సమస్యలకి సూక్ష్మమైన పరిష్కారాలు .
వేధించి , వేదనకి గురిచేసే సమస్యలకి సూక్ష్మమైన పరిష్కారాలు .
- లక్ష్మి రమణ
దీపారాధన నిత్యమూ మనం చేసుకుంటూనే ఉంటాము . అసలు దీపం వెలిగించకుండా చేసే ఆరాధన వాళ్ళ ప్రయోజనం లేదంటారు పండితులు. అగ్ని సాక్షీ స్వరూపం . అగ్ని సృష్టి స్వరూపం . అగ్ని సకల దేవతా స్వరూపం . ప్రత్యక్షంగా ఆ పరమాత్మే అగ్ని. ఇంకా ఆ దేవతలు మనం ఇచ్చే ఆహారాన్ని అగ్ని ముఖంగా స్వీకరిస్తారని వేదాలు చెబుతున్నాయి. అందుకె పూజ చేసేప్పుడు దీపారాధన తప్పకుండా చేయాలి . అయితే ఆ అగ్నికి ఆధారంగా ఉండే కుందిని పిండితో చేస్తూ ఉంటారు . ఆ పిండికి వాడే ధాన్యాన్ని బట్టీ, అందులో ఆహుతిగా ఉండే ద్రవ్యాన్ని ( చమురు / నెయ్యి) బట్టీ , కొన్ని ఈతిబాధలకి పరిష్కారం లభిస్తుంది అని చెబుతున్నారు పండితులు . ఆ విశేషాలు ఇక్కడ మీకోసం .
1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు-
ఆరోగ్య సిద్ధి కోసం దీపారాధనలో అవనూనె వాడండి.
2. ఉపద్రవాలు, పనుల్లో ఆటంకాలు తొలగడానికి-
గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని కలిపి పిండి చేసి ఆ పిండితో దీపపు ప్రమిదని తయారు చేసుకోండి. అందులో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి.
3. పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి-
బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి-
శనికి ఇష్టమైన ధాన్యం నువ్వులు . నల్ల నువ్వులని పిండిగా చేసి , ఆ పిండితో ప్రమిద తయారు చేసుకొని, ఆ ప్రమిదలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయాలి. దీనివల్ల శని బాధలు ఉపశమించడంతో పాటు , జీవితం పైన దాడి చేస్తున్నట్టుండే కష్టాలూ, గాలి ధూళి దోషాలూ తొలగిపోతాయి .
5. కోరికలు నెరవేరేందుకు
బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి.
6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి
కందిపిండితో చేసిన ప్రమిద తయారు చేసుకొని, ఆ ప్రమిదలో దీపారాధన చేయాలి.
7. దృష్టి దోషాలు పోయి, శత్రువిజయం పొందేందుకు :
పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. దృష్టి దోషాలు పోయి శత్రు విజయం సిద్ధిస్తుంది.
8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు:
ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, అలా కలిపిన సుగంధ భరితమైన నూనెతో దీపారాధన చేయాలి.
సూక్ష్మంలో మోక్షం చూడండి , అలా … వేధించి , వేదనకి గురిచేసే ఇటువంటి సమస్యలకి సూక్ష్మమైన ఇటువంటి దీపారాధనతో పరిష్కారాలు పొందవచ్చు . శుభం !!
#microsolutions #problems
Tags: problems, micro solutions