Online Puja Services

మనుషులకి రోమాలు ఎందుకొచ్చాయో తెలుసా !

18.118.144.199

మనుషులకి రోమాలు ఎందుకొచ్చాయో తెలుసా ! అవి స్వయంగా శక్తి స్వరూపాలు అని తెలిస్తే ఆశ్చర్యపోమా !
లక్ష్మీ రమణ 

రోమాలకీ దేవీ స్వరూపానికి లింక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా ? ఉంది. గట్టి లింకే ఉంది. పురాణాలన్నీ శౌనకాది మహర్షులకి, సూతమహాముని చెప్పినట్టుగా మనకి లభిస్తున్నప్పటికీ, నిజానికి వీటిని రచించిన వారు వేదవ్యాసులవారు . శృతులుగా పేరొందిన ఈ పురాణాలు వ్యాస విరచితమైన ఎందుకు ఇలా సూతమహాముని వివరించినట్టుగా ఉంటాయనేది వేరే కథ . కానీ ఆ వ్యాసుడికి దేవి ఇచ్చిన దర్శనంలోనే రోమాల పుట్టుక, అవి మన శరీరం మీదికి ఎలా వచ్చాయన్న విషయమూ దాగుంది. దేవీభాగవతాంతర భాగమైన ఈ కథని తెలుసుకుందాం పదండి . 

రామాయణ, భారత, భాగవతాదులతో పాటుగా అష్టాదశపురాణాలనూ భగవానుడు వేదవ్యాసులవారు రచించారు . అద్భుతమైన ఈ పురాణ రచనా యజ్ఞం చేశినా ఆయన జిజ్ఞాస చల్లారలేదు . ఈ సృష్టిని రచించి పాలించి లయం చేసే వారు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు. ఇక వారికి ఈ కార్యక్రమాలలో తోడునీడగా నిలిచేవారు ఇరత దేవీ దేవతలు. కానీ ఆ త్రి మూర్తులు ఎలా ఉద్భవించారు ? వారి జన్మ రహస్యాలేమిటి ? ఆనింటికి ఆది అయిన ఆ పరమశక్తి ఏది ? ఆ శక్తి ఉద్భవం ఎలా జరిగింది ? ఈ ప్రశ్న ఆయన అంతరంగాన్ని తొలిచేయడం మొదలు పెట్టింది . ఆ జిజ్ఞాసతోటే ఆయన భగవంతుని ప్రార్థించారు . ఆ తొట్టతొలి ఆదిశక్తిని చూపించాల్సిందిగా వేడుకున్నాడు . ఆర్ద్రమైన మనసుతో, నిండైన భక్తితో , విపరీతమైన జ్ఞాన జిజ్ఞాసతో ఆయన చేసిన ప్రార్థనని ఆ పరమాత్మ , పరం శక్తి ఆలకించింది . 

అప్పుడు ఆయనకీ అశరీరవాణి వాక్కు వినిపించింది. దాంతోపాటే, ఓంకారం కళ్ళముందు సాక్షాత్కరించింది . వెనకాల అశరీరవాణి వాక్కు ఇలా వినిపించసాగింది . “సృష్టికి మూలమైన శక్తి ఇదే ! నిరాకార, నిర్గుణ, నిరాధార, నిర్గంధమైన ఆ శక్తి స్వరూపం ఇదే “ నన్నది అశరీరవాణి . ఆ వేదవ్యాసుడు మరింతగా తన కంటి నుండీ కన్నీటి ధరలు కురిపించాడు . ఎమ్మా ! నన్ను పరిహసిస్తున్నావా ? అని అమాయకంగా అడిగాడు . కాదు వ్యాసా ! ఇదే సత్యము . మొట్టమొదట ఉద్భవించిన శక్తి ఈ శబ్దమే . ఈ శబ్దం దాల్చిన మాతృ రూపమే ఈ సృష్టికి మూలము. ఆ మాతృ స్వరూపాన్ని కూడా అవలోకించు అంటూ అశరీరవాణి వాక్కు  పూర్తి కానేలేదు .  అంతలోనే , ఒక దివ్యమైన స్త్రీ స్వరూపం ఓం కారం చేస్తూ భువన భువనాంతారాళాల  వరకూ విస్తరించి వ్యాసుని ముందర సాక్షాత్కరించింది .

 దిగంబరంగా ఉన్న ఆ స్త్రీమూర్తి శరీరం పైన ఒక్క వెంట్రుక కూడా లేదు . విశ్వమంతా ప్రతిధ్వనిస్తుందా అన్నట్టున్న ఓంకార నాదం ఆమె నోటి నుండీ వ్యక్తమవుతోంది . ఆ ధ్వని అలా ఆ విశ్వజనని స్వరూపంగా అవతిరించిందనే విషయమవగతం అయ్యేలోపాలే, మరో అద్భుత దృశ్యం వ్యాసునికి కనిపించింది . ఆ దేవి యోనినుండీ అనేకమైన నల్లని పాముల వంటి జీవులు జనిస్తున్నాయి. అసంఖ్యాకంగా ఉన్న ఆ జీవులు, తమకి ఆధారమెక్కడ అని వెతకడం లేదు . ఆ దేవి శరీరంపై ఎక్కడ అందితే అక్కడ తమ నోటితో కరిచి పట్టుకుంటున్నాయి . అవి చేస్తున్న ఉస్ ఉస్ అన్న శబ్దాలనీ , వాటి కోరలు దిగబడి తనకయిటున్న గాయాలనీ ఆడేవి ఓర్పుగా, వాత్సల్యంగా సహిస్తోంది . ఓం ఓం అంటూ ఊరడిస్తోందే తప్ప ,  విదిలించి కొట్టడం లేదు .  అమ్మ తన స్తన్యమిచ్చేప్పుడు, బిడ్డ కోరికినా , ఆ బాధని పళ్ళబిగువునా భరిస్తుంది గానీ, బిడ్డ ఆకలి తీర్చడం మాని , విదిలించి కొట్టదు కదా ! సమస్తమైన ప్రకృతికీ మూలదేవి అయినా ఆ దేవీ స్వరూపం ఆ పని ఎలా చేయగలుగుతుంది మరి !    

ఆ దేవిని దర్శించుకోవడానికి వచ్చారు ఆమె నుండీ ఉద్భవాన్ని పొందిన శక్తులైన వివిధ దేవతా రూపాలు . వారన్నారు “ అమ్మా ! దిగంబర స్వరూపిణివై , వంటినిండా పాములతో నువ్వు ప్రళయ భయంకరంగా  కనిపిస్తున్నావు . అమ్మ నిన్ను చల్లని తల్లిగా , కరుణామృత వల్లిగా చూడాలని ఉందమ్మా ! ఆ పాముల్ని చూస్తుంటే, చాలా భయం కూడా కలుగుతోంది . అవిచేసే ఉస్ ఉస్ అనే శబ్దాలు కర్ణ కఠోరమై వినిపిస్తూ ఉంది . కాబట్టి దివ్యస్వరూపిణివై మమ్మల్ని అనుగ్రహించవలసింది “ అని కోరారు . అప్పుడు ఉదయిచింది శశిరేఖ వంటి చిరునవ్వు అమ్మవారి పెదవులపైన. 

ఆ నవ్వులోని వెన్నెల చూసి , ఆ పాములన్నీ అర్థం చేసుకున్నాయి. ఇక తాము అమ్మని వీడాల్సిందే అని . అవన్నాయి “అమ్మా! మీరు లేకపోతె, మేమంతా ఏమై పోతాము ? మేము ఎక్కడుంటాము ? ఎలా జీవించాలి ? తల్లీ ! మమ్మల్ని వీడవద్దన్నాయి “ అప్పుడు అమ్మవారు , వారికో తరుణోపాయం సూచించారు .  మీరందరూ సర్పజాతిగా పేరొంది పూజింపబడతారు . సంతానబీజాలై ,  పురుషస్వరూపమైన పరమాత్మగా ప్రకాశిస్తారు.  ఇక ఆ పరమాత్మిక అయిన నేను, పరమాత్మ స్వరూపునిగా సగభాగం పరమేశ్వరునిగా వర్ధిల్లుతాను . కాబట్టి , ఆయన నా సంతానమైన మిమ్మల్నే ఆభరణాలుగా ధరిస్తారు . అనంతర కాలంలో మా ఇద్దరి పుత్రుడై ఉద్భవించే, సుబ్రహ్మణ్యుడు మీ స్వరూపంగానే పూజలు అందుకుంటాడు .  ఇక మీ స్థానం ఎక్కడ అన్నారు కదూ ! మీరు రతనాల  పంటలు పండించే రైతన్నకు సాయంగా ఉండండి . ఆ పంటల్ని రక్షిస్తూ కాపుకాయండి . యందుకంటే, ఆ పంటల్లో ఉండేది ప్రక్రుతి నైన నేనే కదా ! ఇక నా స్వరూపంగా జనించే, సృష్టిని , మీరు నన్ను ఏవిధంగా కరిచి పట్టుకొని ఉన్నారో , అదేవిధంగా రోమాలై కరిచి ఉండండి.” అని ఆశీర్వదించింది . వెంటనే, అమ్మ స్వరూపము దివ్య ప్రభలతో వెలుగొంద సాగింది . అమ్మ వారి శరీరం పైన రోమాలు ఆవిష్కృతమయ్యాయి . రోమాలు లేని ఆమె శిరస్సు నల్లని తుమ్మెద రెక్కల వంటి కురులతో భాసించ సాగింది . అమృతోపమానమైన ఆ దివ్య స్వరూపము నుండీ ఒక దివ్య పురుషుడు ఉద్భవించాడు.  ఆయనే పరమేశ్వరుడు . ఆయన నాగులనే ఆభరణాలుగా ధరించి ఉన్నారు .

ఈ విధంగా ఆవిర్భవించిన జగత్శక్తి స్వరూపిణి అయినా అమ్మని ఊహించుకోవడానికైనా ఎన్ని కళ్ళుండాలి కదా ! ఆ దేవి ఆవిష్కృతమైన విధానమే రోమాంచకంగా ఉందంటే, ఆ వ్యాసుడు చూసి ఎంతటి ధాన్యతని పొందాడో ఊహించడమా కూడా కష్టమే మరి ! ఇంతకీ ఇలా రోమాలు మన శరీరాలపై ఆవిర్భవించాయని దేవీ పురాణం చెబుతుంది . రోమాలని పీకి వాటి మొదలుని పరీక్షించిన కూడా రెండు నాల్కలుగా విడిపోయిన వాటి కుదురు చూస్తే, సర్పసదృశ్యం గానే కనిపిస్తుంది .  శక్తి జుట్టులో ఉంటుందని పెద్దలు అనడం వెనుక ఇది కూడా ఒక కారణం అయ్యుంటుందేమో మరి ! 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore