దాదాపు వెయ్యేళ్ళ క్రితం విమానాలు ఉన్నాయా ?
భోజరాజు కాలంలో అంటే, దాదాపు వెయ్యేళ్ళ క్రితం విమానాలు ఉన్నాయా ?
సేకరణ
భోజమహారాజు (క్రీస్తు శకం 1010- 1055) మహావీరుడు. ధర్మవర్తనుడు . అంతేకాదు ఆయన ఒక కవి . కవి ప్రేమికుడు కూడా ! ఆయన ‘సమరాంగణ సూత్రం’ అని ఒక గ్రంథం రాశారు . ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయాలని భోజరాజు ప్రస్తావించారు . వాటిల్లో యంత్ర నిర్మాణం, ఆకాశంలో ప్రయానా , విమానాల తయారీ వంటి విషయాలు ప్రస్తావించారు . ఆ వివరాలని తెలుసుకుందాం .
భోజరాజు ఒక గొప్ప మహారాజుగా మనందరికీ తెలుసు. ఇతని ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు ఉండేవారని చరిత్ర చెప్తోంది. కానీ ఈయన "సమరాంగణసూత్ర ధార " అనే గ్రంధం వ్రాశారని తెలిసిన వారు చాలా తక్కువ . ఈ గ్రంధంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన చర్చించారు , వివరించారు . వాటిల్లో "యంత్రాలు ఎలా తయారు చేయాలి?", "ఆకాశంలో ప్రయాణించడం ఎలా సాధ్యం?" అనే విషయాలు ప్రస్తావించడం విశేషం .
ఆయన రచనే అయిన ‘అమరకోశం’లో 'వ్యోమయానం విమానోస్త్రీ' అని ఉంది. అంటే "ఆకాశంలో ప్రయాణించే వాహనానికి విమానమని పేరు" అని అర్థం. భోజరాజు తన 'సమరాంగణసూత్రం'లో విమాన నిర్మాణవిధానం గూర్చి వ్రాస్తూ, తాను విమాన నిర్మాణం గురించి స్థూలంగా తత్త్వము(theory) మాత్రమే వ్రాస్తున్నాననీ, దానిని నిర్మించే విధానం తెలిసే వదిలేస్తున్నాననీ, దానిని రాయడం లేదనీ, చేయడం ఎలాగో చెప్పడం వల్ల సామాన్య జనానికి సుఖం బదులు కష్టమే ఏర్పడుతుంది అని పేర్కొన్నారు .
1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.
చిత్తశుద్ధి లేని వారి చేతిలో ఇలాంటివి పడితే పసిపిల్లల చేతిలో విషం ఉన్నట్లే కదా!
ఇతర దేశాలలో నూతనశాస్త్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మనదేశంలో ఉన్నశాస్త్రాలు కూడా నామరూపాలు లేకుండ నశిస్తున్నాయి. ఉన్న శాస్త్రాలను ఉపయోగించుకొనే పద్దతి మనకు తెలియడంలేదు. ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసికొనడానికి పరిశోధనలు చెయ్యాలి. మనకు అర్థము కాకపోయినా మన తర్వాతి తరం కొరకైనా వానిని రక్షించాలి. ఇప్పుడు అర్థము కాకపోయినా మరియొక కాలంలోనైనా అవి ఉపయోగపడతాయి.
మిగిలిన దేశాలు మొదట అజ్ఞానదశలో ఉండి క్రమేణ జ్ఞానదశకు వచ్చాయి. మన దేశము ఆరంభ కాలములో ఉచ్చస్థితిలోఉండి క్రమేణ క్షీణస్థితికి వచ్చి మళ్లీ ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్తోంది.
ఇప్పటికే ఎన్నో శాస్త్రాలు మనకు దొరకడం లేదు. ఉన్న శాస్త్రములను మూర్ఖంగా పనికిమాలినవని పారవేస్తే మనకే నష్టం. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి. నిరూపణ కానిదే దేనినీ ఖండించుటకు మనకు అధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం ఉంది.