉంటూనే ఉంటాయి . ఇంటింటిదీ ఒక రామాయణమని మన పెద్దలు ఊరికే అన్నారా మరి ! ఇటువంటివి ముందర గృహంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తాయి .  మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో తిరిగి ఇంట్లో సహృద్భావ వాతావరణం నెలకొనడానికి పండితులు ఉద్దేశించిన పరిష్కారాలు ఇక్కడ మీకోసం . 

విష్ణుమూర్తి ఎల్లప్పుడూ సాగరంలో ఉన్న మహా శేష నాగేంద్రుని పైన శయనించి ఉంటారు. చిరునవ్వులు చిందించే ఆ స్వామిని సేవిస్తూ లక్ష్మీ దేవి పాదాల చెంత ఉంటారు.  ఆయన స్థితికారకుడు. పోషకుడు . మన చుట్టూ చుట్టలు చుట్టుకొని ఉండే సమస్యలని చిరునవ్వుతో అధిగమించే శక్తిని ఇస్తారు. లక్ష్యాన్ని సిద్ధింపచేయడానికి అవసరమైన సిద్ధి ఆయన శక్తి. కనుక సమస్యలన్నీ  తొలగిపోవాలంటే, కలతలు మాసిపోవాలంటే, ఆశ్రయించాల్సిన భగవంతుడు ఆ శేషతల్పశాయే !!విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పారాయణ చేయడం వలన ఈ సమస్యల నుండీ పరిష్కారం దొరుకుతుంది . చేపట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది . 

ఈ విషయంలో మనకి సహాయాన్ని చేసే మరో దైవం అమ్మవారు లలితా దేవి.  భువన భువనాంతరాళాలతో కూడిన సమస్త విశ్వాన్ని పాలించే శక్తి సమన్విత లలితా పరా భట్టారిక. త్రిమూర్తులకీ శక్తినిచ్చే శక్తి  . విభేదాలు, ఘర్షణలు , తగాదాలు, మనస్పర్థలు వంటివి ఏ కారణాల చేత సంభవించినా వాటిని తొలగించే శక్తి ఈ మాత అనుగ్రహం వలన సిద్ధిస్తుంది. 

    అందువల్ల నిత్యమూ విష్ణు, లలితా సహస్రనామ స్తోత్రాలు పారాయణ చేయడం వలన  కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోతాయి.  కుటుంబంలో తిరిగి అందరూ కలిసి మెలిసి ఉండేలా సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు ఈ పారాయణ సాయపడుతుంది. దాంతోపాటు సమస్యలని ఎదుర్కొనే శక్తి, దుష్ట శక్తుల నుండీ రక్షణ కూడా లభిస్తాయి అని పండితులు సూచిస్తున్నారు. శుభం . 

 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi